Jayasudha elder son Nihar Kapoor to play key role in Pawan Kalyan's Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమాల్లో 'హరి హర వీరమల్లు' ఒకటి. ఈ సినిమాలో సహజ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహిర్ కపూర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన పాత్ర ఏమిటి? సినిమాలో ఎంతసేపు కనిపిస్తారు? అనేది సస్పెన్స్.


'రికార్డ్ బ్రేక్' సినిమాతో హీరోగానూ!
నితిన్ కపూర్, జయసుధ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరిలో చిన్నోడు శ్రేయాన్ కపూర్. కొన్నాళ్ల క్రితం 'బస్తీ' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే... ఇప్పుడు జయసుధ పెద్ద కుమారుడు నటన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.


Also Readఅమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా... ట్రైలర్ చూసి మెచ్చుకుంది: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ


'రికార్డ్ బ్రేక్'లో నిహిర్ కపూర్ ఓ హీరోగా నటించారు. మార్చి 8న ఈ సినిమా విడుదల అవుతోంది. నటుడిగా ఆయన రెండో చిత్రమిది. దీనికి ముందు 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు' సినిమాలో కీలక పాత్ర చేశారు. హీరోగా అవకాశం రావడానికి ముందు పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'లో నటుడిగా అవకాశం వచ్చింది.


సినిమా ఇండస్ట్రీలో లేట్ ఎంట్రీకి రీజన్ ఏమిటంటే?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారసులు చిన్నప్పటి నుంచి కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. 20 ఏళ్లు వచ్చేసరికి హీరోగా లేదంటే నటుడిగా వస్తారు. కానీ, నిహిర్ కపూర్ 35 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చారు. లేట్ ఎంట్రీకి రీజన్ ఏమిటి? అని ఆయన్ను అడిగితే... ''నేను క్రికెటర్ కావాలని అనుకున్నాను. చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది కూడా హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్ ఆడాలని! ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టాను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను'' అని నిహిర్ కపూర్ చెప్పారు.


ఎటువంటి క్యారెక్టర్ చేయడానికి అయినా రెడీ!
'రికార్డ్ బ్రేక్' సినిమాలో ఇద్దరు హీరోల్లో నిహిర్ కపూర్ ఒకరు. ప్రస్తుతం తాను హీరో రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవడం లేదని ఆయన తెలిపారు. భారీ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వచ్చినా నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. విలన్ రోల్స్ చేయడానికి సైతం సిద్ధమని స్పష్టం చేశారు. నితిన్ ఆరడుగుల కంటే ఎత్తుగా ఉన్నారు. సో... ఆయనకు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Also Read: అఖండతో పోలిస్తే మంచిదే! కానీ... 'భీమా'లో అఘోరాలపై గోపీచంద్ ఏం చెప్పారంటే?


నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు నిహిర్ కపూర్ స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ కోర్స్ చేశారు. డాక్యుమెంటరీలు తీశారు. అయితే... ప్రజెంట్ డైరెక్షన్ చేయడానికి టైం ఉందని చెబుతున్నారు. సో... భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టుకునే అవకాశం ఉంది. జయసుధ విషయానికి వస్తే... యంగ్ మెగా హీరోలతోసినిమాలు చేశారామె. 'ఎవడు'లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మదర్ రోల్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పరుగు' సినిమాలో హీరోయిన్ మదర్ రోల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో కథానాయికగా కొన్ని సినిమాలు చేశారు.