Game Changer Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. అయితే చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకి రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ రాబోతోంది.


గతేడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్ ఛేంజ‌ర్‌' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. అయితే ఈ ఏడాది పుట్టిన రోజుకు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 'జరగండి జరగండి' అనే పాటను మార్చి 27న విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని అంటున్నారు.


వాస్తవానికి 'జరగండి' ఆడియో సాంగ్ ఎప్పుడెప్పుడో లీక్ అయింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంక చేసేదేమీ లేక 2024 దీపావళి స్పెషల్ గా అదే పాటను అధికారికంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన కూడా ఇచ్చింది. కానీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. నెలలు గడుస్తున్నాయి కానీ, ఇంతవరకూ ఆ పాట ఊసే లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డేకి సాంగ్ వదలాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారనే సమాచారం అందుతోంది. 


Also Read: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న నందమూరి హీరో, ‘బ్రీత్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?


'జరగండి' సాంగ్ కోసం మ్యాజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మాంచి హుషారైన బీట్ అందించినట్లు తెలుస్తోంది. పది కోట్లకు పైగా ఖర్చు చేసి, శంకర్ శైలిలో భారీ స్కేల్ లో ఈ పాటను చిత్రీకరించారని టాక్. ఇప్పుడిదే గీతాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయబోతున్నారట. ఇదే కనుక నిజమైతే ఇది కచ్ఛితంగా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు.


‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ లో రాబోతున్న 50వ సినిమా. ఇందులో ఎస్‌.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్, సముద్రఖని, నవీన్‌ చంద్ర, సముద్ర ఖని, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ మూవీకి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా  సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Also Read: క్రాక్స్ వేసుకొని మిడిల్ క్లాస్ ఏంటి? - నెటిజన్ ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇదే!