Jyothi Rai Private Video Leaked: ‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా గుర్తింపు పొందిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఎంతో బోల్డ్‌గా ఉంటుందో తెలిసిందే. అయితే, తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ నెటిజన్ ఆమె అశ్లీల వీడియోలను బయటపెడతానంటూ.. కొన్ని స్క్రీన్ షాట్స్‌ను పోస్ట్ చేశాడు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియా పోస్ట్..
‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా, హీరో తల్లి పాత్రలో కనిపించింది జ్యోతి రాయ్. అందులో ఆన్ స్క్రీన్ తల్లి పాత్రలో కనిపించినా కూడా తనను ఆఫ్ స్క్రీన్ సోషల్ మీడియా పోస్టులు చూస్తే హీరోయిన్ రేంజ్‌లో ఉంటాయని నెటిజన్లు అనుకుంటూ ఉంటారు. మోడర్న్‌గా రెడీ అయ్యి ఫోటోషూట్స్ చేయడం, గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జ్యోతి రాయ్‌కు అలవాటే. దానివల్ల తను పలు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయితే, గత కొద్ది రోజులు కన్నడ మీడియాలో జ్యోతిరాయ్ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారు.
ఇలా జరగడం బాధాకరం..
అభి అనే ఒక వ్యక్తి.. జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా జ్యోతి రాయ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు వస్తే ఆ వీడియోను పోస్ట్ చేస్తానని అభి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇది సంచనలంగా మారింది. ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ కన్నడ నటి కావడంతో కర్ణాటకలో కూడా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రైవేట్ వీడియోపై జ్యోతి రాయ్ కూడా స్పందించింది. తన పరువు తీయడానికి ప్రయత్నించిన నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరింది. తనకు సంబంధించిన ఎటువంటి ప్రైవేట్ వీడియోలు లీక్ లేదని స్పష్టం చేసింది. మరి ఈ విషయంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఆ పోస్టులను ట్విట్టర్ నుంచి తొలగించారు.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
Also Read: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!