Prema entha maduram Serial Today Episode: ఇంట్లోకి వచ్చిన మాన్షి ఏడుస్తున్నట్లు నటిస్తూ.. నన్ను క్షమించండి అని అందరినీ ప్రాధేయపడుతుంది. దీంతో కోపంగా నీరజ్‌ బయటకు వెళ్లిపో అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. అయినా వినకుండా మాన్షి,  శారదాదేవి  కాళ్లపై పడి మొక్కుతుంది. అక్కడే ఉన్న సుబ్బు, పద్దులను కూడా బతిమాలుతుంది.


పద్దు: చాల్లే ఊరుకోవమ్మా? ఓ రచ్చ  చేస్తా ఉండావే? నిన్ను నమ్మి చేరదీస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే కదా? మా అమ్మికి పెళ్లై కాపురానికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకరకంగా దాని జీవితంలో సమస్యలు సృష్టిస్తూనే ఉన్నావు. అది చాలదన్నట్లు భర్త నుంచి భార్యని పిల్లలను వేరు చేసినావు. నిన్ను పోయి క్షమించాలా?


సుబ్బు: పద్దు ఇది బుజ్జమ్మా అత్తగారింటి సమస్య ఇందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏ నిర్ణయం అయినా వాల్లే తీసుకోవాలి. ఆర్య సార్‌, మేడం గారు మీరు మాన్షి మేడం పట్ల ఏ నిర్ణయం అయినా తీసుకోండి. కానీ మళ్లీ మా బుజ్జమ్మ కు మాత్రం ఏ అన్యాయం జరగకుండా చూసుకోండి ఇది నా విన్నపం.


అనగానే  ఇంకా నిర్ణయం ఏంటి సుబ్బు గారు దీన్ని బయటకు గెంటివేస్తాను అని నీరజ్‌ అనగానే అను నీరజ్‌ను ఆపి వర్ధన్‌ కుటుంబానికి మచ్చ రానియొద్దు అని చెప్తుంది. ఆర్యను నిర్ణయం తీసుకోమని అను చెప్తుంది. దీంతో మాన్షి నమ్మకం పోగొట్టుకుందని.. కానీ ప్రమాదంలో ఉన్నానంటున్నావు కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండటానికి నిర్ణయం మాత్రం మా అమ్మా తీసుకోవాలి అనగానే వర్ధన్‌ కుటుంబానికి నిందలు రాకుండా ఉంటడానికి నువ్వు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటున్నాను. మరోసారి తప్పులు చేస్తున్నావని తెలిస్తే నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్తారు. మాన్షి లోపలికి వెళ్తుంది. నీరజ్‌ కోపంగా బయటకు వెళ్తాడు. తర్వాత ఆర్య ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కేశవ వస్తాడు.


కేశవ: ఆర్య నీతో కొంచెం మాట్లాడాలి.


ఆర్య: మాన్షి గురించే కదా..? తనని మళ్లీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చాననే కదా నీ ప్రశ్న.  


కేశవ: నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని తెలుసు ఆర్య. మాన్షిని నువ్వు నమ్మావని నేను అనడం లేదు. కానీ తనకు మారేందుకు అవకాశం లేదనిపిస్తుంది.


అంటూ ఇద్దరూ మాన్షి విషయం మాట్లాడుకుంటారు. తను నిజంగా మారితే  ఓకే లేదంటే తన గురించి మనకు త్వరగానే తెలుస్తుంది అంటాడు ఆర్య. మార్పు మాన్షిలో వస్తుందేమో చూద్దాం అంటాడు. మరోవైపు మాన్షి రూంలో కూర్చుని ఈ ఆస్థి, బంగళా ఎప్పుడు నా వశం అవుతాయో అంటూ అనుకుంటుండగానే నీరజ్‌ వచ్చి ఫైల్‌ తీసుకుని వెళ్తుంటే మాన్షి పిలుస్తుంది. అయితే నీరజ్‌ మాన్షికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత మాన్షి కిచెన్‌ లోకి వెళ్లి పనిమనిషిని ఆనంది గురించి అడుగుతుంది. లోపల ఉందని చెప్తుంది. ఇంతలో బర్తుడే పార్టీకి పిల్లలు వస్తారు. వాళ్లకు స్నాక్స్ ఇస్తుంది మాన్షి. మాన్షిని దూరం నుంచి చూస్తున్న శారదాదేవి తన్మయత్వంలో ఉంటుంది. ఇంతలో కేశవ వస్తాడు.


కేశవ: పైపై మెరుగులు చూసి మోసపోకండి.


శారదాదేవి: మాన్షిని ఇంట్లోకి రమ్మనందుకు నీరజ్‌ నామీద కోపంగా ఉన్నాడు కేశవ. తల్లి ఆలోచన పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. మాన్షి, నీరజ్‌ కలిసిపోవాలి. నీరజ్‌కు ఒక కుటుంబం ఉండాలి.


కేశవ: మీ దూరపు ఆలోచనని నేను అర్థం చేసుకోగలను అమ్మ. కానీ ఈ అవకాశాన్ని మాన్షి ఎంతవరకు నిలుపుకుంటుందో చూడాలి.


అంటూ చెప్పి కేశవ వెళ్లిపోతాడు. మరోవైపు మాన్షి ఆనంది గురించి ఆలోచిస్తుంది. ఇంతలో ఆనంది కిందకు వస్తుంది. శారదాదేవి వచ్చి ఆనందిని ఎం కావాలని అడుగుతుంది. నేను రెడీ అవ్వడానికి హెల్ప్‌ కావాలి అని అడగ్గానే ఆనందిని రెడీ చేయమని  మాన్షికి చెబుతుంది శారదాదేవి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: ‘గామీ’ కంటే ముందే హిమాలయాల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలివే, ఒక్కోదానికి.. ఒక్కో కథ!