Brahmamudi Serial Today Episode: భాస్కర్‌ను రాజ్ బాత్రూమ్‌కు తీసుకెళ్తాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన భాస్కర్ కావాలనే రాజ్‌తో ఆటాడుకుంటాడు. రాజ్ వెళ్లిపోతుంటే.. బుజ్జి అని పిలుస్తాడు. ఇప్పుడు మళ్లీ బుజ్జి ఎందుకురా అని రాజ్ అంటాడు. సబ్బు అయిపోయింది అన్నయ్య అని భాస్కర్ అంటాడు. అరేయ్.. నిన్నే మోసాను. నాకు సబ్బు ఓ లెక్కనారా తీసుకొస్తానని వెళ్లి తీసుకొస్తాడు రాజ్.
భాస్కర్: అన్నయ్యా.. ఇది నీకు చెప్పాల వద్దా అని ఆలోచిస్తున్నాను.
రాజ్: ఏంటో చెప్పి తగలడు..
భాస్కర్: నాకు డీబీలు కావాలి
రాజ్: డీబీలా? అవేంట్రా?
భాస్కర్: ఇన్నర్ వేర్స్ అన్నయ్యా.. డ్రాయర్, బనియన్.
రాజ్: ఎలాంటి వాన్ని ఎలా చేశావురా.
అని విసుక్కున్న పోయి ఇన్నర్ వేర్స్ తీసుకొస్తాడు. మరోవైపు ఇంటి బయట స్వప్న ఫొటో షూట్ చేస్తుంది. అది చూసి రుద్రాణి షాక్ అవుతుంది.
రుద్రాణి: ఏంటిది. ఇంట్లో వాళ్లు నిన్ను మోడలింగ్ చేయొద్దన్నారుగా
స్వప్న: నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే టైమ్ పాస్‌కి మోడలింగ్ చేయట్లేదు. మీరే ఇక్కడ అడుక్కు తింటున్నారు. నా సంగతి నేను చూసుకోవాలి కదా. అందుకే మోడలింగ్ స్టార్ట్ చేశాను.
ధాన్యలక్ష్మీ: ఇప్పుడు మన ఇంటి గౌరవం దెబ్బతినదా. ఇలాంటి ఫొటోలు బయటకు వెళితే దుగ్గిరాల కుటుంబం పరువు ఎమౌవుతుంది.
రాహుల్: ఏంటీ దరిద్రం మమ్మీ
రుద్రాణి: తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి. ఇప్పుడు ఏంటీ అంటే ఎలా
అపర్ణ: అత్త, భర్త చేతులు ఎత్తేస్తే ఎలా? కొంచమైనా కంట్రోల్‌లో పెట్టాలి కదా
సుభాష్: ఇప్పుడు ఏం మాట్లాడొద్దు.. ఆ ఫొటోషూట్ అయిన తర్వాత స్వప్నతో మాట్లాడుదాం
అని సుభాష్ చెప్పగానే అందరూ చూస్తుండిపోతారు. మరోవైపు వీడిని ఎలా వదిలించుకోవాలి. కావ్యను కలవకుండా ఎలా చేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. తర్వాత కావాలనే భాస్కర్‌కి కావ్య ఇడ్లీ తినిపించేందుకు ట్రై చేస్తుంది. అది చూసి రాజ్ ఇరిటేట్ అవుతుంటాడు. ఆఫీస్‌లో కొంపలు అంటుకుంటున్నాయి. మనం ఆఫీస్‌కు వెళ్లాలి పదా అని కావ్యను తీసుకుని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు ఫొటోషూట్ తర్వాత స్వప్నను నిలదీస్తుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి రాజ్, స్వప్న వస్తారు.
రుద్రాణి: ఏదైనా చేసేముందు మాకు చెబితే బాగుండేది కదా
స్వప్న: పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది.
ధాన్యలక్ష్మీ: ఏంటా పరిస్థితులు
స్వప్న: ఈ ఇంట్లో మా అత్తగారు, భర్త అడుక్కు తింటున్నారట. నాకు ఏమైనా ఖర్చులు ఉంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలట
ధాన్యలక్ష్మీ: అదేంటీ రుద్రాణి. అలా ఎలా అన్నావ్. వాళ్లే ఇక్కడ దోచుకుతింటుంటే
కావ్య: చిన్నత్తయ్యా. ఇక్కడ ఎవరు ఎవరిని దోచుకుతినట్లేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇక్కడ జరిగేదేంటీ మీరు అనేదేంటీ?
అనామిక: దోచుకుతినకపోతే.. అప్పుని ఎరగా వేసి మా ఆయనను దక్కించుకుందామనుకున్నారుగా?
కావ్య: నా కుటుంబాన్ని అనేముందు నువ్ ఓసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇంతకన్న నేను ఏం అనను
అనామిక: ఇక్కడ ఉన్న వాళ్ల గురించి మాట్లాడు. అంతేకానీ లేని వాళ్ల గురించి అనడం సభ్యత కాదు.
స్వప్న: భర్తగా, అత్తగా వీళ్లు చేతులెత్తేశారు. రేపు నాకు పుట్టబోయే బిడ్డ గురించే నా బాధంతా. వాడు కూడా దేహి అని అడగాలా. వాడికి వీళ్లు ఓ డ్రెస్ తీసుకురాగలరా.
సుభాష్: మమ్మల్ని అడిగితే అయిపోయేది కదమ్మా?
స్వప్న: మిమ్మల్ని ఎలా అడగగలను అంకుల్
అని స్వప్న అనగానే తను చెప్పింది కరెక్టే కదా డాడ్. ఏరా రాహుల్ నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని రాజ్ అంటాడు. దీంతో చూసుకోడానికి నా దగ్గర ఏముందు బూడిద తప్పా అంటాడు రాహుల్. సరే సమస్య మాదాక వచ్చింది కదా. తాతయ్య ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఇక్కడితే ఆపేసేయ్ అని స్వప్నతో ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా లోపలికి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఆఫ్ స్క్రీన్ లో 'హను-మాన్' సూపర్ విలన్ విన్యాసాలు చూశారా?