Guppedantha Manasu: 'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!

Guppedantha Manasu Serial : గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది వసుధార...

Continues below advertisement

Guppedantha Manasu Update:  గుప్పెడంత మనసు సీరియల్ పనైపోయిందని ప్రేక్షకులు అనుకున్న ప్రతిసారీ ఊహించని మలుపులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా రిషి లేకుండానే సీరియల్ నడిపిస్తున్నారు. జిమ్ లో గాయపడిన ముఖేష గౌడ బెడ్ రెస్ట్ లో ఉన్నాడని త్వరలోనే వస్తాడని చెప్పారు. కానీ దాదాపు మూడు నెలలు గడుస్తున్నా రిషి లేకుండానే సీరియల్ సాగుతోంది. అయితే రిషి లేకుండా నడవడం లేదు...కిడ్నాప్ అయ్యాడనో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనో చూపిస్తూ కొన్నాళ్లు నడిపించారు. ఆ తర్వాత రిషి చనిపోయాడని హడావుడి మొదలెట్టారు. అయినప్పటికీ రిషి చుట్టూనే నడుస్తోంది కథ. సీరియల్ కి ఆయువుపట్టులాంటి రిషి లేకుండా ఎలా అని ప్రేక్షకులు ప్రశ్నలవర్షం కురిపించారు.  వరుస ప్రశ్నల దాడిపై స్పందించిన సీరియల్ డైరెక్టర్... మేం కూడా తనకోసమే ఎదురుచూస్తున్నాం...ఏమీ చేయలేం నచ్చితే చూడండి లేదంటే లేదనేసారు.

Continues below advertisement

ఇక రిషి రాడు అనే టైమ్ లో మను ఎంట్రీ ఇచ్చాడు. నచ్చి రావడంతోనే శైలేంద్రకి ఝలక్ ఇచ్చి ఇంట్రెస్ట్ పెంచాడు మను. పైగా అనుపమని -మనుకి లింక్ పెట్టడంతో కథ మరో మలుపు తిరిగినట్టైంది. అంటే మహేంద్ర-అనుపమకి పుట్టినవాడే మను అనే డౌట్ క్రియేట్ చేశారు. రిషి-వసుధార లానే మను-వసు కూడా టామ్ అండ్ జెర్రీలా వాదించుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఏంజెల్ వచ్చి అనుపమ మా మేనత్త అని మనుతో చెప్పింది. అంటే ఇకపై బావ-మరదలు లవ్ జర్నీ మొదలవుతోంది. 

Also Read: ఒక్కటైన వసు-మను, గుప్పెడంత మనసులో సరికొత్త ప్రేమకథ మొదలు - గుప్పెడంత మనసు మార్చి 2 ఎపిసోడ్

రిషి సర్ వస్తారు వస్తారు వస్తారు

రిషిని చంపేశారని ప్రేక్షకులు...రిషి ఇక లేడని సీరియల్ లో పాత్రలు ఫిక్సైపోయారు..కానీ వసుధార మాత్రం రిషి సర్ వస్తారని స్ట్రాంగ్ గా చెబుతోంది. పైగా మూడు నెలలు గడువు ఇవ్వండి అని సవాల్ చేసింది. నెమ్మదిగా సీరియల్ లో క్యారెక్టర్స్ అన్నీ కూడా రిషి ఉన్నాడని నమ్మడం మొదలెట్టారు. అంటే త్వరలో రిషి వస్తాడనే హోప్ క్రియేట్ చేశారు నిర్వాహకులు. ఇలాంటి టైమ్ లో వసుధార రిషి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు వసుధార, మను...

మను పాత్రలో నటిస్తున్న రవి శంకర్ రాథోడ్...వసుగా నటిస్తోన్న రక్షాగౌడతో కలసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ నిర్వహించగా.. గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్‌ అందరూ రిషి గురించి వరుస ప్రశ్నలు సంధించారు. రియాక్టైన వసుధార.. ‘ముఖేష్ సార్ బాగానే ఉన్నారు. రీసెంట్‌గా బర్త్ డేకి కలిశాను. చాలా బాగున్నారు. ఇంకా పెయిన్ అయితే  అలాగే ఉంది.  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియల్‌ని మీరు చూస్తూనే ఉండండి.. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి.. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాం’ అని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. 

Also Read: వయసైపోతున్నా పెళ్లి కాలేదా..అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!

3 నెలలు ఆగండి....

ఇంకా కోలుకునేందుకు టైమ్ పడుతుందని లైవ్ లో చెప్పింది రక్షాగౌడ...అటు సీరియల్ లో మూడు నెలల్లో రిషి సర్ ని తీసుకొస్తానని ఛాలెంజ్ చేసింది వసుధార..ఈ రెండు డైలాగ్స్ ను సింక్ చేసిన ప్రేక్షకులు..హమ్మయ్య త్వరలో రిషి సర్ వచ్చేస్తారని ఫిక్సైపోయారు. ఈ లోగా శైలేంద్ర-దేవయాని-రాజీవ్ కి మను చుక్కలు చూపిస్తాడు. మరోవైపు అనుపమ - మను మధ్య ఉన్న తల్లి కొడుకుల బంధం బయటపడడం, మరదలు ఏంజెల్ తో ప్రేమలో పడడం జరుగుతుంది... ఇక రిషి రీఎంట్రీతో విలన్స్ కి చెక్ పెట్టేయడం ఖాయం..

ఫైనల్ గా 
రిషి-వసుధార
మను - ఏంజెల్
మహేంద్ర-అనుపమ ‍ఒక్కటవనున్నారు...

అంటే..రిషి రావడం లేటు కావొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని క్లారిటీ ఇచ్చేసింది వసుధార...

Also Read: ప్రతి ఆదివారం ఇది చదువుకుంటే విజయం, ఆరోగ్యం, సర్వశత్రు వినాశనమ్!

Continues below advertisement
Sponsored Links by Taboola