Prabhas Marriage Latest News: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఆ మాటకు వస్తే ఇండియన్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ముందు ఉంటుంది. ఇప్పుడు ఆయనకు 44 ఏళ్ళు. త్వరలో ఓ అమ్మాయి మెడలో మూడు ముడులు వేసి, ఏడు అడుగులు వేస్తే చూడాలని అభిమానులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అసలు, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని ఆయన సన్నిహిత మిత్రుడు, హీరో గోపీచంద్ (Gopichand)ను ప్రశ్నిస్తే... రియాక్షన్ ఏం వచ్చిందో తెలుసా?


ప్రభాస్ పెళ్లి... 'నో' కామెంట్స్!
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' (Bhimaa Movie) ఈ శుక్రవారం  (మార్చి 8న) థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా సంగతులు పూర్తి అయ్యాక... ఓ విలేఖరి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారు. 'ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?' అని అడిగారు. అందుకు బదులుగా 'నో కామెంట్స్' అన్నారు గోపీచంద్. 'అసలు మీ స్నేహితుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు?' అని మరో ప్రశ్న ఎదురైనప్పుడు కూడా 'నో కామెంట్స్' అని చెప్పారు తప్ప సమాధానం ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. రాజకీయ నాయకుల తరహాలో 'నో కామెంట్స్‌ ప్లీజ్‌' అని చెప్పారు.


గోపీచంద్ మీద 'అన్‌ స్టాపబుల్' ఎఫెక్ట్?
ప్రభాస్ పెళ్లి ప్రశ్నలు గోపీచంద్ ముందుకు రావడం ఇది ఏమీ తొలిసారి కాదు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌ స్టాపబుల్' షోకి వెళ్లారు. అక్కడ మ్యారేజ్ టాపిక్ వచ్చింది. ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడని రామ్ చరణ్ ఫోనులో చెప్పిన తర్వాత షోలోకి గోపీచంద్ వచ్చారు.


Also Readఅఖండతో పోలిస్తే మంచిదే! కానీ... 'భీమా'లో అఘోరాలపై గోపీచంద్ ఏం చెప్పారంటే?


బాలకృష్ణ డైరెక్టుగా 'రాణి ఎవరు? గుడ్ న్యూస్ అంటగా! ఇంటి పేరుతో సహా చెప్పు. సననా? శెట్టినా?' అని ప్రశ్న వేశారు. 'మోస్ట్ లీ నెక్స్ట్ ఇయర్ అనుకుంట సార్' (బహుశా... వచ్చే ఏడాది అనుకుంట సార్ పెళ్లి) అని గోపీచంద్ ఆన్సర్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా పక్కన కూర్చున్న ప్రభాస్ షాక్ తిన్నారు. 'నువ్వు, రామ్ చరణ్ మాట్లాడుకుని వచ్చారా? మంచి న్యూస్ అంటే ఏంటిరా? రేపు సోషల్ మీడియాను తట్టుకోలేం' అని అడిగారు. ఆ తర్వాత తన పెళ్లి గురించి మాట్లాడవద్దని స్నేహితులు అందరినీ ప్రభాస్ రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. 'అన్ స్టాపబుల్' షో ఎఫెక్ట్ ఉండి ఉండొచ్చు.


Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో జయసుధ కుమారుడు


ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు జీవించి ఉన్నప్పుడు తరచూ ఆయనకు పెళ్లి ప్రశ్నలు ఎదురు అయ్యాయి. ఆయనకు ప్రభాస్ నట వారసుడు మాత్రమే కాదు, కుటుంబ వారసుడు కూడా! అందువల్ల, ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పెళ్లి అవుతుందో? వెయిట్ అండ్ సి.