Satyabhama Today Episode : తమకు వారసుల్ని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని మహదేవయ్య సత్యను ప్రశ్నిస్తాడు. దీంతో విశాలాక్షి సత్యకు సమాధానం చెప్పమని అంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్తున్నాను అని సత్య మనసులో అమ్మవారికి దండం పెట్టుకొని తనకి వారుసుల్ని ఇవ్వడం ఇష్టమే అని మహదేవయ్యతో చెప్తుంది.
మహదేవయ్య: రేయ్ చిన్నా.. మరి నీ సంగతి ఏంటిరా.
క్రిష్: వారసుల్ని ఇచ్చే విషయంలో పెళ్లాంది ఒక మాట మొగుడిది ఒక మాట ఉండదు కదా బాపు.
విశాలాక్షి: పనిలో పని నందినితో కూడా ముడుపు కట్టిద్దామా వదినగారు.
విశ్వనాథం: అవును మా ఇంటికి కూడా వారసుడు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. హర్ష నువ్వు ఏమంటావ్.
భైరవి: నాకు అభ్యంతరం ఉంది. మనకు అంటే ఆచారం ఉంది కాబట్టి చేయిస్తున్నాం. వాళ్లకు లేదు కదా ఎందుకు. ఉన్న ఆచారం చేయకపోవడం ఎంత తప్పో. లేని ఆచారం చేయడం కూడా అంతే తప్పు.
మహదేవయ్య: ఇది కూడా కరెక్టే వదిలేయండి. పంతులు దోష నివారణకు పరిహారం ఏం చేయాలో మా వాళ్లకి చెప్పు.
పంతులు: అమ్మవారి ఆగ్రహం శాంతింపజేయడానికి ఒళ్లు వంచి పని చేయాలి. గుడిలోని మెట్లు అన్నీ శుభ్రం చేయాలి. ఆ తర్వాత ప్రతి మెట్టుకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి.
భైరవి కోడలికి పంతులు చెప్పినట్లు చేయమని అంటుంది. ఇక పంతులు క్రిష్ కూడా చేయాలి అంటాడు. భైరవి క్రిష్ చేయలేడు అంటే వారసుడి కోసం తప్పదు చేయమని మహదేవయ్య అంటాడు. ఇక నందిని భైరవితో మాట్లాడటానికి తీసుకెళ్తుంది.
నందిని: నా బతుకుని ఏం చేయబోతున్నావ్. ఎంత సేపు కోడలి ముడుపు అనుకుంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నావ్ నా వైపే చూడటం లేదు.
భైరవి: ఎందుకే అట్లా గరం అయిపోతున్నావు. మీదకి కోడలి మీద అరుస్తున్నా లోపల ఆలోచిస్తున్నా.
నందిని: ఏం ప్లాన్ చేస్తున్నావో నాకు చెప్పు.
భైరవి: చెప్పను చేసి చూపిస్తా. అవును నేను చెప్పినట్లు ఉల్లి పాయలు పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నావు కదా. ఈ వేడి సరిపోదే ముఖం కూడా నీరసంగా పెట్టు. ముందు దోష పరిహారం పూజ పూర్తి అవ్వాలి. ఆ తర్వాత పదహారు రోజుల పండగ ప్రారంభం కావాలి. నీ మెడలో తాళి బొట్టు మార్చగానే నువ్వు చక్కెర వచ్చినట్లు పడిపోవాలి. ఆ తర్వాత మీ అత్తింటి వారి ముఖంలో కారం కొట్టి నిన్ను పుట్టింటికి తీసుకెళ్లిపోతా. నీ మొగుడి మెడ వంచుతా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయ్.. నేను చేయాల్సింది నేను చేస్తా.
సత్య, క్రిష్‌లు అమ్మవారికి మొక్కుకుంటారు. సత్య తన భర్తతో విడిపోతూ ఇలా ముడుపు కట్టడం తప్పని కానీ పెద్దవాళ్ల కోసం తప్పకకడుతున్నానని మన్నించమని కోరుకుంటుంది. ఇక క్రిష్ తనకు కన్ఫ్యూజ్‌గా ఉందని ఏం కోరుకోవాలో అర్థం కావడం లేదని సత్య మనసులో మాట నెరవేరాలని కోరుకుంటాడు.
ఇక సత్య క్రిష్‌లు చీపురు, బకెట్ పట్టుకొని కడగడానికి బయల్దేరుతారు. మెట్లు చూసి క్రిష్ షాక్ అయిపోతాడు. ఇంతలో మహదేవయ్య తొందరగా ప్రారంభించండని చెప్పడంతో క్రిష్ సరే అని వెళ్లాడు. క్రిష్ బిందెతో నీరు తీసుకొస్తాడు. సత్య మెట్లు కడుగుతుంది.
పంతులు విశాలాక్షి దగ్గరకు వచ్చి ముడుపు సిద్ధం చేయమని చెప్తాడు. అమ్మవారి తర్వాత తల్లి దీవెన అంత గొప్పదని మంచిగా దీవించి ముడుపు కట్టమని అంటాడు. ఇక భైరవి వచ్చి ముడుపు పళ్లెం తీసుకుంటుంది. మహదేవయ్య వారసుడు అంటే ఓ రేంజ్‌లో ఉండాలని తామే ముడుపు సిద్ధం చేసుకుంటామని అంటుంది. విశ్వనాథం కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది.
హర్ష ఎదురు తిరగడంతో నందిని కూడా హర్ష మీద కోప్పడుతుంది. దీంతో విశ్వనాథం కొడుకుని అడ్డుకుంటాడు. పెద్దవాళ్లు గొడవ పడితే పిల్లల కాపురం మీద ఎఫెక్ట్ పడుతుందని.. గతాన్ని మర్చిపోదామని అంటాడు.
మహదేవయ్య: నాకు కావాల్సింది కూడా అదే బావగారు. మా ఇంట్లో మీ కూతురు నవ్వుతూ ఉండటం. మీ ఇంట్లో మా కూతురు నవ్వుతూ ఉండటం. భైరవి ఆ ముడుపు సామాను పెద్ద మనిషికి ఇవ్వు. ముడుపు ఎవరు కడితే ఏంటి. నా వారసుడిలో ఉండేది నా కొడుకు రక్తం. ఆటోమెటిక్‌గా నా పౌరుషం వస్తుంది. చెల్లమ్మ ముడుపు కడితే జరంత చదువు కూడా వస్తుందేమో చూద్దాం. పంతులు చూస్తారేంటి ఆ ముడుపు సామాను చెల్లమ్మ చేతికి ఇవ్వండి.
విశాలాక్షి: ఇద్దరం కలిసి చేద్దామా వదిన.
భైరవి: అవసరం లేదు కానీ. నెల తిరిగే సరికి నీ కూతురు నెల తప్పకపోతే అప్పుడు చెప్తా.
సత్య గుడి మొత్తం కడుగుతుంది. క్రిష్ బిందెతో నీరు మోస్తాడు. క్రిష్ నీరు మోసి అలసి పోయి ఇబ్బంది పడతాడు. కడగడం అయిన తర్వాత సత్య మెట్లకు పసుపు రాస్తే క్రిష్ కుంకుమ పెడతాడు. ఇక క్రిష్ అలసిపోయి కూలబడిపోతే సత్య కుంకుమ తీసుకొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.