Kasturi Shankar about Upendra Singh Rawat Leaked Video: ఒకప్పుడు హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి.. కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు కస్తూరి. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు. తన సోషల్ మీడియాలో పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాంట్రవర్సీలకు సంబంధించిన పోస్టులు చేయడానికి కస్తూరి ముందుంటారు. ఇక తాజాగా ఒక బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన అసాంఘిక కార్యకలాపాల వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ వీడియోలోని స్క్రీన్‌షాట్స్‌ను షేర్ చేయడంతో పాటు అసలు ఈ ఒరిజినల్ వీడియో లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటూ కస్తూరి పోస్ట్ చేసింది. దీనిని చూసి తన ఫాలోవర్స్ అంతా షాకవుతున్నారు.

వీడియో వైరల్ అయ్యింది..

బీజేపీ ఎమ్మెల్యే ఉపేంద్ర సింగ్ రావత్.. వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఒక్కసారిగా రాజకీయ పార్టీల్లో కూడా దుమారం రేపింది. దీనిని అండగా పెట్టుకొని ఇతర పార్టీలు బీజేపీపై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా నటి కస్తూరి కూడా దీనిపై స్పందించింది. ఇది ఫేక్ అని ఉపేంద్ర సింగ్ రావత్ ఆరోపిస్తున్నా కూడా ఇది అసలు ఫేక్ కాదంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను తన ట్విటర్‌లో షేర్ చేసింది. ‘అందరూ ఉపేంద్ర సింగ్ రావత్‌కు సంబంధించిన ఈ వీడియోలను చూశారు. వీడియో వైరల్ అయ్యిందని చెప్తున్నారు. ఆ వీడియో ఎక్కడ చూడాలి? ఎవరైనా లింక్ పంపించండి ప్లీజ్’ అంటూ వ్యంగ్యంగా కస్తూరి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది ఫేక్ కాదు..

‘ఇది ఫేక్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రావత్‌కు బర్బంకి ఎల్ఎస్ సీట్ లభించింది. నిజంగా యూపీ బీజేపీ అంటే అభిమానం ఏర్పడుతోంది. వారు తమ పోటీదారులను ఓడించడానికి ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటారో’ అని కస్తూరి ట్విటర్‌లో తెలిపింది. ఈ విషయంపై ఉపేంద్ర సింగ్ రావత్ కూడా స్పందించారు. ‘డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను’ అని ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ వీడియోలో ఉన్నది తను కాదని నిరూపణ అయ్యేవరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ ప్రకటించారు. ఇక త్వరగా ఈ విషయంలో విచారణ మొదలుపెట్టమని పార్టీ ప్రెసిడెంట్‌ను కోరినట్టు బయటపెట్టారు. 

కేసులో అనుమానితుడు..

ఈ కేసులో ఇప్పటికే ఒక అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. కానీ అతడి వివరాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడుతున్నారు. ఉపేంద్ర సింగ్ రావత్.. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడనే విషయాన్ని ఇష్టపడని కొందరు దుండగులు.. ఇలా డీప్‌ఫేక్ టెక్నాలజీ వీడియో తయారు చేయించి వైరల్ చేశారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటికే ఎంపీగా ఉన్న ప్రియాంక సింగ్ రావత్‌ను కాదని ఉపేంద్ర సింగర్ రావత్‌కు అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో గొడవ అక్కడ నుండే మొదలయ్యిందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: తిరుమలలో తెలుగమ్మాయి - హీరోయిన్‌గా, నిర్మాతగా విజయం సాధించాలని...