Prema entha maduram Serial Today Episode: పిల్లలిద్దరూ ఏడుస్తూ ఆనంది ఉంటే మాకు ఇష్టం లేదు. పార్టీకి ముందు మిమ్మల్ని ఏం గిఫ్ట్ అడిగాము ఆనంది పార్టీలో ఉండకూడదని అడిగాము అంటూ ఏడుస్తుంటారు. మీరింతక ముందు ఇలా ఉండేవారు కాదు ఇప్పుడెందుకు ఇంత జెలసీ.. అని అను అడగ్గానే ఎందుకంటే అప్పుడు నాన్న మా దగ్గర లేడు. ఇప్పుడు నాన్న ప్రేమ తెలిశాక నాన్న ప్రేమంతా మాకే కావాలనిపిస్తుంది. అంటూ ఏడుస్తుంటారు. దీంతో ఆర్య పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంటాడు. ఆనంది వల్ల అంతా డిస్టర్డ్ అయ్యేటట్టుంది అని ఆర్య మనసులో అనకుంటుండగానే కేశవ ఫోన్ చేస్తాడు.
కేశవ: గుడ్ న్యూస్ ఆర్య ఆనంది పేరెంట్స్ ఎవరో తెలిసింది. ఇప్పుడే కాంటాక్ట్ చేశారు.
ఆర్య: ఎవరు? ఎక్కడున్నారు.
కేశవ: వాళ్లది ముంబై అంట ఆర్య అందుకే ఈ సిటీలో మనకు వాళ్ల ఆచూకి దొరకలేదు. సోషల్ మీడియా పోస్ట్ చూసి కాంటాక్ట్ చేశారు.
అని కేశవ చెప్పగానే ఆర్య హ్యాపీగా పిల్లలిద్దరికీ ఆనంది పేరెంట్స్ దొరికారు వాళ్లు ఇక్కడికి వస్తున్నారట అని చెప్పగానే అఖి, అభయ్ సంతోషంగా ఆర్యను హగ్ చేసుకుంటారు. మరోవైపు కింద నీరజ్ బర్తుడే పార్టీకి వచ్చిన వారిని పంపిచేస్తాడు. ఇంతలో పై నుంచి ఆర్య, అను పిల్లలతో కలిసి కిందకు వస్తారు. ఆనంది ఆర్యను నాన్న అంటూ వెళ్లి హగ్ చేసుకోబోతుంటే బయట నుంచి పాప అంటూ ఇద్దరు వ్యక్తులు వస్తారు. కేశవ వాళ్లను మీరెవరు అని అడగ్గానే తన పేరు హరీష్ చంద్ర తన భార్య పేరు సంయుక్త అని చెప్పి ఆనంది తమ కూతురు అంటారు. అప్పుడు కేశవ ఆనందిని చూపిస్తాడు. వాళ్లు వెళ్లి ఆనందిని ఎత్తుకుని బాధపడుతుంటారు. ఆనంది మాత్రం వాళ్లు ఎవరో తెలియనట్లు ఉంటుంది.
ఆనంది: మీరు మా నాన్న కాదు. ( ఆర్యను చూస్తూ) ఏంటి నాన్నా ఇది.
హరీష్: ఏంటి అమ్మా ఇది నీకు ఇష్టం లేకుండా హాస్టల్ లో జాయిన్ చేసినందుకే ఇంతలా మాట్లాడాలా?
సంయుక్త: అవునమ్మా నేను నిన్ను డే స్కాలర్ స్కూలుకే పంపిస్తాము. ప్రామిస్ చేస్తున్నాను
అంటూ ఇక నుంచి నువ్వు ఏం అల్లరి చేసినా నిన్ను ఏం అనము. మన ఇంటికి పోదాం రా అమ్మా అంటూ వాళ్లు తీసుకెళ్లబోతుంటే ఆనంది వాళ్ల నుంచి తప్పించుకుని ఆర్యను హగ్ చేసుకుంటుంది.
శారదాదేవి: ఆనంది అమ్మా నాన్నా పిలుస్తుంటే ఎందుకమ్మా మొండికేస్తున్నావు.
ఆర్య: హరీష్ చంద్ర గారు పాప మీ నుంచి ఎలా మిస్ అయ్యింది.
హరీష్: లాస్ట్ వీక్ హైదరాబాద్ వచ్చినప్పుడు పాప మిస్ అయ్యింది
అనగానే ఆర్య పాప మిస్సయ్యిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అని అడగ్గానే.. ఇచ్చామని వాళ్లు చెప్పగానే ఏ స్టేషన్‌లో అని ఆర్య అడుగుతాడు. ఒకరేమో పంజాగుట్టా అని మరొకరు నాంపల్లి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత ఏదో సర్దిచెప్తారు. ఆనందిని తన దగ్గరకు రమ్మని అడుగుతుంటే రాలేదని హరీష్ చంద్ర కోపంగా ఆనందిని లాక్కుంటాడు. దీంతో ఆర్య వాళ్లను అనుమానిస్తాడు. అయితే శారదాదేవి, పద్దు, సుబ్బు కూడా వాళ్ల కన్నీళ్లు చూస్తుంటే వాళ్లే నిజమైన పేరేంట్స్ లా ఉన్నారు అనడంతో ఆర్య ఆలోచిస్తుంటాడు. కేశవ కూడా నేను అన్ని వివరాలు తెలుసుకున్నాను అని చెప్పడంతో ఆర్య పాప రాజనందినిలా ప్రవర్తించిన విషయం గుర్తు చేస్తుకుంటాడు.
అను: సార్ మీరు దేని గురించైనా ఆలోచిస్తున్నారా? మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి సార్
ఆర్య: అది కాదు అను నాకెందుకో వీళ్లు..
అనగానే అఖి, అభయ్.. నాన్నా అని ఆర్యను హగ్ చేసుకుంటారు. ఆర్య మీ పాపను మీరు తీసుకెళ్లండని చెప్పడంతో వాళ్లు ఆనందిని తీసుకెళ్తుంటారు. ఆనంది ఆర్యను చూస్తూ ఏడుస్తూ నాన్నా అంటూ పిలుస్తుంది. తర్వాత నీరజ్ ఇక కేక్ కట్ చేద్దామా అనడంతో అందరూ కలిసి కేక్ కట్ చేయడానికి రెడీ అవుతారు. నీరజ్ మాన్షిని పక్కకు లాగి పిల్లలతో కేక్ కట్ చేయిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: 'విశ్వంభర'లో సిస్టర్ సెంటిమెంట్.. చిరుకి ఐదుగురు చెల్లెళ్లు? హిట్లర్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా?