Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటికి వచ్చిన పోలీసులను చూసి షాక్ అవుతుంది అరుంధతి. ఇంటికి ఎందుకు వచ్చారు అనుకుంటూ వాళ్లతో పాటు లోపలికి వెళుతుంది.


ఎస్సై: అమర్ ని విష్ చేసి మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. ఈ కేస్ ని నేనే మోనిటర్ చేస్తున్నాను. మీరు చెప్పిన హంతకుడు సిటీ దాటలేదు అని చెప్తాడు.


అమర్: అయితే వాడు సిటీలోనే ఉన్నాడన్నమాట ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. నేను చెప్పినది అమలు చేయండి అసలు వాడు ఎందుకు అలా చేశాడు ఎవరు చెప్తే చేశాడు అనేది తెలుసుకోవాలి అంటాడు.


ఎస్సై : మీరు చెప్పినవన్నీ చేసాం ఇక మీదట కూడా అలర్ట్ గా ఉంటాం అని చెప్పడంతో అమర్ వాళ్ళని పంపించేస్తాడు.


ఇదంతా వింటున్న మనోహరి భయంతో వణికి పోతుంది తన గదిలోకి వెళ్లి హంతకుడికి అడిగినంత డబ్బు ఇచ్చి పంపించేయాలి లేదంటే అమర్ కి దొరికిపోతాను. ఇదంతా జరిగేలోపే అమర్ తో నా మెడలో మూడు ముళ్ళు వేయించుకోవాలి అనుకుంటుంది.


మరోవైపు ఇంటికి వచ్చిన రామ్మూర్తి భార్యకి యూనిఫారం ఇచ్చి ఉతకమని చెప్పి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. అప్పుడే భాగి ఇంటికి వస్తుంది.


మంగళ: ఇంత సడన్ గా వచ్చావ్ ఏంటి? నాన్నతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది.


మిస్సమ్మ : లేదు, నాన్నే నాతో ఏదో మాట్లాడాలని చెప్పి రమ్మన్నారు అంటూ అనుకోకుండా యూనిఫామ్ ని చూస్తుంది.


యూనిఫామ్ చేత్తో పట్టుకుని చూస్తుంది. అప్పుడే రామ్మూర్తి లోపలికి వస్తాడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అంటూ తండ్రిని  నిలదీస్తుంది. కూతురికి అడ్డంగా దొరికిపోయినందుకు నీళ్లు నములుతాడు రామ్మూర్తి.


మంగళ: ఇది మీ నాన్న యూనిఫారం కాదు కాళీది చెప్పాను కదా అతను కష్టపడి పని చేస్తున్నాడని అని అబద్ధం చెప్తుంది.


నిజం చెప్తే కూతురు బాధపడుతుందని రామ్మూర్తి కూడా నేను ఉద్యోగం చేయడం లేదు అని చెప్తాడు. తర్వాత కూతురితో కాసేపు మాట్లాడి పంపించేస్తాడు.


మంగళ : అదేమిటి కూతుర్ని పిలిపించి పెళ్లి గురించి మాట్లాడకుండా పంపించేసావు అని అడుగుతుంది.


 రామ్మూర్తి: నాకు ఆలోచించుకోవటానికి టైం కావాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


కాళీ : మనం ఎంత చేస్తున్నా పని జరగటం లేదేంటి అక్క అంటాడు.


మంగళ: మనం ఇస్తున్న డోసు సరిపోలేనట్లుగా ఉంది ఇంకాస్త డోస్ పెంచాలి అంటుంది. 


మరోవైపు తను వద్దంటున్నా వినకుండా ఎలక్షన్స్ లో పేరు ఇచ్చినందుకు అంజు మీద కోప్పడుతుంది అమ్ము.


అంజు: ఎందుకు ముందే ఓడిపోతాను అని భయపడటం గెలవడానికి  నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటుంది.


ఐడియా అన్నావంటే చితకొడతాను అంటారు మిగిలిన వారు.


అంజు: ఇప్పుడు ఇలాగే అనండి రేపు ఎప్పుడైనా ఐడియాలు రాక నా దగ్గరికి వస్తారు కదా అప్పుడు చెప్తాను అంటుంది.


అంటే మా ఎవ్వరికి బుర్రలు లేవనా అని మిగిలిన ముగ్గురు అంటారు.


అంజు: అది వేరే చెప్పాలా అనడంతో మిగిలిన ముగ్గురు అంజు ని కొడుతుంటారు.


ఇదంతా చూస్తున్న అరుంధతి చిన్నదాన్ని ఒక్కతిని చేసి కొట్టొద్దు మిస్సమ్మ కూడా లేదు అనుకుంటూ గుప్తాని పిలుచుకు రావడానికి వెళుతుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న మిస్సమ్మను చూసి షాక్ అవుతుంది. మిస్సమ్మ కూడా అరుంధతిని చూసి షాక్ అవుతుంది. ఈవిడ ఏమిటి ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది  అయినా ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటుంది. అదే విషయం అరుంధతిని అడుగుతుంది.


అరుంధతి: నిన్ను చూద్దామని వచ్చాను నువ్వు లేకపోవడంతో పిల్లల్ని చూడటానికి వెళ్లాను వాళ్లు కొట్టుకుంటున్నారు అని చెప్తుంది.


మిస్సమ్మ : కంగారుగా పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని విడిపిస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఎదురింటి ఆంటీ వచ్చి నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే కొట్టుకుంటూనే ఉండేవారు అంటుంది.


పిల్లలు: ఇప్పటివరకు ఇక్కడ ఎవ్వరూ లేరు మేము మాత్రమే ఉన్నాము మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


మిస్సమ్మ:  అదేంటి అక్క పిల్లల దగ్గర నుంచి వచ్చానని చెప్పింది అని అనుమాన పడుతుంది.


మరోవైపు హంతకుడు వేరొక వ్యక్తితో కలిసి మనోహరి ఇంటి దగ్గరికి వస్తాడు.


ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాడు ఫ్రెండ్.


హంతకుడు: ఆమెకి మరిచిపోయిన భయాన్ని పరిచయం చేస్తాను.. దొరికిపోయినా నేనెవరో చెప్పుకోలేని పరిస్థితి ఆమెది అంటాడు.


ఫ్రెండ్: నేను పక్క గల్లీలో ఉంటాను పని అయ్యాక ఫోన్ చెయ్ వస్తాను అంటాడు. అలాగే అని చెప్పిన హంతకుడు మనోహరి ఇంటి గోడ దూకి లోపలికి వస్తాడు.  అది చూసిన అరుంధతి షాక్ అవుతుంది. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది. 


Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను