Karthikadeepam part 2: స్టార్‌మాలో డాక్టర్ బాబు, వంటలక్కలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయిన ‘కార్తీక దీపం’ సీరియల్ బుల్లితెరపై చేసిన సందడి సీక్వెల్ అంతా ఇంతా కాదు. ‘కార్తీక దీపం’ ఇది నవవసంతం.. అనే స్వీక్వెల్ టైటిల్‌తో ఓ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది టీమ్. తాజాగా ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ని అదే టైంలో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అదే నిజం అయితే సాయంత్రం 7.30కి వస్తున్న బ్రహ్మముడి సీరియల్‌పై చాలా ఇంపాక్ట్ పడనుంది.
‘కార్తీక దీపం’ సీరియల్ రాత్రి 7.30కి స్టార్‌మాలో ప్రసారమయ్యేది. దీంతో ఏడున్నర అయిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోయేవారు. దీంతో నెంబర్ వన్ స్థానంలో ‘కార్తీక దీపం’ దూసుకుపోయింది. అయితే ‘కార్తీక దీపం’ ముగిసిన తర్వాత అదే టైంలో ఇప్పుడు ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్‌కి కూడా ‘కార్తీక దీపం’ రేంజ్‌లోనే మంచి ఆదరణ వస్తుంది. స్టార్‌మా తాజా సీరియల్స్‌లో ‘బ్రహ్మముడి’ సీరియలే నెంబర్ వన్‌గా నిలిచింది. త్వరలో ప్రారంభం కానున్న ‘కార్తీక దీపం’ పార్ట్ 2ను పాత టైమింగ్ అంటే ‘బ్రహ్మముడి’ ప్రసారం అవుతున్న 7.30కి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే నిజమైతే ఇప్పటికే నెంబరు వన్‌గా దూసుకుపోతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్లేస్‌లో ‘కార్తీక దీపం’ వస్తే ఆ సీరియల్ రేటింగ్‌పై ఇంపాక్ట్ పడుతుంది.
‘కార్తీక దీపం 2’ ప్రోమో
తాజాగా విడుదలైన ‘కార్తీక దీపం 2’ ప్రోమో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ ప్రోమోలో శౌర్య పాత్రని మాత్రమే పరిచయం చేశారు. అందులో శౌర్య వాయిస్ తో.. “నాకు చీకటి అంటే భయం.. ఈ చీకటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ.. కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు. కానీ అమ్మైనా.. నాన్నైనా.. నాకు మా అమ్మే. ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య.. ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మనాన్నల కథ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రోమోలో శౌర్య తనకు తల్లీ తండ్రీ అన్నీ తన తల్లే అని చెప్తుంది. ఇక వంటలక్క పార్ట్ 2లో కూడా డాక్టర్ బాబు ఇంటి దగ్గర వంట మనిషి గానే కనిపిస్తుంది. శౌర్య ఓ బొమ్మకు తన తల్లి గొప్పతనం చెప్తూ ఉంటే డాక్టర్ బాబు విని సంతోషపడతాడు. ఇక వంటలక్క వంట చేసి తన కూతురు శౌర్యని తీసుకొని వెళ్లిపోతుంది.
కార్తీకదీపం సెకండ్ పార్ట్ లో వంటలక్క, డాక్టర్ బాబు ఇద్దరినీ ప్రోమోలో చూపించారు. శౌర్యని పార్ట్‌లో వన్‌తో పోల్చితే చిన్న పిల్లగా చూపించారు. అది కూడా శౌర్య తన తల్లి దగ్గర ఉన్నట్లు పరిచయం చేశారు. మరి హిమని చూపించలేదు. హిమ క్యారెక్టర్ ఉంటుందా.. ఉంటే హిమ ఎవరి దగ్గర పెరుగుతుంది. మోనిత పాత్రని చూపిస్తారా.. మోనితకు ఒక కొడుకు పుట్టినట్లు చూపించారు. మరి మోనిత కొడుకును కూడా చూపిస్తారా.. తల్లి స్థానంలో ఈ సారి మోనిత కొడుకు విలన్ పాత్ర పోషించనున్నాడా.. సౌందర్య తదితర క్యారెక్టర్లను మళ్లీ చూపిస్తారా లేదా అనేది చూడాలి.