Kirrak RP Counters to Roja: ప్రస్తుతం దాదాపు బుల్లితెర సెలబ్రిటీలు అంతా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే జనసేనకే బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల నుండి ఎక్కువగా మద్దుతు అందుతోంది. ముఖ్యంగా ‘జబర్దస్త్’ కమెడియన్లు చాలామంది పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ప్రచారాల్లో బిజీ అయిపోయారు. మరోవైపు అదే షోలో జడ్జిగా కనిపించిన రోజా.. వైసీపీ ప్రచారాల్లో వారిపై విమర్శలు కురిపిస్తూ కనిపిస్తున్నారు. దానిపై తాజాగా కిరాక్ ఆర్పీ.. ఒక ప్రెస్ మీట్‌లో స్పందించాడు. రోజాపై తాను కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


దమ్ముంటే చేసి చూపించు..


జనసేన సపోర్టర్స్‌ను రోజా విమర్శిస్తున్నారని, దానిపై తన స్పందన ఏంటి అని ఆర్పీని అడగగా.. ‘‘మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటాం. గౌరవించకపోతే రోజా అంటాం. రోజా ఏం మాట్లాడింది.. ఆది, నేను, ఇలా కొందరు వెళ్లి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నది. మేమంతా చిన్న చిన్న ఆర్టిస్టులం అంటా. ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా? ఆ యువరాణి ఏమైనా 10 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా? వాళ్లు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వారికి పవన్ కళ్యాణ్‌పై లేదా టీడీపీ అంటే ఇష్టం ఉంది. మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టుల అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను చేసే ఒక్క క్యారెక్టర్ అయినా నీ జీవితంలో చేయగలవా?’’ అంటూ ‘జబర్దస్త్’ ఆర్టిస్టులతో రోజాను పోలుస్తూ వ్యాఖ్యలు చేశాడు ఆర్పీ.


డిపాజిట్లు కూడా రావు..


‘‘సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూ తన ఛరిష్మాతో సినిమా హీరో అయ్యాడు. నీకంటే వాడికి 10 రెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వాడితో నువ్వు పోటీ పడగలవా? ఆది వచ్చి జబర్దస్త్ చరిత్రనే మార్చాడు. నువ్వు పంచులకు జడ్జిమెంట్ ఇస్తే చాలు. ఆది అందరినీ గంటపాటు ఏకధాటిగా నవ్వించి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బ్రతుకులో ఎప్పుడైనా ఈ ముగ్గురిలాంటి ఛరిష్మా చూశావా? నిన్ను ఎవరూ ఏం మాట అననప్పుడు నీకెందుకు ఉనికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారి ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి. మా రోజమ్మ. నీకు నగరిలో డిపాజిట్లు కూడా రావు. మేము ఎప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసుకుంటే నీకెందుకు’’ అంటూ రోజాపై సీరియస్‌గా ఫైర్ అయ్యాడు ఆర్పీ.


దిగజారిపోయావు..


‘‘7 మంది హీరోలు మెగా ఫ్యామిలీలో ఉంటే.. 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. నీకు దమ్ముంటే ఆయనను ఎదిరించి మాట్లాడు. నిన్ను లేపేస్తాడేమో చూద్దాం. ప్రతీ ఒక్కరు నీలాగా దిగజారిపోయి, అందరి వెనక తిరుగుతూ బ్రతుకుతారు అనుకుంటున్నావా? వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. కనీసం జనసేనకు అయినా వచ్చి అక్కడ మద్దతు పలుకు. నీ బ్రతుకు బాగుంటుంది. నగరిలో అసలు నువ్వు చేసిన అభివృద్ధి ఏముంది? సామాన్యులు తిరుమలకు వెళ్తే మీ అన్నకు నచ్చదు. జూన్ 4న అందరి లెక్కలు తేలుస్తాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు కిరాక్ ఆర్పీ.



Also Read: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!