Trinayani Today Episode గాయత్రీ పాపకి ప్రమాదం జరిగితే నయని కనిపెడుతుందా లేదా అని తెలుసుకోవడానికి తిలోత్తమ పాప తాగే పాలలో విషం కలిపేస్తుంది. అది తెలీక నయని పాపకి విషం కలిపిన పాలు ఇచ్చేస్తుంది. ఇక నయనికి తెలీలేదు అంటే ఈ పాపే గాయత్రీ అక్కయ్య అని తిలోత్తమ అనుకుంటుంది. మరోవైపు పాప పాల బాటిల్‌ని పట్టుకొంటే ఉలూచి పాము వచ్చి ఆ విషం ఉన్న పాలు తాగేస్తుంది.
డమ్మక్క: అక్క తెలివికి చెల్లిల సహకారానికి సరిపోయింది.
నయని: మా అక్కా చెల్లెల గురించా..
డమ్మక్క: కాదు ఇంకొకరు ఉన్నారులే..
వల్లభ: మమ్మీ పాప పాలు తాగేస్తుంది. అందులో విషం ఉంది కదా..
తిలోత్తమ: రేయ్ అందరికీ చెప్పేస్తావా ఏంటి.
హాసిని: ఏంటి తల్లీ కొడుకులు చెవులు కొరుకుతున్నారు. అఖండ స్వామిని తీసుకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చారు.
వల్లభ: ఫొటో వెనక పాము ఉంటుంది అని మాకు ఎలా తెలుసు..
తిలోత్తమ: అప్పుడు అంటే పాము వచ్చింది కానీ ఇప్పుడు రాదులే..
విశాల్: అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అమ్మ.
విక్రాంత్: ఏం చేశారేంటి మళ్లీ.
నయని: చెడ్డ పని చేస్తేనే శిక్షించడానికి వస్తాడు నాగయ్య.
తిలోత్తమ: అమ్మా రాదు.. అయ్య రాడు..
సుమన: అరే నిజంగా ఈ పిల్ల ఘటికురాలే.. రెండేళ్లు కూడా లేవు తన పని తానే చేసుకుంది. పాల బాటిల్ ఖాళీ కావడంతో..
విక్రాంత్: నయని వదిన అలా పెంచుతుంది. మరి.
సుమన: నేను నా కూతుర్ని అలానే పెంచుతా..
డమ్మక్క: నువ్వు ఎలా పెంచుతావో ఏమో కానీ నీ కూతురు ఇప్పుడు మేలు చేసింది.
పావనా: అదేంటో చెప్పు డమ్ము..
డమ్మక్క: చెప్పలేను పాము చూసుండాల్సింది.
విక్రాంత్ ఉలూచికోసం ఇళ్లంతా వెతుకుతాడు. హాసిని కూడా వస్తుంది. విక్రాంత్‌ని ఇమిటేట్ చేస్తుంది. ఇక సుమన వచ్చి పాలు తాగిద్దామని ఉలూచిని నేను పిలిచాను. రాకపోతే ఈయన పిలుస్తున్నారు అని అంటుంది. ఇక హాసిని పాలు ఉలూచికి తాగించొద్దు అంటుంది. ఇక పాలను తన అత్త, లేక భర్తకు ఇస్తానని తీసుకుంటుంది.
విక్రాంత్: ఉలూచి నీ కూతురు అయినా నీ బిడ్డ ఎప్పుడు పాలు తాగుతుంది ఎంత తాగుతుంది అని వదినకు తెలిసినంత కూడా నీకు తెలీదు చూడు.
సుమన: మా అక్క, ఈ అక్క తెలివైన వారు అండీ.. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అని అందరూ అనుకోవాలి అని ఇలా చేస్తారు. ఆస్తులన్నీ వీళ్లిద్దరి పేరిట ఉన్నాయని రేపు ఎవరూ వాళ్లముందు ఎదురు తిరగకూడదు అని ఇలా అందర్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.
విక్రాంత్: ఛీ.. నీ ముఖాన ఎంతమంది ఉమ్మేసినా నువ్వు మారవు.
తిలోత్తమ: రేయ్ నయని పాలలో విషం ఉంది అని గ్రహించలేదు అంటే దాని అర్థం ఏమనుకుంటున్నావు రా..
వల్లభ: జోగయ్య శాస్త్రిగారి మనవురాలు అని మనల్ని ఇనాళ్లు నమ్మించారు అమ్మ. కన్న కూతుర్నే దత్తత తీసుకున్నారు.
హాసిని: అయిపోయిందా మీ ఓవర్‌యాక్షన్.
వల్లభ: ఎవరిదే నటన విశాల్‌ది నటన, నయనిది నటన..
హాసిని: మీ కొడుకు ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నాడు.
తిలోత్తమ: నిజమే కదా. ఆపద తనకు వచ్చిన తన బిడ్డకు వచ్చినా నయని కనిపెట్టలేదు కదా అంటే ఈ గాయత్రీ మా అక్కయ్యే కదా..
హాసిని: ఓర్నీ మీ ఇద్దర్నీ ఏ సంతలో అమ్మాలి అంటారు. గాయత్రీ పాపకు ఏం కాలేదు జరగలేదు అని జబ్బలు జరుచుకుంటున్నారా.. ఏదో ఒకటి అవ్వాలి అనే కదా మీరు అందులో ఏదో కలిపారు కదా..
వల్లభ: అవును మా మమ్మీ అందులో సంథింగ్ కలిపింది. నయని గ్రహిస్తే ఆ పిల్ల మా పెద్దమ్మ కాదు. గ్రహించకపోతే ఆ పిల్ల మా పెద్దమ్మే అని ఫ్రూవ్ అయినట్లు కదా..
హాసిని: ఆ పాలు తాగిన గాయత్రీకి ఏం కాలేదు అని గ్రహించలేకపోయారు అంటే మీరు ఏంటో అర్థం చేసుకోండి.. అని ఉలూచి పాము పాలు తాగడం తిలోత్తమకు చూపిస్తుంది. దాంతో తిలోత్తమ షాక్ అవుతుంది. అందుకే గాయత్రీకి ఏం కాలేదా అని అనుకుంటారు.
డమ్మక్క శివరాత్రి సందర్భంగా మహా లింగాన్ని ఇంటికి తీసుకురమ్మని అంటుంది. దాన్ని సుమన అడ్డుకుంటుంది. విశాల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంతలో గురువుగారు వచ్చి పూజలు చేస్తే అమ్మవారు కనికరించి మీకు దర్శనభాగ్యం ఉంటుంది అని అంటాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో గాయత్రీ పాప వస్తుంది. చేతిలో తిలోత్తమ వాళ్లు చల్లిన తులసి పత్రాలు పట్టుకుంటుంది. తిలోత్తమ చూసి షాక్ అవుతుంది. ఆకులు కూడా ఈ పిల్ల వదలదు అంటే .. తినడానికి కాదు స్వామిగారికి చూపించడానికి అని డమ్మక్క అంటుంది.
గురువుగారు: అర్థమైంది గాయత్రీ.. పాములు రాకుండా అఖండ స్వామికి రక్షగా తులసి దళాలను ఇచ్చాను. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు.
హాసిని: ఇంకెవరు స్వామిని తీసుకెళ్లిన అత్తయ్య మా ఆయన తీసుకొచ్చుంటారు.
సుమన: మిమల్ని పాము కాటేస్తుంది అని మీకు భయమా బావగారు
తిలోత్తమ: అఖండస్వామి ఇంటికి వస్తారో రారో అని తులసి పట్టుకొని వచ్చాం.
గురువుగారు: ఈ తులసి దళాలు ఉంటే పెద్దబొట్టమ్మ కానీ నాగయ్య కానీ ఇంటికి లోపలకి రావడం కష్టం అవుతుంది తిలోత్తమ.
హాసిని: రాకూడదు అనే పట్టుకొని వచ్చుంటారు.
తిలోత్తమ: చిన్న పిల్లలు తిరిగే ఇంట్లో పాములు తిరుగుతాయి అనే భయం ఉంటుంది కదా..
సుమన: గాయత్రీ అత్తయ్య రేపో మాపో వస్తుంది అని మీరు కాలయాపన చేస్తున్నారు. అత్తయ్య వాళ్లు మాత్రం గాయత్రీ అత్యయ్యని వెతికే పనిలో పడ్డారు. ఇది అత్తయ్య వాళ్లుకు మీకు ఉన్న తేడా..
ఇక పెద్దమ్మ దర్శనం మాకు కల్పించండి అని వల్లభ గురువుగారిని అడుగుతాడు. దాంతో గురువుగారు శివపూజ చేయండి గాయత్రీ దేవి ఉనికి తెలుస్తుంది అని అంటారు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: వరలక్ష్మి శరత్ కుమార్: కాబోయే భర్తను ముద్దులతో ముంచెత్తిన వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో చూశారా?