Satyabhama Today Episode హర్ష నందినిని పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పేస్తాడు. ఇక సత్య వచ్చి అన్నయ్య నేను నీకు రాఖీ కట్టకుండా ఉండాల్సింది నాకు రక్షగా ఉంటాను అని నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధమైపోయావు అని అంటుంది. దాంతో హర్ష నీకు నువ్వు వేసుకున్న శిక్ష కంటే ఇందే పెద్దది కాదు అంటాడు. ఇంతలో మైత్రి అక్కడికి వస్తుంది. సత్య హర్షల మాటలు వింటుంది.


సత్య: నీకు నువ్వు ఎంత పెద్ద శిక్ష వేసుకున్నావో ఇప్పుడు కాదు అన్నయ్య ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీ నిర్ణయం మార్చుకో అన్నయ్య. క్రిష్‌కి నేను నచ్చచెప్పుతాను.
హర్ష: ఈ నిర్ణయం నాకు ఎవరో చెప్తే నేను తీసుకోలేదు. నా చెల్లి కోసం నేను తీసుకున్నాను. ఎవరు చెప్పినా మార్చుకునే ప్రసక్తే లేదు. 
సత్య: నువ్వు తీసుకున్న నిర్ణయం మీ చెల్లికి నచ్చలేదు. 
హర్ష: నచ్చాల్సిన అవసరం లేదు.
సత్య: అన్నయ్య నీ నిర్ణయం వల్ల ఇద్దరమ్మాయిల మనసు బాధ పెడుతున్నావు. ఇది న్యాయామా..
హర్ష: ఇద్దరా ఎవరు వాళ్లు..
సత్య: మొదటిది నందిని. కచ్చితంగా మనస్ఫూర్తిగా తను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. 
హర్ష: కానీ నేను మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నా ఎలాంటిది అయినా ఏం చేసినా నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.
సత్య: తన మనసులో నువ్వు లేనప్పుడు ఎలా కాపురం చేస్తుంది. 
హర్ష: కదూ చాలా కష్టం కదూ.. 
సత్య: కష్టం కాదు అన్నయ్య నరకం. 
హర్ష: ఇష్టం లేని మనిషిని ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది కదా.. 
సత్య: దగ్గరకు కూడా రావాలి అనిపించదు.
హర్ష: మరి అలాంటప్పుడు నిర్ణయం మార్చుకోవచ్చుకదా సత్య. ఇష్టం లేని మనిషితో ఎలా కాపురం చేద్దాం అనుకుంటున్నావ్. ఆ పరిస్థితిలో నందిని ఉన్నా సత్య ఉన్నా ఒకటే కదా.. ఇక నేను బాధ పెడుతున్న రెండో అమ్మాయి ఎవరు.
సత్య: మైత్రి.. ఆగు అన్నయ్య వెళ్లిపోతున్నావ్ ఏంటి..
హర్ష: చెప్పడానికి ఏం లేదు కాబట్టి..
సత్య: కాదు. చెప్తే గొంతులో బాధ అడ్డుపడుతుంది కాబట్టి. 
హర్ష: నేను ప్రేమిస్తున్నా ఎప్పుడూ మైత్రికి చెప్పలేదు.
సత్య: చెప్పనంత మాత్రానా మనసులో ప్రేమ లేనట్లు కాదు. 
హర్ష: నన్ను ప్రేమిస్తున్నట్లు మైత్రి కూడా చెప్పలేదు.
సత్య: ఆడపిల్ల చెప్పదు అన్నయ్య కళ్లలో చూపిస్తుంది. నువ్వు ఎప్పుడూ మైత్రి కళ్లలో చూడలేదా.. మైత్రి తరచూ మన ఇంటికి వచ్చేది మా కోసం కాదు నీ కోసం ఆ సంగతి నీకు తెలుసు. ఇప్పుడు మైత్రి వచ్చి నీ ముందు నిలబడి నా సంగతి ఏంటి అంటే ఏం సమాధానం చెప్తావు. ఇంతలో మైత్రి ఫోన్ రింగ్ కావడంతో సత్య, హర్షలకు మైత్రి రావడం తెలుస్తుంది. మైత్రి ఏడుస్తూ వెళ్లిపోతుంటే..
హర్ష: మైత్రి వెళ్లిపోతున్నావేంటి.
మైత్రి: నీకు అడ్డు ఎందుకు అని. అదే మీ చెల్లితో మాట్లాడుతున్నావ్ కదా.. ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం లేకే చాటుగా విన్నాను. ఇప్పుడు నీ కళ్లల్లోకి చూసి ఏం లాభం. 
హర్ష: పైకి చెప్పకపోయినా నీ మనసు నాకు తెలుసు మైత్రి. కానీ సత్యని సత్యని రక్షించుకోవడానికి.. 
మైత్రి: ఒక అన్నగా నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు. నేను నీ స్థానంలో ఉన్నా అదే పని చేసేదాన్ని. 
హర్ష: అర్థం చేసుకున్నందు థ్యాంక్స్ మైత్రి..
మైత్రి: నేను వెళ్తాను..
 హర్ష: మైత్రి.. పద నేను డ్రాప్ చేస్తా..
మైత్రి: నీ జీవితంలో నుంచి ఆల్రెడీ నన్ను డ్రాప్ చేసేశావ్. ఆల్‌ ది బెస్ట్.. 


నందిని: ఏడుస్తూ.. నాన్న ఎందుకు ఒక్కసారి నా పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకున్నావ్.. ఎందుకు నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలి అనుకుంటున్నావ్.. ఎందుకు నా మీద అంత కోపం. ఎందుకు అంత ద్వేషం.
మహదేవయ్య: కన్న తండ్రిని అమ్మ నీ మీద నాకు ఎందుకు ద్వేషం ఉంటుంది చెప్పు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో అయినా నీకు లోటు చేశానా.. నువ్వు అడిగింది కాదు అన్నానా.. నెత్తి మీద పెట్టుకున్నాను అవునా కాదా..
నందిని: ఒప్పుకుంటాను బాపు ఇన్ని దినాలు నన్ను ప్రేమగా చూసుకున్నావ్.. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడ దాచుకున్నావ్. సడెన్‌గా ఎందుకు మారిపోయావ్ బాపు. నువ్వు ఇచ్చిన వరాల కోట అయిపోయిందా.. ఇక నా చావు నన్ను చావమంటున్నావా..
మహదేవయ్య: ఈ బాపు ఏ నిర్ణయం తీసుకున్నా మన మంచి కోసమే తీసుకుంటాడు అని. 
నందిని: బాపు నీకు తెలుసు నాకు నచ్చని డ్రెస్ తెస్తే మూల పడేస్తా.. నాకు నచ్చని కూర వండితే తినను పస్తులుంటా.. అలాంటిది ఇష్టం లేనోడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లా కాపురం చేస్తాను అనుకున్నావ్ నాన్న.
మహదేవయ్య: చూడమ్మ ఇంతకు ముందులా కాదు నువ్వు పెద్దదానివి అయ్యావ్. ఇష్టాలు మార్చుకోవాలి. పెద్దవాళ్లకు నచ్చినట్లు.. చెప్పినట్లు ఉండాలి. మారాలి బిడ్దా.. తప్పదు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాల్సిందే.. లేదంటే ఈ ఇంట్లో ఎవరూ బతకరు నాతో సహా.


మరోవైపు కాళీ ఎక్కడున్నాడో బాబీ క్రిష్‌కి చెప్పడంతో క్రిష్ అక్కడికి వస్తాడు. క్రిష్‌ని చూసి కాళీ వణికిపోతాడు. కాళీని క్రిష్ చితక్కొడతాడు. క్షమించమని కాళీ క్రిష్ కాలు పట్టుకుంటాడు. అయినా క్రిష్ వినకుండా కాళీని కొడతాడు. 


క్రిష్: రేయ్ బాబీ వీడు బతికి ఉంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లు. చనిపోతే స్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టండి. ఈరోజుతో వీడి చాప్టర్ ఖతం అయిపోవాలిరా.. 
భైరవి: నందిని ఏడ్వడం చూసి.. తనలో తాను.. మీ బాపు తన రాజకీయాల కోసం నీ జీవితాన్ని బలిపెడుతున్నాడు తల్లీ.


మరోవైపు సత్య తల్లిదండ్రులు కూడా పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు పిల్లలు జీవితాలకు సంబంధించి ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకున్నారు అని ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి అని సంతోషం లేదు అని బాధపడతారు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌ మార్చి 5th: కావ్యకు భాస్కర్‌ ను దూరం చేసేందుక రాజ్‌ ప్లాన్‌ - సుభాష్‌కు ప్రకాష్‌ క్షమాపణ