Naga Panchami Today Episode

  నిశ్చితార్థం బట్టలు కొనడానికి పంచమిని మోక్ష పిలుస్తాడు. పంచమి రాను అంటే నీ ఫ్రెండ్‌కి నీ భర్తను ఇస్తున్నావని.. ఓ భార్య తన భర్తని మరొకరికి ఇస్తుంది అంటే అది ఎలాంటి త్యాగం అనుకున్నావని అలాంటి మహాత్యాగం చేస్తున్న నువ్వు నీ చేతులతో బట్టలు కొంటే ఇంకా మంచిదని అంటాడు. అయితే వైదేహి పంచమిని తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదు అని అంటుంది. 


మోక్ష:  ఈ పెళ్లి వరకు పంచమి లేకుండా నేను ఏ పని చేయను అమ్మ. మాతో పాటు తనని తీసుకెళ్తా.
పంచమి: నాకు తలనొప్పిగా ఉంది మోక్షాబాబు నేను రాలేను మీరు వెళ్లండి. 
మోక్ష: ఆగు పంచమి.. సారీ పంచమి నువ్వు ఇంకా నా భార్యవి అన్న భ్రమలో ఉన్నాను నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావు అని మర్చిపోయాను. 
మేఘన: పంచమి నా చీర నువ్వే సెలక్ట్ చేయాలి..
వరుణ్: మోక్ష తను రాను అంటుంది కదా మీరు వెళ్లి తెచ్చుకోండి..
మోక్ష: ఏం పంచమి నువ్వే కదా మా పెళ్లి కుదిర్చావు. ఇప్పుడు బాధ పడితే ఎలా. 
మేఘన: నిన్ను బాధ పెడుతూ ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పంచమి. 
మోక్ష: ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు పంచమి. పెళ్లి ఆపేద్దాం. 
వైదేహి: ఏంట్రా నువ్వు ఒకసారి ఓకే అంటావు. వద్దు అంటావు అంతా నీ ఇష్టమేనా.. అందుకే దీన్ని ఈ ఇంట్లో ఉంచొద్దు అన్నాను. బలవంతంగా ఉంచావ్..
మోక్ష: అమ్మా నువ్వు ఒక విషయం మర్చిపోయావ్. పంచమి ఒప్పుకోకపోతే నేను ఈ జన్మలో మరొకర్ని పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి పంచమి దయాదక్ష్యాణ్యాల మీద జరుగుతుంది. తను వద్దు అంటే ఆపాల్సిందే..
మీనాక్షి: వద్దు అని చెప్పేయ్‌ అమ్మా.
మోక్ష: ఏం పంచమి పెళ్లి ఆపేద్దామా..
పంచమి: ఈ పెళ్లి జరుగుతుంది. పదండి మీ బట్టలు నేనే సెలక్ట్ చేస్తా.. ఇక పంచమి మోక్ష, మేఘనలు కలిసి మాట్లాడుకోండి అని పక్కకు వెళ్తా అంటుంది.
మేఘన: మనసులో.. నువ్వు మా మధ్య నుంచి పోవడం కాదే. నిన్నే ఈ లోకం నుంచి పంపేస్తాను. 
మోక్ష: పంచమిని చూస్తుంటే నన్ను వదిలి ఇప్పుడే వెళ్లిపోయేలా ఉంది. తనని వెంటనే మార్చాలి. పంచమి వెళ్లిపోయిన తర్వాత.. ఆగు మేఘన నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 
మేఘన: మీరు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకు తెలుసు.. మీరు నా మెడలో తాళి కట్టేవరకు మనకు పెళ్లి అవుతుంది అన్న నమ్మకం నాకు లేదు. మధ్యలో పంచమి మనసు ఎప్పుడు మారితే అప్పుడు నేను తప్పుకుంటాను. 
మోక్ష: అర్థం అదే మేఘన.. కానీ పంచమి మనసు మార్చుకుంది అన్న నమ్మకం నాకు లేదు. 
మేఘన: మనసులో.. అసలు తను ప్రాణాలతో ఉంటే కదా. మనసు మార్చుకోవడానికి..
మోక్ష: పంచమి శరీరంలో విషానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తున్నా అది ఏ క్షణంలో అయినా నా చేతికి రావొచ్చు. అప్పుడు నేను పంచమి విడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కరాళి నన్ను బలి ఇవ్వాలి అనుకుంటుంది అంట. 
మేఘన: మనసులో.. నేను ఆ కరాళిని అని చెప్తే నువ్వు ఇప్పుడే గుండె ఆగి చస్తావ్. ఆ కరాళికి భయపడి పంచమి నీకు తొందరగా పెళ్లి చేయాలి అనుకుంటుంది కదా..


పంచమి: నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతుంటే.. శివయ్య మీ బిడ్డ పంచమి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజుతో ముగియబోతుంది. మీ కళ్ల ముందు జరిగిన మా పెళ్లి అబద్ధం కాకూడదు స్వామి. నా స్థానంలో మరొక అమ్మాయి రాబోతుంది. వాళ్లకి మీ ఆశీర్వదాలు అందించండి స్వామి. ఇది పంచమి చివరి కోరిక. మోక్ష బాబు పిల్లాపాపలతో చల్లగా ఉండాలి. 
మోక్ష: మోక్ష రెడీ అయి బాధపడుతుంటాడు. ఈ పెళ్లి జరగకూడదు. పంచమి కోరిక మా అమ్మ కోరిక నెరవేరకూడదు. పెళ్లి లోగా పంచమిని మామూలు మనిషిగా మార్చి సొంతం చేసుకోవాలి. మేఘనను క్షమించమని అడిగితే తను కాదు అనదు. మేఘన మంచి అమ్మాయి. 


మేఘన నిశ్చితార్థం ఉంగరాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని తన మంత్ర శక్తితో రింగ్‌లోకి ఏవో శక్తులు పంపిస్తుంది. బలి ఇవ్వాల్సిన కార్యక్రమానికి ఈ ఉంగరంతో అంకురార్పణ చేస్తానని అంటుంది. మరోవైపు చిత్ర, జ్వాల, వరుణ్, భార్గవ్‌లు నిశ్చితార్థంలో ఏ పని చేయకుండా తన నిరసన తెలపాలి అనుకుంటారు.  ఇక శబరి మోక్ష, పంచమి కలిసి ఉండేలా చూడాలని దేవుణ్ని కోరుకుంటుంది. ఇంతలో పంతులు గారు వస్తారు. ఇక మీనాక్షికి పనులు చెప్తే చేయను అని నిరాకరిస్తుంది. మోక్ష కోసమే కదా అని రఘురాం చెప్పడంతో వెళ్తుంది. ఇక మీనాక్షి పంతులకు డబ్బులు ఇచ్చి పెళ్లి ముహూర్తం రాహుకాలం, యమగండంలో పెట్టాలి అని అంటుంది. పంచమి జీవితం నిలబెట్టడానికే ఇలా చేస్తున్నాం అని పంతుల్ని ఒప్పిస్తుంది. పంతులు సరే అంటాడు. ఇక జ్వాల, చిత్ర తమ భర్తలకు వైదేహి వాళ్లు ఏం పనులు చెప్పినా చేయరు. దీంతో పంచమి వెళ్లి మోక్ష, మేఘనల్ని తీసుకొని వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సిరి హనుమంత్‌ : 'జబర్దస్త్‌' షోకు సిరి హనుమంత్‌ గుడ్‌బై చెప్పబోతుందా? - హింట్‌ ఇచ్చిన కమెడియన్‌ నూకరాజు