Seethe Ramudi Katnam Today Episode సూర్య విషయంలో తనకి సాయం చేయమని అడిగిని మహాలక్ష్మి కన్నింగ్‌గా మాట్లాడింది అని సీత రామ్‌కి చెప్తుంది. రామ్ నమ్మకుండా తన పిన్ని దగ్గరే తేల్చుకుందామని సీతని తీసుకొని కిందకి వస్తాడు. అక్కడ అర్చన, గిరిధర్‌లు మహాలక్ష్మి సీతతో ప్రేమగా మాట్లాడింది అని సూర్య సమస్య పరిష్కరిస్తాను అని చెప్పిందని అంటారు.
సీత: ప్రేమగా కాదు నాతో కన్నింగ్‌గా మాట్లాడింది.
గిరిధర్: ఏంటి సీత వదిన మీద అంత పెద్ద నింద వేస్తున్నావ్.
అర్చన: సీతకు మహా సాయం చేస్తాను అంది అదే నిజం.
చలపతి: నిజం అంటూ అబద్దం చెప్తున్నావ్ ఏంటి చెల్లమ్మ..
రామ్: మీరు ఆగండి మామయ్య. అసలు డాడీ పిన్ని ఎక్కడ. వాళ్లని పిలవండి..
గిరిధర్: వాళ్లు ఇంట్లో లేరు రామ్..
రామ్: ఎక్కడికి వెళ్లారు.
అర్చన: మధుమిత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పల్లెటూరికి వెళ్లారు.
సీత: ఏంటి మీరు చెప్పేది అత్తయ్య మామయ్య మా ఊరికి వెళ్లారా..
గిరిధర్: మీ అక్క ఉండేది మీ ఊరిలోనే కదా.. మీ బావని అరెస్ట్ చేసింది కూడా మీ ఊరిలోనే కదా.. ఇందాక సీత వచ్చి సూర్యని కాపాడమని ఏడుస్తూ వదినకు చెప్పింది. దీంతో వదిన సీతకి ధైర్యం చెప్పి పల్లెటూరు వెళ్లింది.
సీత: అబద్ధం ఇందాక అత్తయ్య నాతో అలా మాట్లాడలేదు. సంబంధం లేని విషయాలు మాట్లాడింది. ఇప్పుడు వీళ్లు మాట మార్చేస్తున్నారు.
అర్చన: ఏమైంది సీత నీకు నువ్వు ఏడ్చి బతిమాలితే కదా మహా మీ ఊరు వెళ్లింది. నీకు సాయం చేసే ఉద్దేశం లేకపోతే మహా మీ ఊరు ఎందుకు వెళ్తుంది.
గిరిధర్: నీకు సాయం చేస్తాను అని చెప్పే కదా మహా మీ ఊరు వెళ్లింది. అది మర్చిపోయి నువ్వేంటి మాట మార్చుతున్నావ్.
అర్చన: ఏంటి రామ్ సీత నీకు వేరే ఏమైనా చెప్పిందా.. మహా సాయం చేయను అని చెప్పిందా..
రేవతి: సీత కాదు మీరే రామ్ ముందు ఒకలా.. సీత ముందు ఒకలా ప్రవర్తిస్తున్నారు.
అర్చన: నటించాల్సిన అవసరం లేదు రేవతి. నువ్వు అనవసరంగా గొడవలు పెట్టకు.
సీత: దారుణమైన మనుషులు మీరు.. అవతల వారి కష్టాలు చూసి ఆనందపడే రాక్షసులు మీరు.
రామ్: స్టాపిట్ సీత.. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడావు అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందాక మా పిన్ని మీద నిందలు వేశావు. ఇప్పుడు వీళ్లని అనకూడని మాటలు అంటున్నావ్.. పిచ్చి ఏమైనా పట్టిందా నీకు...
చలపతి: ఇదంతా వీళ్ల డ్రామా రామ్..
రామ్: ఆపండి మామయ్య. మీ వల్ల అత్తయ్య వల్ల సీత ఇలా తయారైంది. మీరిద్దరూ సీతని పొల్యూట్ చేస్తున్నారు. సీత నీకు తెలిసినవి నిజాలు కావు. ప్రతీ సారి మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావ్. మా పిన్ని నీకు సాయం చేస్తున్నా చేయలేదు అని నాతో అబద్దం చెప్పావ్. ఇంకోసారి ఇలా చేశావు అంటే నిన్ను నేను క్షమించను. గుర్తుపెట్టుకో.
శివకృష్ణని తన తల్లి సూర్య గురించి అడుగుతుంది. సూర్యని విడిపించే ఏర్పాట్లు చేయమని చెప్తుంది. దీంతో శివకృష్ణ సీరియస్ అవుతాడు. మధు స్టేషన్ దగ్గర అందరి ముందు తనని అవమానించింది అని చెప్తాడు. మధుకి మనం కావాలి అంటే ఆ నేరస్తుడిని వదిలేయమని అంటాడు. అలా ఎలా అవుతుంది అని అతని భార్య అంటుంది. మధుకి తల్లిదండ్రులు కావాలి భర్త కూడా కవాలి అని ఇప్పుడు మధు కష్టంలో ఉందని మనమే ఆదుకోవాలి అని ఇంట్లో వాళ్లు శివకృష్ణకి చెప్తారు. నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొని పోలీసుగా గెలిచాను అని సాయం చేయమని చేతులెత్తి మొక్కిన కూతురికి ఏ సాయం చేయలేని తండ్రిగా ఓడిపోయానో తెలీడం లేదని అంటాడు.
శివకృష్ణ: సూర్యని పెళ్లి చేసుకొని మధు తప్పు చేసింది అని నాకు ముందు నుంచే అనిపిస్తుంది. ఆ తప్పును బలపరుస్తూ ఇప్పుడు సూర్య నేరం చేశాడు. ఆ నేరాన్ని సమర్థిస్తూ మధు తప్పు చేస్తుంది. నాకేం చేయాలి అర్థం కావడం లేదు. పోలీస్‌గా సూర్యని విడిచిపెట్టలేను. తండ్రిగా మధుని వదులుకోలేను. దాన్ని చూస్తే బాధేస్తుంది. వాడిని చూస్తుంటే కోపం వస్తుంది. నా పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు.
శవతల్లి: బాధ పడకు శివ ఎలా జరగాలి అని రాసుంటే అది జరుగుతుంది. నువ్వు బాధ పడకు.
శివకృష్ణ: ఇది చాలా పెద్ద కేసు. ఎవరూ ఇలాంటి కేసులో తల దూర్చడానికి ఇష్టపడరు. ముందుకురారు..
అర్చన మహాలక్ష్మికి కాల్ చేస్తుంది. ఇంటి దగ్గర జరిగినదంతా మహాకి చెప్తారు. సీతకి రామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని చెప్తారు. ఇక మహాలక్ష్మి మధుని తీసుకొని వస్తానని చెప్తుంది. దీంతో అర్చన హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటామని అంటుంది.
జనార్థన్: అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావ్ మధు మనతో వస్తుందా మహా.
మహాలక్ష్మి: మధుకి మనతో రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒప్పుకోకపోయినా ఒప్పిస్తా.. వచ్చేలా చేస్తా. .
జనార్థన్: శివకృష్ణ మనకు అడ్డుపడితే.. మనల్ని ప్రశ్నిస్తే.. ఏం జవాబు చెప్తాం.
మహాలక్ష్మి: మనం చెప్పం మధుతో చెప్పిస్తాం. మధు శివని ఎదురించేలా చేస్తాను.
మరోవైపు సీత మహాలక్ష్మి మాటలు తలచుకొని నిజంగా తన ఊరు వెళ్లిందా లేక తిట్టించడానికే అలా చేసిందా అని ఆలోచిస్తుంది. ఇక రేవతి, చలపతి సీత దగ్గరకు వచ్చి ఓదార్చుతారు. మహా వాళ్లు కచ్చితంగా తన ఊరు వెళ్లుంటారు అని రేవతి చెప్తుంది. సీత షాక్ అవుతుంది. మీ అక్క మనసు మార్చి తన వైపు తిప్పుకుంటుంది అని చలపతి, మహాలక్ష్మి సీతకు చెప్తారు. సీతని కూడా ఊరు వెళ్లమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.