Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్‌ కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లై, ఓ కూతురు కూడా ఉందా? - ఏంటి ఈ ట్విస్ట్‌‌!

Valakshmi Sarath kumar: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కాబోయే భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించిన ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఆల్రెడీ పెళ్లై, పిల్లలు ఉన్న వ్యక్తిని వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుందట..

Continues below advertisement

Is Varalakshmi Sarathkumar Finance Married and Divorced: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చింది. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌తో మార్చి 1న ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు ఇరుకుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నికోలాయ్‌ సచ్‌దేవ్‌ ఆర్ట్‌ గ్యారిస్ట్‌, ముంబయిలో అతడు ఆర్ట్‌ గ్యాలరీ నడుపుతున్నాడట. అయితే వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటకు రావడంతో అంతా షాక్‌ అయ్యారు.

Continues below advertisement

నికోలాయ్‌ సచ్‌దేవ్‌కు పెళ్లై, విడాకులు..

ముందు నుంచి ఎలాంటి సమాచారం లేదు రూమర్‌ లేదు. సైలెంట్‌గా వరలక్ష్మి నిశ్చితార్థం చేసుకోవడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి ఫ్యాన్స్‌, నెటిజన్లు ఆరా తీయగా షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె పెళ్లి చేసుకోబోయే నికోలాయ్‌ సచ్‌దేవ్‌కు ఇదివరకు పెళ్లై ఓ కూతురు కూడా ఉందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అంతా వరలక్ష్మి కాబోయే భర్త గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. నికోలయ్ సచ్‌దేవ్‌కు గతంలో కవిత అనే ఓ మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడట. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. నికోలయ్ సచ్‌దేవ్ కూతురు కష సచ్‌దేవ్ పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించింది.

'రెండో పెళ్లి వాడిని చేసుకోవడం అవసరమా?'

భార్యతో విబేధాల వలన విడాకులు అయ్యినట్లు సమాచారం.దాంతో కొన్నేళ్ల క్రితమే నికొలయ్ భార్య కవితతో విడిపోయాడని, ఆ తర్వాత  వరలక్ష్మి శరత్ కుమార్‌తో ప్రేమలో పడి ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. నికోలయ్ సచ్‌దేవ్ భార్య కవితత 2010లో మిసెస్ గ్లాడ్‌రాగ్స్‌గా గుర్తింపు పొంది, కాలిఫోర్నియాలో జరిగిన మిస్ గ్లోబ్ 2011 పోటీలో పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ రంగంలో కొనసాగుతోంది. ఇక నికోలయ్ సచ్‌దేవ్‌కు ఆల్రెడీ పెళ్లైందని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. వరలక్ష్మి ఓ స్టార్‌ నటి, స్టార్‌ నటుడు కూతురు. అలాంటి ఆమె రెండో పెళ్లివాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి.

Also Read: థియేటర్ నుంచి పరుగులు పెట్టించిన భయానక సినిమాలివే - కొందరు మూర్ఛపోయారు, మరికొందరు వాంతులు చేసుకున్నారు

మరికొందరు మాత్రం గతంలో అసలు పెళ్లే చేసుకోని అని చెప్పిన వరలక్ష్మి.. పెళ్లి ఓకే చెప్పడమే మంచి విషయమని, పైగా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తినే ఇష్టపడిందని, చివరికి తనకు నచ్చినవాడిని వెతుక్కుందంటూ ఫ్యాన్స్‌ ఆమెకు సపోర్టు ఇస్తున్నారు. కాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌, నికోలాయి సచ్‌దేవ్‌లది 14 ఏళ్ల పరిచయం.. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. కాగా గతంలో వరలక్ష్మి పెళ్లంటూ చాలా సార్లు రూమర్స్‌ వినిపించాయి. హీరో విశాల్‌తో ప్రేమలో ఉందని, వారికి త్వరలోనే పెళ్లన్నారు. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో వరలక్ష్మి విశాల్‌కు బ్రేకప్‌ చెప్పిందంటూ తమిళ మీడిమాల్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత హీరో శింబుతో ప్రేమ, పెళ్లంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది.  అయితే అవి వార్తలకే పరిమితమయ్యాయి.

Continues below advertisement