Naga Panchami Today Episode : మోక్షఏదో ఆలోచిస్తూ ఉంటే పంచమి మోక్ష దగ్గరకు వెళ్తుంది. తమకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందని మీ భయమని కానీ తన తల్లి తనని మోసం చేయదని చెడు ఆలోచనలు వద్దని పంచమి అంటుంది. 


పంచమి: నేను మిమల్ని మోసం చేయను మోక్షాబాబు. ఒక అందమైన బిడ్డను కని మీ చేతిలో పెడతాను సరేనా.


మోక్ష: నీ సంతోషమే నా సంతోషం. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు అనుమానాలు లేవు. మన దైవమే మనల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే. ఎన్ని సవాళ్లు ఎదురుకోవడానికి అయినా సిద్ధమే. మన బుజ్జి కొండ కోసం ఏ త్యాగానికి అయినా నేను సిద్ధమే. ఏంటి మళ్లీ ఆలోచనలోకి వెళ్లావు. 


పంచమి: నా కోసం మీరు చాలా త్యాగాలు చేశారు. ఇక మీకు అలాంటి పరిస్థితి రాదు. 


మోక్ష: మన బిడ్డ అదృష్టవంతురాలు. మా అమ్మ మనసు కూడా మారిపోయింది. అంతా మన బంగారం ప్రభావమే అందరి మనసులు మార్చేసింది.


పంచమి: మీరు మన బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. రేపు మన కళ్లు కప్పి మాయమైపోయింది అంటే ఏం చేస్తారు.


మోక్ష: ప్లీజ్ జోక్‌గా కూడా అలా అనకు పంచమి. మన బిడ్డ వజ్రం. గుండెల నిండా ప్రేమలతో పుడుతుంది.


మోక్ష పంచమి ఒడిలో పడుకుంటాడు. పంచమి మోక్షని గొప్పగా వర్ణిస్తుంది. దీంతో మోక్ష నువ్వు అలా చెప్తే మన బిడ్డ నా గురించి గొప్పగా ఊహించుకుంటుందని అంటాడు. ఇక పంచమి మోక్షతో మీ ప్రేమను పొందిన వారు ప్రాణాలు అయినా వదులుకోగలరు కానీ మిమల్ని వదులుకోలేరు అని అంటుంది. 


ఇక పంచమి ఆరు బయట పూలు గుచ్చుతూ ఉంటే జ్వాల అక్కడికి వస్తుంది. పంచమిని చూసే సరికి జ్వాలలోని గరుడ యాక్టివేట్ అయిపోతుంది. గరుడ అరుపులు పంచమికి వినిపిస్తాయి. పంచమి కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతుంది. ఇక జ్వాల తనను పగతో చూస్తూ దగ్గరకు రావడం పంచమి చూసి భయపడుతుంది. 


పంచమి జ్వాలతో ఏమైంది మీకు.. మిమల్ని చూస్తే నాకు భయంగా ఉంది. వెళ్లిపోండి అని అంటుంది. జ్వాల మాత్రం పంచమి మీదకు వస్తుంటుంది. జ్వాల ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఏమైందని పంచమి మనసులో అనుకుంటూ ఉంటుంది. జ్వాల పంచమి కడుపు మీద చేయి వేయబోతే పంచమి జ్వాలను నెట్టేస్తుంది. దాంతో జ్వాల.. పంచమి గొంతు పట్టుకొంటుంది. పంచమి విడిపించుకోవడానికి ప్రయత్నించినా విఫలమవుతుంది. ఇక పంచమి జ్వాలను నెట్టేసి ఇంట్లోకి పరుగులు పెడుతుంది.


మరోవైపు అందరూ భోజనానికి వస్తారు. జ్వాల కూడా లోపలికి వచ్చేస్తుంది. పంచమి గురించి వైదేహి అడుగుతుంది. పంచమికి ఆకలి లేదు అని మోక్ష చెప్తాడు. దీంతో జ్వాల తానే పంచమి కోసం భోజనం తీసుకెళ్తా అంటుంది. అందరూ షాక్ అవుతారు. 


జ్వాల: పంచమి కూడా నాలాంటి ప్రెగ్నెంటే కదా. ఒకరికి ఒకరం సాయం చేసుకోవడంలో తప్పు లేదు కదా. 


వైదేహి: నేను కోరుకునేది ఇదే.. పంచమి మీ ఇద్దరూ ఈ ఇంటి కోడళ్లు. మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. మీరు కలిసి మెలసి ఉండండి.


రఘురాం: మోక్ష వెళ్లి పంచమిని పిలుచుకురా.


మోక్ష: నాన్న ఎంత పిలిచినా తను రాను అంటుంది. తనకి నేనే గదిలోకి తీసుకెళ్తాను.


మీనాక్షి: ఏదైనా కడుపులో నలతగా ఉంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లు మోక్ష అశ్రద్ధ చేయకు.


భార్గవ్: అబ్బా ఇళ్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏ గొడవలు లేవు.


వరుణ్: అవును పాత రోజులు గుర్తొస్తున్నాయి.


రఘురాం: కొన్ని రోజులు పోతే పసి పిల్లలతో ఇళ్లు కళకళాడుతుంది. చిత్ర శిశిరని కూడా పిలిపించు.


చిత్ర: ఈ సంవత్సరం అయ్యాక పిలిపిస్తాను మావయ్య గారు. అప్పుటికి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు. 


వైదేహి: జ్వాల పంచమిని మీ సొంత చెల్లిలా  చూసుకోండి. మొదటిలో నేను కూడా పంచమిని కొంచెం దూరం పెట్టాను. కానీ ఇప్పుడు అలా ఏం లేదు.


మీనాక్షి: వదినా ఇంట్లో నువ్వు మారితే అందరూ మారినట్లే. ఇక నుంచి అయినా పంచమిని జాగ్రత్తగా చూసుకుందాం.


పంచమి జరిగిన దాన్ని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. మోక్ష టిఫిన్ తీసుకొని వస్తాడు. పంచమి వద్దు అన్నా మోక్ష తినిపిస్తాడు. ఇంట్లో అందరూ నీ మీద ప్రేమ  చూపిస్తున్నారని మోక్ష చెప్తాడు. జ్వాల కూడా ప్రేమ కురిపించిందని చెప్తాడు. దీంతో పంచమి షాక్ అయిపోతుంది. జ్వాల మాటల్లో నిజం కనిపించిందని అంటాడు. దాంతో పంచమి జ్వాల చేసిన పని చెప్పనని అనుకుంటుంది. 


మోక్ష తనకు తన అన్నలు అంటే చాలా ఇష్టమని అలాంటి వాళ్లతో కూడా గొడవపడాల్సిన అవసరం వచ్చిందని బాధ పడతాడు. దాంతో పంచమి అంతా నా వల్లే నేను మీ జీవితంలోకి రాకుండా ఉండాల్సిందని అంటుంది. దీంతో మోక్ష తనని నాగ గండం నుంచి తప్పించి తనకు ఈ పునర్జన్మనిచ్చింది నువ్వే అని పంచమితో అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: చెల్లి తన జోలికి రాకుండా చేయమని మహాలక్ష్మికి చెప్పిన మధు.. రౌడీని చితక్కొట్టిన సీత!