Guppedantha Manasu March 6th Episode: (గుప్పెడంతమనసు మార్చి 6th ఎపిసోడ్)
ఏంజెల్ ని కాలేజికి పిలిచిన వసుధార..మను గురించి ఆరా తీస్తుంది. కానీ ఏంజెల్ మాత్రం తన గురించి ఏమీ తెలియదని, కేవలం నువ్వు పరిచయం చేసినప్పుడే తెలిసిందని, తనని ఫస్ట్ టైమ్ చూసానని క్లారిటీ ఇస్తుంది. ఎందుకలా అనిపించిందని ఏంజెల్ అడిగితే.. అనుపమ మేడంకి మనుకి ఏదో బంధం ఉందనిపిస్తోందనే తన డౌట్ బయటపెడుతుంది. అనుపమ మేడంని అత్తయ్య అని ఎందుకు పిలిచారని అడిగిన విషయం చెబుతుంది ఏంజెల్...ఇంతలో మను ఎంట్రీ ఇస్తాడు. లోపలకు రమ్మని పిలుస్తుంది ఏంజెల్. ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే వసుధార దాస్తుంది కానీ ఏంజెల్ మాత్రం అడిగేస్తే అయిపోతుంది కదా అని మా అత్తయ్య మీకెలా తెలుసు - మా అత్తయ్యకి మీరెలా తెలుసు అని అడుగుతుంది...
మను: ఎందుకు అలా అడుగుతున్నారు
ఏంజెల్: మా అత్తయ్య మీకు ముందే తెలుసేమో అని..మొన్న తన గురించి కూడా అడిగారు కదా
మను: అలా అడిగినంత మాత్రాన ముందే తెలియడానికి ఏముంది...
ఇంతలో అక్కడకు వచ్చిన శైలేంద్ర...అందరకీ గుడ్ మార్నింగ్ చెబుతాడు వెటకారంగా...ఏంజెల్ ని చూసి...కాలేజీకి సంబంధం లేని మీరు కూడా వచ్చారా అని అవమానిస్తుంటాడు...దేనిగురించో తీవ్రంగా చర్చిస్తున్నట్టున్నారని ఏదేదో మాట్లాడుతాడు
వసు: విష్ చేశావ్ ఓకే..మళ్లీ ఏదేదో మాట్లాడుతావేంటి
శైలేంద్ర: బాగా ఆనందంగా ఉన్నట్టున్నారు..దేని గురించో డిస్కస్ చేస్తున్నట్టున్నారు..నాక్కూడా చెబితే నేనుకూడా పార్టిసిపేట్ చేస్తాను కదా
వసు: కానీ నీతో డిస్కస్ చేయడం మాకు ఇష్టం లేదు..ఇక మీరు వెళ్లొచ్చు..
నేను రాజీవ్ కలసి చేస్తున్న ప్లాన్ తో మీకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు....
ఇంకా ఉన్నారేంటి వెళ్లండి అన్న వసుధారతో..పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడడం సరికాదంటాడు... నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు వెళ్లు అని గట్టిగా చెబుతుంది...శైలేంద్ర వెళ్లిపోతాడు...
Also Read: రిషి రీ-ఎంట్రీకి టైమొచ్చేసింది , కాలేజ్ లో మను-వసు పోస్టర్స్ ,గుప్పెడంతమనసు మార్చి 5 ఎపిసోడ్
వసుధార తండ్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా రాజీవ్ ఎదురుపడతాడు...
రాజీవ్: వసుధారను నాతో పెళ్లికి ఒప్పించండి లేదంటే తన పరువు తీస్తానని బెదిరిస్తాడు.
చక్రపాణి: నువ్వు ఏమీ చేయలేవు
రాజీవ్: నన్ను ఎంత ప్రేమగా చూసేవారు...ఇప్పుడు మీరే వెధవ అంటున్నారు..
చక్రపాణి: అల్లుడివి కాబట్టి సరిపోయింది లేదంటే నిన్ను ఏం చేస్తానో తెలియదు...మర్యాదగా వెళ్లిపో
రాజీవ్: జేబులోంచి తాళిబొట్టు తీసి చూపించి ఇది వసు మెడలో కట్టాల్సిన తాళి ఇది. తన మెడలో తనే తాళి కట్టుకుని ఇదివరకు తప్పించుకుంది. ఇప్పుడు వసుధార మెడలో ఈ తాళి పడే టైమ్ వచ్చింది. అలా జరగకపోతే నా విశ్వరూపం చూపిస్తాను.
చక్రపాణి: ఇలాంటి విశ్వరూపాలు చాలా చూశాను ఇక్కడి నుంచి వెళ్లిపో అని రివర్సవుతాడు
రాజీవ్ వెళ్లిపోగానే వసుధారకు ఫోన్ చేస్తాడు చక్రపాణి. మళ్లీ వెనక్కు వచ్చి ఫోన్ లాక్కుంటాడు
రాజీవ్: మీ నాన్న నా గురించి రాక్షసుడు, దుర్మార్గుడు అని చెబుతున్నాడు కదా...మళ్లీ మంచివాడిలా మారిపోయి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంటున్నాను అని చెప్పేసి ఫోన్ చక్రపాణికి ఇచ్చేసి వెళ్లిపోతాడు...
ALso Read: 'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!
అనుపమ-ఏంజెల్-మను
ఏంజెల్ కార్ స్టార్టవ్వకపోవడంతో ఇబ్బంది పడుతుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మను...నన్ను చూడమంటారా అని అడుగుతాడు
అనుపమ: నువ్వేమైనా మెకానిక్‌వా
మను: నేను చిన్న చిన్న రిపేర్లు చేయగలను
అనుపమ: మను కార్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు..క్యాబ్‌లో వెళదామం
ఏంజెల్: మను టాపిక్ రాగానే అనుపమ సీరియస్‌గా మారిపోవడం ఏంజెల్ గమనించి...ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నావ్
అనుపమ: ఇందులో సీరియస్ ఏముంది..మామూలుగానే చెబుతున్నా
ఏంజెల్: మనుని చూసేసరికి నువ్వు సీరియస్ అయిపోతున్నావ్... మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా, ఇద్దరికి గతంలో పరిచయం ఉందా? గొడవల వల్ల విడివిడిగా ఉంటున్నారా
అనుపమ: ఏమైనా ఉంటే నేనే చెప్పేదానిని కదా అని అనుపమ టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
ఏంజెల్: మీ ఇద్దరు ఏదో దాస్తున్నారు. అది మీ కళ్లల్లో కనిపిస్తోంది . మీ గతం ఏమిటో నాకు ఇప్పుడే తెలియాలని ఏంజెల్ పట్టుపడుతుంది.
నేను ఒంటరిదానిని, నాకు ఏం గతం లేదని అనుపమ కోపంగా బదులిస్తుంది. ఆమె మాటలతో మను బాధపడతాడు. ఈ డిస్కషన్ ఇక అవసరం అని అనుపమ సమాధానమిస్తుంది. వారి మధ్య జరుగుతోన్న డిస్కషన్‌ను దూరం నుంచి వసుధార చూస్తుంది.
Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
కాలేజీలో పోస్టర్స్
వసుధార, మను క్లోజ్‌గా దిగిన ఫొటోలను సీక్రెట్‌గా కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్. కొత్త ప్రేమ జంట అని ఫొటోలపై రాస్తాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాను, తప్పు అని తెలిసి కూడా చేయకతప్పడం లేదు... నీ పరువు బజారులో పెడుతున్నందుకు చాలా బాధగా ఉంది..కానీ నువ్వు నా మాట వినడం లేదు అందుకే వీడి అడ్డుతప్పించి నిన్ను నా సొంతం చేసుకోవడానికే ఇలా చేస్తున్నానని అనుకుంటాడు...తెల్లారేలోగా పోస్టర్స్ క్యాంపస్ మొత్తం అంటించాలని ఫిక్సవుతాడు రాజీవ్...
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...గుప్పెడంతమనసు మార్చి 7 ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతోందన్నమాట...