Brahmamudi Serial Today Episode : రేపటిలోగా నిజం తెలియకపోతే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని రుద్రాణి బెదిరిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ప్రకాశం కల్పించుకుని తనకు మొదటి నుంచి మరిచిపోయే జబ్బు ఉందని.. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోతే నిన్ను మర్చిపోవడం నావల్ల కాదని బాధపడతాడు. అమ్మ ఇచ్చే ఆఖరి చాన్స్ వదులుకోవద్దని బతిమాలుతాడు. ఇంతలో అపర్ణ నిజం చెప్పు అని ఆ బిడ్డను ఈ ఇంటికి వారసుణ్ని చేయాలని ఉందా? ఆ బిడ్డ తల్లిని నీ భార్యగా తీసుకురావాలని ఉందా? చెప్పు అని అడుగుతుంది.
స్వప్న: ఏంటి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? మీ పెద్దరికానికి చెదలు పట్టిందా ఏంటి? సంవత్సరం నుంచి మీరు మా అత్త మీ తోడికోడలు, ఆవిడ గారి కోడలు ఎన్ని మాటలు అన్నా.. ఎంత అవమానించినా.. కావ్య ఓపికగా ఉన్నందుకు ఇదా మీరిచ్చే బహుమానం.
అపర్ణ: స్వప్న ఇది మా కుటుంబ సమస్యా?
ఇందిరాదేవి: ఏ కుంటుంబ సమస్య.. ఏ సమస్యా?
అపర్ణ: మన కుటుంబ సమస్యా..
ఇందిరా: సమస్య ఎవరు లేవనెత్తారు. ఎవరు పెద్దది చేస్తున్నారు. ఈ కుటుంబం అంతా కలిసి వాడిని వెలివేయమని చెప్పామా? నీలా ఏకపక్ష నిర్ణయాలు మాత్రం అమలు చేయమని చెప్పామా?
ప్రకాశం: వదిన మేం అందరం మీ మాటకు కట్టుబడతాం. ఒకవిధంగా భయపడతాం కూడా మీరంటే గౌరవం. కానీ రాజ్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఒక తల్లిగా తీసుకోవడం లేదు. రాజ్ ను బయటకు పంపించడం మాకు నచ్చడం లేదు.
అనగానే కళ్యాణ్ కూడా అపర్ణను ఎందుకింత పంతానికి పోతున్నారు అంటూ అడుగుతాడు. ఇక భర్తలేని ఇంట్లో ఏ ఆడది ఉండదని తప్పో ఒప్పో ఆయనతో పాటు నేను కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని కావ్య చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. సుభాష్, ఇందిరా దేవి కావ్య నిర్ణయాన్ని చాలా గొప్పదిగా చెప్తారు. గొప్ప భార్యగా చరిత్రలో నిలిచిపోతావని కావ్యను మెచ్చుకుంటారు. కడుపులోంచి బయటకు తీసుకొచ్చిన బిడ్డనే వెళ్లగొట్టాలని చూస్తున్న నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావని అపర్ణను అంటారు. దీంతో అపర్ణ రాజ్ విషయంలో నేను నిర్ణయం తీసుకునే హక్కు లేకపోతే.. నా విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకే ఉంటుందని రేపు ఉదయం లోగా రాజ్ నిజం చెప్పకపోతే ఈ ఇంటి పెద్ద కోడలు ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. అంటూ కోపంగా చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. బెడ్‌రూంలోకి వెళ్లిన సుభాష్, అపర్ణను ఓదారుస్తాడు. రాజ్ విషయంలో రోజురోజకు మొండిగా తయారవుతున్నావని చెప్తాడు.
అపర్ణ: ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది. ఇన్నేళ్ల కాపురంలో నా గురించే ఇంతేనా మీరు తెలుసుకున్నది.
సుభాష్: జరిగినవన్నీ చూస్తూ ఎవరైనా ఇంకెలా అర్థం చేసుకుంటారు. ఇంతకంటే ఇంకేం తెలుసుకుంటారు.
అపర్ణ: అమ్మ ఎప్పుడూ అమ్మే నండి కొడుకు ఉన్నతంగా బతకాలని కోరుకుంటుంది. కానీ వాడి పతనం ఎప్పటికీ కోరుకోదు.
సుభాష్: ఈ మాట ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ వాడు ఆ బిడ్డను తెచ్చినప్పటి నుంచి ఎలా మాట్లాడుతున్నావో చూస్తూనే ఉన్నాను.
ఇవన్నీ ఒక అమ్మగానే చేశానని అపర్ణ బాధపడుతుంది. ఇవన్నీ చేస్తేనైనా వాడు నోరు తెరుస్తాడని చేశానని అపర్ణ చెప్తుంది. వాడు నా నిర్ణయాలకు భయపడి నిజం చెప్తాడనుకుంటే తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉండిపోయాడు. నా కోపం ఒక తెర మాత్రమేనని ఆ తెర వెనక ఒక అమ్మ ఉంది అని బాధపడుతుంది. ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పేవరకు నేనిలాగే ఉంటానని చెప్పడంతో ఒకవేళ ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్తే అని సుభాష్ అడగడంతో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఏకమైనా ఆ బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి చేస్తానని అపర్ణ చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఒకప్పటి స్టార్ కమెడియన్, ఇప్పుడిలా! - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ నటుడు..