Varalaxmi Sarathkumar – Nicholai Sachdev: సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌ దేవ్‌తో ఆమె నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో.. వీరిద్దరి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా వరు తన ఎంగేజ్మెంట్ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.


మార్చి1న వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరగ్గా.. మార్చి 5న ఆమె తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇలా తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైన రెండు విషయాలను కొద్ది రోజుల గ్యాప్ లో జరుపుకోవడంతో వరలక్ష్మి చాలా హ్యాపీగా వుంది. తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలిపింది. వండర్ ఫుల్ బ్లెస్సింగ్స్ కు, లవ్లీ బర్త్ డే విషెస్ అందజేసిన వారందరికీ థాంక్స్. ఇది నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం. మీరందరూ అందులో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మార్చిన ఫ్యామిలీ మెంబెర్స్ కు, స్నేహితులకు థాంక్యూ అని వరు పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా తన నిశ్చితార్థ వేడుక వీడియోని పంచుకుంది.


ముంబైలో వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్‌ దేవ్ నిశ్చితార్థం హిందూ సాంప్రదాయాల ప్రకారం, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఒకరికొకరు దండలు మార్చుకోవడం.. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకొని ఐ లవ్ యూ చెప్పుకోడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో శరత్ కుమార్ - రాధిక దంపతులు కూడా సందడి చేశారు. ఇందులో వరు తన కాబోయే భర్తను లిప్ కిస్ లతో ముంచెత్తడం హైలైట్ గా నిలిచింది. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.


 Also Read: ‘శతమానం భవతి’ సీక్వెల్.. శర్వా ప్లేస్ లో ఆ క్రేజీ హీరో!






నికోలయ్‌ సచ్‌ దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తూ, ఆన్‌ లైన్‌ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు విక్రయిస్తుంటారు. అయితే అతనికి ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తన భార్యకు విడాకులిచ్చి ఇప్పుడు వరలక్ష్మీతో మ్యారేజ్ కు రెడీ అయ్యారట. ఇక నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. అది ప్రేమగా మారినప్పటికీ తమ రిలేషన్ షిప్ ను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రొఫెషనల్ జీవితాల్లో బిజీగా ఉండటంతో, వివాహ బంధంలో అడుగుపెట్టడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తోంది. సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. వైవిధ్యమైన నటన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాదు.. లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తుంది. ఇటీవల ఆమె నటించిన ‘హను-మాన్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆమె ఇప్పుడు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాయన్‌’ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మలయాళంలో ‘కలర్స్‌’, తెలుగులో ‘శబరి’ చిత్రాలు చేస్తోంది.


Also Read: జరగండి జరగండి.. 'గేమ్ ఛేంజ‌ర్‌' అప్డేట్ తో చెర్రీ వచ్చేస్తున్నాడు!