So Disturbing Movies: సినీ ప్రియులు అన్ని రకాల సినిమాలను ఇష్టపడుతారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, థ్రిల్లర్, హారర్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ సినిమాలు చూస్తే భయంతో వణుకు పుడుతుంది. కొన్ని సినిమాలు వాంతులు వచ్చేలా చేస్తాయి. మరికొన్ని థియేటర్ల నుంచి బయటకు పరుగులు తీసేలా చేస్తాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?
1. టెర్రిఫైర్ 2
2016లో వచ్చిన ‘టెర్రిఫైర్’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ‘టెర్రిఫైర్ 2’. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యంత జుగుప్సా కరమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా చూసి చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలోనే మూర్చపోయారట. మరికొంత మంది వాంతులు చేసుకుని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఈ సినిమా భయంకరంగా ఉంటుందని ఫిల్మ్ మేకర్ స్టీవ్ బార్టన్ ముందుగానే ప్రేక్షకులను హెచ్చరించడం విశేషం.
2. టైటాన్(2021)
ఇది చాలా విచిత్రమైన కథతో కూడిన ఫ్రెంచ్ మూవీ. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా 13 మంది స్పృహతప్పి పడిపోయారట. అంతేకాదు, మరికొందరు థియేటర్ల నుంచి బయటకు పరుగులు తీశారట. ఈ సినిమా జూలియా డుకోర్నౌ తెరకెక్కించారు.
3. రా(2016)
డ్యూకోర్నౌ తెరకెక్కించిన ఈ సినిమాను చూడాలంటే నిజంగా ఎంతో ధైర్యం కావాలి. ఈ సినిమాలో కొంత మంది మానవ మాంసాన్ని తినడం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో దాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వాంతులు చేసుకున్నారట.
4. మమ్మీ (2014)
సెవెరిన్ ఫియాలా, వెరోనికా ఫ్రాంజ్ కలిసి తెరకెక్కించిన ఈ సినిమాను చూసి థియేటర్లలో ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లల తల్లి ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని చూసి ఆ పిల్లలు ఎలా భయపడతారు? అనేది ఈ సినిమాలో చూపించారు.
5. యాంటీక్రిస్ట్(2009)
ఓ ఫ్యామిలీకి చెందిన చిన్న కొడుకు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి ఘటనలు జరిగాయి అనేది ఈ సినిమాలో చూపించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శన సమయంలో చాలా మంది థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొంత మంది సృహతప్పి పడిపోయారు. ఫ్రాన్స్ లో కొంతకాలం ఈ సినిమాను నిషేధించారు.
6. ఇర్రెవర్సిబుల్ (2002)
ఈ భయానక ఫ్రెంచ్ చిత్రాన్ని కేన్స్ లో ప్రదర్శిస్తుండగా, సుమారు 250 మంది బయటకు వెళ్లిపోయారు. కొందరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దర్శకుడు గాస్పర్ నోయే ఈ సినిమాను తెరకెక్కించారు.
7. ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్(1999)
లోవ్స్ సినీప్లెక్స్ తెరకెక్కించిన ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులను భయపెట్టింది. సినిమాకు వచ్చిన చాలా మంది కొద్ది సేపు చూడకముందే బయటకు వెళ్లిపోయారు.
8. V/H/S (2012)
ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో పలువురు ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు. ఆడం వింగార్డ్, డేవిడ్ బ్రూక్నర్, టి వెస్ట్, గ్లెన్ మెక్‌క్వైడ్, జో స్వాన్‌బెర్గ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు వేర్వేరు హారర్ చిత్రాల సమూహం.
9. సా III (2006)
సా ఫ్రాంచైజీలోని మూడో చిత్రాన్ని చూసి ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా విపరీతమైన హింస ఉంటుంది. ఈ సినిమా చూస్తూ చాలా మంది ప్రేక్షకులలు స్పృహ కోల్పోవడంతో థియేటర్ల దగ్గరికి అంబులెన్స్ లు రావడం విశేషం.
10. 127 అవర్స్ (2010)
ఆస్కార్ కు నామినేట్ అయిన ఈ సినిమాను చూస్తూ చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. బయోగ్రాఫికల్ సైకలాజికల్ సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూస్తూ ఏకంగా 16 మంది మూర్చపోయారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలను కలిగించాయి. హింసకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి.
Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌బర్గ్ దంపతులు