Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మి, అర్చన మధుని బయటకు తీసుకొద్దామని వెళ్తారు. ఇక గదిలో మధు సీత తనని నెట్టిసి తలుపు గడియ పెట్టడాన్ని తలచుకొని రగిలిపోతుంది. సీత పని చెప్తా అనుకుంటుంది. ఇక మహాలక్ష్మి, రేవతిలు తలుపు తాళం తీసి మధు దగ్గరకు వస్తారు.
మధు: సీత నాతో చాలా రూడ్‌గా ప్రవర్తించిందండి. దాని మీద నాకు చాలా కోపంగా ఉంది.
మహాలక్ష్మి: మాతో కూడా సీత బ్యాడ్‌గానే ప్రవర్తిస్తుంది మధు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా.
అర్చన: సొంత అక్కవైన నీతోనే సీత ఇలా ప్రవర్తిస్తే మరి మాతో ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో మధు.
మధు: నాకు అర్థమైంది అండి. సీతకు పొగరు బాగా పెరిగింది. మీరు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత బాగా చూసుకుంటారు. సీతకు ఆ ఇదే లేదు. నేను ఇష్టం కాదు కదా కనీసం గౌరవం లేదు. నన్నే నెట్టేసి డబ్బు తీసుకొని తలుపు గడియ పెట్టి వెళ్లిపోయింది.
మహాలక్ష్మి: సీత మాకు ఎదురు పడింది మధు. జరిగింది చెప్పింది. సీతకు నువ్వు ఎదురు తిరగడం కరెక్ట్. అది ఆఫీస్ డబ్బు కాబట్టి నువ్వు అడ్డుకోవడం కరెక్టే.
మధు: కానీ తను నా మాట వినలేదు. నీకు ఏం హక్కు ఉందని అడిగింది. అనకూడని మాటలు అని నన్ను అవమానించింది.
మహాలక్ష్మి: సారీ మధు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను.
అర్చన: నువ్వు కాదు మహా. ఆ సీతతోనే క్షమాపణ చెప్పించాలి.
మధు: అవునండి మీరు చెప్పకూడదు. తనతోనే చెప్పించండి.
మహాలక్ష్మి: సరే మధు అందరి ముందు సీతతో నీకు సారీ చెప్పిస్తాను.
మధు: అంతే కాదండి ఇంకెప్పుడు అది నా జోలికి రాకూడదు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి.
అర్చన: అసలు ఈ ఇంటి కోడలివి నువ్వే మధు. రామ్ భార్యవి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సీత లాంటి దాన్ని అసలు ఈ గడప తొక్కనిచ్చేవాళ్లమే కాదు.
మహాలక్ష్మి: అవును మధు బ్యాడ్ లక్ ఏం చేస్తాం. నాకు మాత్రం నువ్వంటేనే ఇష్టం. నేను నీకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తా.
అర్చన: నీకు ఓ మాట తెలుసా మధు. మహా దృష్టిలో ఇప్పటికీ నువ్వే కోడలివి. సీత పరాయి మనిషి.
మహాలక్ష్మి: అర్చన అవన్నీ ఎందుకు మధు బాధపడుతుంది. సీత విషయం మేం చూసుకుంటాం మధు. నువ్వేం వర్రీ అవ్వకు.
అర్చన: సీత మీద మధుకు చాలా కోపం వచ్చింది మహా. మొదటి సారి చెల్లి మీద కోప్పడుతుంది.
మహాలక్ష్మి: దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సీతపై మధు పగ పెంచుకునేలా చేయాలి. అక్కా చెల్లిల్ని బద్ధ శత్రువుల్ని చేయాలి. ఇక హాస్పిటల్‌కి వెళ్లిన సీతని రామ్ పొగడ కూడదు. రామ్ తిట్టేలా చేయాలి అని మహా రౌడీలకు కాల్ చేస్తుంది.
సీత డబ్బుతో వస్తుందని తనని ఆపి డబ్బు తీసుకొని వెళ్లిపోమని మహా చెప్తుంది. మహా చెప్పిన రౌడీ సీత వెళ్తున్న ఆటోని అడ్డుకుంటాడు. సీత దగ్గర డబ్బు లాక్కొని బైక్ మీద వెళ్లిపోతాడు. సీత వాడి వెంట పరుగులు పెడుతుంది. ఇంతలో సీతకు మధ్యలో కోబ్బరి బోండాలు పట్టుకొని సాంబ కనిపిస్తాడు. సీత వాటిని తీసుకొని పక్కనే ఉన్న మరో వ్యక్తి తలపాగా అడిగి వాటిని చుట్టి రౌడీ మీదకు విసురు తుంది. దీంతో రౌడీ కింద పడిపోతాడు. ఇక సీత వాడిని చితక్కొడుతుంది.
సీత వాడిని కొడుతుంటే సాంబ వీడియో తీస్తాడు. ఇక రౌడీ సీతకు డబ్బులు ఇచ్చేసి పారిపోతాడు. సీత డబ్బులు తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక సాంబ ఆ వీడియో మహాలక్ష్మికి చూపించాలి అనుకుంటాడు.
మహాలక్ష్మి రౌడీకి కాల్ చేస్తే సీత చితక్కొట్టి డబ్బులు తీసుకుందని సీత సామాన్యురాలు కాదని అంటాడు. దీంతో రౌడీని మహా తిడుతుంది. ఇంతలో సాంబ మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. కొబ్బరి బొండాలు తెమ్మని చెప్పా తెచ్చావా అని సాంబని అడిగితే కొబ్బరి చిప్పలు చేతిలో పెడతాడు. అర్చన సాంబని తిడితే జరిగింది చెప్తాడు. ఇక ఆ వీడియోని మహాలక్ష్మి, అర్చనలకు చూపిస్తాడు. మహా సాంబ మీద చిరాకు పడుతుంది.
మరోవైపు శివకృష్ణ ఇంట్లో అందరూ సుమతి గురించి టెన్షన్ పడతారు. సుమతి గురించి వెతికిన శివకృష్ణ.. సుమతి జాడ తెలియలేదు అని చెప్పడంతో అందరూ భయపడతారు. శివకృష్ణ తల్లి ఏడుస్తుంది. లలిత ధైర్యం చెప్తుంది. తన మనసు కీడు శంకిస్తుందని తల్లి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.