Siri Hanumanth Exit Jabardasth: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఎన్నో ఎళ్లుగా ఈ కామెడీ షో బుల్లితెరపై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఎంతోమంది ఈ షో వల్లే లైమ్‌లైట్లోకి వచ్చారు. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఈ షోనే సుడిగాలి సుధీర్‌ను హీరో చేసింది. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి వంటి వారిని నటులను చేసింది. ఈ షో యాంకర్స్ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అనసూయ, రష్మి గౌతమ్‌లు ఈ షో ద్వారానే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా ఎదిగారు. తనకు అంతగా గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ షో గుడ్‌బై చెప్పి యాంకర్ అనసూయ షాకిచ్చింది.
ఆమె స్థానంలో సౌమ్వ రావు వచ్చింది. ఆమె కూడా ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. కొన్ని నెలలకే సౌమ్య రావు యాంకర్‌గా తప్పుకుంది. ఇక ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో బిగ్‌బాస్ సిరి హనుమంతు వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి కొన్ని నెలలే అవుతుంది. అంతలోనే సిరి గురించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే సిరి హనుమంత్ కూడా జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పబోతుందంటూ ప్రస్తుతం ఓ వార్తల నెట్టింట హల్‌చల్ చేస్తుంది.తాజాగా విడుదలైన ప్రొమో ఈ వార్తలు ఆజ్యం పోసింది. ప్రోమో జబర్దస్త్ కమెడియన్ నూకరాజ్ తన స్కిట్‌లో భాగంగా సిరి ఎక్స్‌ట్‌పై హింట్ ఇచ్చాడంటున్నారు.
Also Read: వరలక్ష్మి శరత్‌కుమార్ కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లై, ఓ కూతురు కూడా ఉందా? - ఏంటి ఈ ట్విస్ట్!
ఇంతకీ ఏం జరిగిందంటే. నిన్న జబర్దస్త్ షోకు సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్కిట్‌లో భాగంగా నూకరాజు సిరి హనుమంత్‌పై కామెడీ చేశాడు. ఆమె దగ్గరి వెళ్లి "సిరి హనుమంత్.. జస్ట్ ఫర్ వన్ మంత్" అని నవ్వుతూ అడగ్గా.. వాడికి ఫ్యూచర్ ఉండాలని వేశాడు అంటుంది. అంటే మీరు కంటిన్యూ అవుతారా? అని ప్రశ్నించాడు. అంతేకదా అని సిరి అనగా.. సరే మిరే చూడండి.. మీకే అర్థమవుతంది అంటూ సటైరికల్‌గా నవ్వుతాడు. ఇక ఇది చూసి కొందరు సిరి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతుందంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ ప్రోమో నూకరాజు అన్న తీరు చూస్తుంటే కూడా అదే నిజమనిపిస్తుంది. ఎందుకంటే నూకరాజు ఇలా అంటూ సిరి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతుందంటూ ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చాడంటున్నారు.
ఇది ఈ షో ఆడియన్స్, ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరి బాగానే చేస్తుంది కదా, ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటుంది, కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు.. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ వస్తుంది, నిజంగానే సిరి జబర్దస్త్ షోను వీడనుందా? తెలియాలంటే నెల రోజుల వరకు వేచి చూడాల్సింది. కాగా బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకట్టుకున్న సిరి మొదట యూట్యూబర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్ జబర్దస్త్ చాన్స్ కొట్టేసింది. హౌజ్‌లో యూట్యూబ్ షణ్ముఖ్ జశ్వంత్‌తో అతి సన్నిహితం వల్ల ట్రోల్స్ బారిన పడింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరైన సిరి బయటకు వచ్చాక సినిమాల్లో సహనటి పాత్రలు, షో హోస్ట్స్, యాంకరింగ్ ఆఫర్స్ కొట్టెస్టూ బిజీ బిజీ అయిపోయింది.