Dulquer Salmaan Out From Thug Life Movie: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘థగ్ లైఫ్'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కమల్‌ హాసన్‌తో పాటు మరో ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించి షూట్‌ కూడా జరిగింది. దుల్కర్‌కి సంబంధించి సెర్బియాలో కొన్ని యాక్షన్‌ సీన్లు కూడా తెరకెక్కించారు మేకర్స్‌. దీంతో కమల్‌హాసన్‌, దుల్కర్‌ సల్మాన్‌, మణిరత్నం కాంబో కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు దుల్కర్‌కి సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


దుల్కర్‌ ఔట్‌.. 


'థగ్‌లైఫ్‌' ప్రాజెక్ట్‌ నుంచి దుల్కార్‌ సల్మాన్‌ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌కి ఆయన హాజరు కావడంలేదనే వార్త నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్‌తో బీజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్‌సెట్‌ కావడం లేదట. దీంతో ఆయన మణిరత్నం ప్రాజెక్ట్‌ నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మూవీ టీమ్‌ నుంచి, దుల్కర్‌ టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


బీజీ బీజీగా దుల్కర్‌.. 


దుల్కర్‌ సల్మాన్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'లక్కీ భాస్కర్‌' అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరో సినిమా సుధా కొంగర డైరెక్షన్‌లో 'సూర్య43'లో సూర్యతో కలిసి నటిస్తున్నారు దుల్కర్‌. ఇక సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న'కాంత' సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటితో దుల్కర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. 


మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'థగ్‌ లైఫ్‌' సినిమాని రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై కమల్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఏఆర్‌ రెహ్మాన్‌ అందిస్తుండగా.. తమిళ హీరో జయం రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కమల్  హాసన్‌ బర్త్  డే గిఫ్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్‌.


ఈ సినిమాలో కమల్‌హాసన్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన వీడియోలో ఆయన లుక్‌ను పరిచయం చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్  కమల్ కనిపించబోతున్నారు. గ్లింప్స్ ఓపెనింగ్ లోనే “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ మొదలు పెట్టారు. ఇక ఆ లుక్‌, అనౌన్స్ మెంట్ వీడియోతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి ప్రేక్షకుల్లో. కమల్, మణిరత్నం కాంబోలో సుమారు 35 ఏండ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా రిలీజ్‌ ఎప్పుడెప్పుడా? అని వెయిట్‌ చేస్తున్నారు. 2024లో మోస్ట్‌ వెయిటెడ్‌ సినిమాల లిస్ట్‌లో ఒకటి 'థగ్‌ లైఫ్‌'. 


Also Read: నా అసలు పేరు ఇది కాదు - అప్పట్లో హీరోయిన్ అలా ఉండేవారు, శ్రీదేవి అలా ఉండేది: అన్నపూర్ణ