Naga Panchami Today Episode

  పంచమి మెడని జ్వాల నొక్కేస్తుంది. పంచమి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇంతలో మోక్ష లేస్తాడు. భార్య కనిపించకపోయేసరికి పంచమి పంచమి అంటూ కిందకి వస్తాడు. మరోవైపు కంత్రీ, తంత్రీలను మేఘన మాయం చేస్తుంది. పంచమి అరవకుండా జ్వాల నోరు అదిమిపడుతుంది. ఇక మోక్ష చూసి వదినా వదులు అని జ్వాలని పక్కకు నెట్టేస్తాడు. ఇక జ్వాల మోక్షని కూడా చంపాలని ట్రై చేస్తుంది. ఇంట్లో అందరూ వచ్చి లైట్ వేయడంతో వెనక్కి తగ్గుతుంది. ఇక అప్పుడే జ్వాల కూడా తన గొంతు పంచమి పట్టి నొక్కినట్లు బిల్డప్ ఇస్తుంది.


శబరి: పంచమి ఏమైంది.. 
జ్వాల: మోక్ష నువ్వు రాకపోయి ఉంటే పంచమి నన్ను చంపేసేది. నువ్వు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. పంచమి నన్ను చంపేసేది.
మోక్ష: జ్వాల చెంప పగలగొట్టి.. 
జ్వాల: నన్నెందుకు కొట్టావ్.. నేనేం చేశాను.. 
మోక్ష: కొట్టడం కాదు చంపేయాలి నిన్ను.. తనేం చేసిందో తెలుసా.. పంచమిని చంపాలని ట్రై చేసింది. 
జ్వాల: అబద్ధం పచ్చి అబద్ధం..
మోక్ష: నువ్వు పంచమిని చంపాలని అనుచూడటం నేను నా కళ్లారా చూశాను..
జ్వాల: అత్తయ్య చూశారా.. అసలు ఆ పంచమి ఏం చేసిందో తెలుసా.. అసలు ఆ పంచమి మనిషే కాదు. పంచమి ఓ పెద్ద నాగులా మారి మెలికలు తిరుగుతూ బుసకొడుతూ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి పంచమి అని పిలిచాను నా మీద పడి చంపబోయింది. నేను నా శక్తి అంతా ఉపయోగించి పంచమని అదిమిపట్టుకున్నా అప్పుడే నువ్వు వచ్చావ్..
మోక్ష: వదినా అలా మాట్లాడితే ఈసారి వదిన అని కూడా చూడను. పంచమి గురించి అబద్ధం అడావో నిన్ను ఎవరూ కాపాడలేరు. నా చేతులతో నేను చంపేస్తాను..
వరుణ్: మోక్ష ఎక్కువ మాట్లాడుతున్నావ్. 
మోక్ష: అన్నయ్య జరిగింది అదికాదు నీ భార్య పంచమిని చంపాలి అని చూడటం నా కళ్లతో నేను చూశాను.
జ్వాల: అవును నా ప్రాణాలను నేను కాపాడుకోవడానికి నేను పంచమిని ఎటాక్ చేశాను. అలా చేయకుండా నేను నీ భార్య చేతుల్లో పోవాలా..
మీనాక్షి: అసలు మీరు ఎందుకు గొడవ పడటం.. పంచమి ఏం జరిగిందో నువ్వు చెప్పు. 
భార్గవ్: అవును పంచమి నువ్వు చెప్పు ఏం జరిగిందో లేదంటే మా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయి. 
చిత్ర: ఇంతకు ముందు అయితే నేను జ్వాల అక్క మాటలు పూర్తిగా నమ్మేదాన్ని కానీ ఇప్పుడు నాకు తనమీద కూడా అనుమానమే.
జ్వాల: ఏంటి అనుమానం ఏం అబద్దం చెప్పాను నేను. ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా చూడనప్పుడు నోరు మూసుకొని ఉండు.
భార్గవ్: వదినా ఈ మధ్య మీ మాటలు ప్రవర్తన అంతా మారిపోయింది కాబట్టే చిత్ర మీ మాటలు నమ్మలేం అంది. 
పంచమి: జ్వాల అమ్మగారు మునిపట్లా లేరు. తనని ఏదో శక్తి పట్టి పీడిస్తుంది. ఏం చేస్తుందో తనకు తెలీడం లేదు పాపం. నన్ను చంపబోయింది కూడా. తనని ఆవహించి ఉన్న ఏదో దుష్ట శక్తి పనే అయింటుంది. 
జ్వాల: కథలు అల్లకు పంచమి. నీలో శక్తి గురించి చెప్పాల్సి వస్తుంది అనే కదా నా గురించి ఇలా చెప్తున్నావ్. ముందు నీ గురించి చెప్పి ఇంట్లో నుంచి పారిపో..
పంచమి: మీరు నన్ను ఎన్ని అన్నా పర్లేదు కానీ మీరు జాగ్రత్త పడకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. 
వైదేహి: నువ్వు ముందు ఇక్కడి నుంచి పోతే ఏ ప్రాబ్లమ్ ఉండవు. నువ్వు మా ఇంటికి పట్టిన పెద్ద పిశాచివి. ఎన్ని మాటలు అన్నా ఇక్కడి నుంచి పోవడం లేదు. నువ్వు చస్తే తప్ప మా దరిద్రం పోయేలా లేదు. 
మోక్ష: అమ్మ నాతో తప్పు చేయించకు ఆలోచించి మాట్లాడు. 
వైదేహి: ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావ్.. దీన్ని వంద మాటలు అంటాను. నీకు తల్లి కావాలో అది కావాలో తేల్చుకో. 
శబరి: కొడుకు క్షేమం కోరుకునే ఏ తల్లి నీలా మాట్లాడదు వైదేహి.. 
వైదేహి: అది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు మోక్ష. ఇంటి నుంచి పంపించేసే.. రేపు నేను దాని ముఖం చూడకూడదు. 


మరోవైపు మేఘన తన అన్న నంబూద్రీ ఆత్మతో మాట్లాడుతుంది. పంచమిని చంపలేకపోయాను అని నంబూద్రీ మేఘనకు సారీ చెప్తాడు. పంచమికి సుబ్రహ్మణ్య స్వామి అండ ఎప్పుడూ ఉంటుంది అన్నయ్య. ఆ విషయం నాకు బాగా తెలుసు అన్నయ్య. ఇప్పుడు కూడా పంచమిని ఆ స్వామే కాపాడారు అన్నయ్య. 


నంబూద్రీ: ఆ పంచమి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెల్లి. 
మేఘన: మనం మోక్షని బలి ఇచ్చి నేను నా శక్తులు తిరిగి పొందితే ఇలాంటి పంచమిలు వంద మంది అయినా నన్ను ఎదుర్కొలేరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పించుకుంటాను. పంచమికి ఎంత దైవ బలం ఉన్నా అన్ని సార్లు పంచమి తప్పించుకోలేదు కదా. 


పంచమి: పంచమిని గదికి తీసుకొచ్చిన మోక్ష జ్వాలని వదిలేదు లేదు అని అంటాడు. ఇంట్లో అందరూ తనని చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చివరకు మీరు చేసినా ఆశ్చర్యం లేదు. ఆ కరాళి నన్ను చంపి మిమల్ని బలి ఇచ్చేస్తుంది. తనకి మీరు ఆ అవకాశం ఇవ్వకూడదు. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేఘనను పెళ్లి చేసుకోవాలి. లేదంటే మన ఇద్దరి ప్రాణాలు పోతాయి.
మోక్ష: నువ్వు బయపడి నన్ను భయపెట్టకు పంచమి. 
పంచమి: ఇలా అయితే కష్టం మోక్షాబాబు. ఆ కరాళి ఏ రూపంలో ఎలా ఉంటుందో మనకు తెలీదు. మీరు కనిపెట్టలేరు. ఇప్పుడు జరిగిన సంఘటన దానికి ఉదాహరణ. ఇదంతా చేసింది ఆ కరాళి.
మోక్ష: నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మలేను పంచమి.
పంచమి: నమ్మకండి నేను చనిపోతే అప్పుడు నమ్మండి. 
మోక్ష: నేను ఆ మేఘనను పెళ్లి చేసుకోను.
పంచమి: మన ఇద్దరి ప్రాణాలు మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నాయి. కరాళి నన్ను చంపడం ఖాయం. ఫణేంద్ర మిమల్ని కాటేస్తాడు. మరోవైపు మిమల్ని తీసుకెళ్లి బలి ఇవ్వాలి అని కరాళి కాచుకుఉంది. ఈ మూడింటిని ఆపే శక్తి మీకు ఉంటే చెప్పండి అప్పుడు నేను ధైర్యంగా ఉంటాను. 
మోక్ష: మనద్దరం ఒకటి అయితే కరాళికి నేను పనికి రాను. ఫణేంద్ర నిన్ను తీసుకెళ్లడు. భయపడకు పంచమి నీలో విషాన్ని పొగొట్టిన తర్వాతే మనం కలుస్తాం. కాపురం చేసి పిల్లలు కందాం. 
పంచమి: మీరు మేఘనను పెళ్లి చేసుకోను అంటే నేను ఇప్పుడే నాగలోకం వెళ్లిపోతా.. అప్పుడైనా మీరు మేఘనను పెళ్లి చేసుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటారు. అని పంచమి అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: జై హనుమాన్ మూవీ అప్డేట్: ‘హనుమాన్’ సీక్వెల్ పై అదిరిపోయే అప్ డేట్, త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్