Oorvasivo Rakshasivo Today Episode దుర్గనే వైష్ణవి అని నిలదీసిన విజయేంద్ర నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అని దుర్గ చేతిని తన తలమీద పెట్టుకుంటాడు. దీంతో దుర్గ నేను వైష్ణవిని అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. విజయేంద్ర ఎమోషనల్ అయి ఏడుస్తాడు. దుర్గ కూడా ఏడుస్తుంది. 


దుర్గ: నేనే వైష్ణవిని నీ వైష్ణవిని..
విజయేంద్ర: ఎందుకు దాచావ్‌ వైష్ణవి.. ఇన్ని రోజులు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలిసి కూడా నీ మనసు కొంచెం కూడా కరగలేదా.. నువ్వు దుర్గ అని నాకు తెలిసినప్పుడు అమెరికాలో ఏం జరిగిందో చెప్పాను. ఎందుకు రాలేకపోయానో చెప్పాను. అయినా నీకు నా మీద కోపం తగ్గలేదా.. అసలేం జరిగిందో చెప్తే నేను నీతో ఉండి సాయం చేసేవాడిని కదా వైష్ణవి. 
దుర్గ: అందుకే నీకు చెప్పలేదు. నేను పడుతున్న కష్టాలు.. నా పగ నాతోనే పోవాలి అనుకున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలి అనుకున్నాను అందుకే నీకు ఏం చెప్పలేదు..
విజయేంద్ర: నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావ్ వైష్ణవి. ఇప్పటికైనా నిజం చెప్పు వైష్ణవి పవిత్రకు ఏం జరిగింది. మీ అమ్మానాన్న ఎలా చనిపోయారు. దీని అంతటికి కారణం ఎవరు.
దుర్గ: నీ కుటుంబమే.. నీ కుటుంబమే నా కుటుంబాన్ని నాశనం చేసింది. అని వైష్ణవి జరిగింది అంతా చెప్తుంది. ఈ ధీరు, రక్షితలే పవిత్ర జీవితాన్ని నాశనం చేసి నా తల్లిదండ్రులను పొట్టనపెట్టుకున్నారు.
విజయేంద్ర: అంటే నేను విన్నది నిజమే అన్నమాట పవిత్ర జీవితాన్ని నాశనం చేసింది వీడేనా.. అని విజయేంద్ర ధీరుని కొడతాడు. ధీరు చనిపోతాడు. రక్షిత ధీరు అని అరవడంతో దుర్గ తేరుకుంటుంది. తీరా చూస్తే ఇదంతా దుర్గ కన్న కల.
దుర్గ: ఇదంతా కలా.. ఒకవేళ విజయేంద్రకు నిజం తెలిస్తే నిజంగానే ధీరుని చంపేస్తాడు. ఇప్పటికే పవిత్ర జీవితం నాశనం అయింది. నేను ఎన్నిరోజులు బతుకుతానో తెలీదు. ఈ నిజం విజయేంద్రకు తెలిస్తే తన జీవితం కూడా నాశనం అయిపోతుంది. వెంటనే దీనికి ఏమైనా పరిష్కారం ఆలోచించాలి. 


దుర్గపై జరిగిన ఎటాక్‌ గురించి విజయేంద్ర తన ఫ్రెండ్‌తో ఎంక్వైరీ చేయిస్తాడు. దుర్గ మీద కావాలనే ఎటాక్ చేశారని విజయేంద్రకు తన ఫ్రెండ్ చెప్తాడు. సీసీ కెమెరాల వీడియో కూడా తొందరగా ఇస్తారని చెప్తాడు. దీంతో దుర్గకి ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని తెలుసుకోవాలి అని విజయేంద్ర దుర్గకు కాల్ చేస్తాడు. 


విజయేంద్ర: దుర్గ నేను అడిగే దానికి ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు రీసెంట్‌గా ఎవరితోనైనా లాండ్, మనీ తదితర విషయాల్లో గొడవ పడ్డావా..
దుర్గ: లేదు ఎవరితో గొడవ పడలేదు. ఎందుకు అలా అడిగావ్. 
విజయేంద్ర: పోనీ మీ నాన్న గారికి ఎవరితోనైనా బిజినెస్‌లో శత్రువులు ఉన్నారా..
దుర్గ: ఆయన ఇండియా వచ్చిందే ఈ మధ్య. ఆయనకు ఇక్కడ ఎవరు శత్రువులు ఉంటారు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావ్. అది కూడా ఇంత రాత్రి టైంలో..
విజయేంద్ర: నువ్వు టెన్షన్ పడను అంటే నీకు ఓ విషయం చెప్తా. మొన్న నీ మీద జరిగిన యాక్సిడెంట్ అది అనుకోకుండా జరిగిందికాదు. నిన్ను చంపాలి అని వేసిన స్కెచ్. 
దుర్గ: ఏంటి నువ్వు అనేది. ఈ విషయం నీకు ఎలా తెలిసింది. 
విజయేంద్ర: నీకు జరిగిన ఘటన మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఇదంతా రికార్డ్ అయింది.
దుర్గ: మనసులో.. నన్ను చంపాలి అని రక్షిత తప్ప ఎవరూ అనుకోరు. తనే ఈ పని చేయించుంటుంది. విజయేంద్రకు నా అనుమానం గురించి చెప్తే నా కలలో వచ్చిందే నిజం అవుతుంది. నిజం చెప్పకపోవడమే మంచిది. విజయేంద్ర నాకు మా నాన్నకు శత్రువులు ఎవరూ లేరు. రక్షిత నా మీద నీకు అనుమానం వస్తేనే నన్ను చంపాలి అనుకున్నావ్. అదే నేనే వైష్ణవి అని తెలిస్తే ఒక్క నిమిషం కూడా బతకనివ్వవు. త్వరలోనే నా చాప్టర్ క్లోజ్ చేయాలి.
 
రక్షిత: ధీరు దుర్గ అంటే నాకు ఇప్పటికి మంచి ఒపీనియన్ లేదు. కానీ కేవలం నీకోసం మాత్రమే ఒప్పుకున్నాను. మన శత్రువులు మనం ఎప్పుడు దొరుకుతామా అని ఎదురుచూస్తుంటారు. 
విజయేంద్ర: పిన్ని బాబాయ్ మీకు ఓ విషయం చెప్పాలి. దుర్గని ఈ ఇంటి కోడల్ని చేసుకోబోతున్నారు కాబట్టి తనకోసం ఓ విషయం చెప్పాలి. దుర్గని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. 
ధీరు: ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావ్..
విజయేంద్ర: నిజం ధీరు. దుర్గకి మొన్న జరిగింది యాక్సిడెంట్ కాదు. పక్కా ప్లాన్ ప్రకారం తనని చంపాలి అనుకున్నారు. నాకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. సీసీ టీవీ ఫుటేజ్‌లో అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు దుర్గ తప్పించుకుంది కాబట్టి మళ్లీ తన మీద అటాక్ చేయొచ్చు. అప్పుడు తనతో ఎవరు ఉన్నా వాళ్లకి కూడా ప్రమాదమే. అందుకే మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అనిచెప్తున్నా.
పురుషోత్తం: ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే.. 
రక్షిత: విజయేంద్ర ఇప్పుడు నీకు ఇదంతా అవసరమే. ఇప్పటికే అక్క నీ గురించి ఆలోచిస్తూ భయపడుతుంది. ఇప్పుడు నువ్వు మళ్లీ నీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చి అనవసరంగా కొత్త సమస్యలను తెచ్చుకొని అక్కకు దూరం అవ్వకు.
ధీరు: ఎందుకు బ్రో నీకు సంబంధం లేనివి నీ నెత్తిన వేసుకుంటున్నావు.
విజయేంద్ర: దుర్గ ఈ ఇంటి కోడలు అవుతుంది. అప్పుడు తను మన ఫ్యామిలీ మెంబర్ అవుతుంది కదా. అదే నా తాపత్రయం. 


దుర్గ: నాన్న నాకు ఇప్పుడు నాకు నమ్మకం ఉంది నేను గెలవబోతున్నాను అని. ఎత్తులకు పై ఎత్తులు వేసే రక్షిత, ధీరులు ఎటూ తేల్చుకోలేక మన చేతికి  చిక్కుతారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది నాన్న అలా చూస్తున్నారు.
దయాసాగర్: నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావా దుర్గ. నువ్వు పవిత్రకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ ప్రేమను సమాధి చేయకు. పవిత్రకు న్యాయం చేయడానికి ఇంకో మార్గం ఉంటుంది. 
దుర్గ: రెండేళ్లుగా పక్కాగా ప్లాన్ చేసి కూడా పగ తీర్చుకోలేకపోయాను. నేను ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయేంద్ర కాల్ చేసి యాక్సిడెంట్‌ గురించి చెప్పింది చెప్తుంది. ధీరుతో పెళ్లి అవగానే ఒక్కొక్కర్ని చీడపురుగుల్లా ఏరేస్తా నాన్న..ఇక వాసుకి కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి సమాచారం తెలుసుకోమంటుంది దుర్గ. 


దుర్గ నిశ్చితార్థం కోసం ధీరు వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇక విజయేంద్ర తల్లి దుర్గని పొడుగుతుంది. నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇక దుర్గని ధీరు అందంగా ఉన్నావని పొగిడేస్తాడు. ఇక రక్షిత తామంతా ఆనందంగా ఉన్నావంటే నువ్వే కారణం అని అంటుంది. ఇక రక్షిత ధీరుని నీ చేతుల్లో పెడుతున్నా జాగ్రత్తగా చూసుకో అని దుర్గకు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ మార్చి 5th: కావ్యకు భాస్కర్‌ ను దూరం చేసేందుక రాజ్‌ ప్లాన్‌ - సుభాష్‌కు ప్రకాష్‌ క్షమాపణ