Naga Panchami Today Episode మోక్ష పంచమితో తనలోని విషాన్ని పోగొట్టిన తర్వాతే మనం కలుస్తాం.. కాపురం చేసి పిల్లల్ని కందాం అని మోక్ష అంటాడు. సైంటిస్టులు అదే పనిలో ఉన్నారు అని త్వరలోనే మన కోరిక నెరవేరుతుంది అని మోక్ష అంటాడు. దానికి పంచమి తన చివరి కోరిక ఒకటే అని మేఘనను పెళ్లి చేసుకోను అని అంటే వెంటనే నాగలోకం వెళ్లిపోతా అని అంటుంది.
పంచమి: కనీసం అప్పుడైనా మీరు మేఘనను పెళ్లి చేసుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటారు. మీరు ఇంకేం చెప్పకండి. నిజంగా మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను ప్రాణాలతో చూడాలి అనుకుంటే మీరు మేఘనని పెళ్లి చేసుకోవాలి. నేను నాగలోకం వెళ్లిపోయినా నాకు ఇష్టరూప శక్తులు ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా భూలోకంలో ఈ రూపంలో కనిపిస్తూ ఉండగలను. లేదంటే మీ కారణంగా నేను ప్రాణాలతో ఉండను. మీరు ప్రాణాలతో ఉండరు.
మోక్ష: మనసులో.. ఎలా అయినా నేను పంచమిని మామూలు మనిషిగా మార్చుకోగలను. అంత వరకు మేఘనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పంచమిని ఆపాలి.
పంచమి: ఎక్కువ సమయం లేదు మోక్షాబాబు. మీరు కాదు అంటే నేను నాగలోకం వెళ్లిపోతా.. వేరే మార్గం లేదు.
మోక్ష: నేను మేఘనని పెళ్లి చేసుకుంటా. నిజంగానే చెప్తున్నా.. అయితే మా పెళ్లి వరకు నువ్వు ఇక్కడే మాతోనే ఉండాలి.
పంచమి: మోక్షని హగ్ చేసుకొని.. మిమల్ని వదిలించుకోవాలి అని నేను అలా మాట్లాడలేదు మోక్షాబాబు. మీ ప్రాణాలను దక్కించుకోవడానికి నాకు వేరే అవకాశం లేదు. నేను ఎక్కడున్నా నా ప్రాణం మీ దగ్గరే ఉంటుంది.
మోక్ష: మనసులో.. నాకు తెలుసు పంచమి మనద్దరిది ఒకటే ప్రాణం అని. ఎలా అయినా నిన్ను నేను మార్చుకుంటాను. మన ఇద్దరిని ఎవరూ దూరం చేయలేరు.
వైదేహి: ఏవండీ మీరు రావడం మంచిదే అయింది. లేదంటే ఇంట్లో జరిగే దారుణాలకు నాకు పిచ్చి పట్టేది.
రఘురామ్: అయినా నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నాకు షాక్‌గా ఉంది. అందరికి పులిలా కనిపించే నువ్వు ఇలా గదిలో కూర్చొని కన్నీళ్లు కార్చుతున్నావ్ అంటే ఇలా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు వైదేహి.
వైదేహి: అంతా ఆ పంచమి వల్లే అండి. అందరి ముందు నన్ను ఎదురించి బెదిరించే స్థాయికి ఎదిగింది. మన మోక్ష పూర్తిగా మారిపోయాడు. నా మాటకే విలువ ఇవ్వడం లేదు.
రఘురామ్: వైదేహి ఇంట్లో మన స్థాయి తగ్గుతుంది అంటే పిల్లలు ఎదుగుతున్నారు అని అర్థం చేసుకొని పక్కకు తగ్గితే మంచిది.
వైదేహి: పంచమి మీద నాకే కాదండి ఇంట్లో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. పంచమిలో ఏదైనా నాగశక్తి ఉందో.. లేక దుష్ట శక్తి పంచమిలో దూరి ఆడిస్తుందో నాకు తెలీదు. కానీ పంచమి మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి కానీ మోక్షతో కాపురం చేయడానికి కానీ పనికి రాదు. పంచమి విషయం వేరు. దానిలో ఉన్న శక్తి ధాటికి తట్టుకోలేడు. ఇప్పటికే పంచమి మాయలో పడి విలవిల్లాడి పోతున్నాడు. మోక్షని మనం అలాగే వదిలేస్తే మనకు ఇక మోక్షా దక్కడు.
ఇక ఉదయం రఘురాం, వైదేహి ఇంట్లో అందరికి పిలుస్తారు. ఇక అందరూ వచ్చి మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటారు. వైదేహి తన కొడుకు మోక్షకి న్యాయం చేయమని అంటుంది. ఇక చిత్ర పంచమి రావడం వల్లే ఇంట్లో అన్ని జరుగుతున్నాయి అని అన్నింటికి పంచమినే కారణం అని అంటుంది. ఇక జ్వాల అయితే ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్తుంది.
రఘురాం: జ్వాల పంచమి నిన్ను చంపబోయింది అంటే.. నేను నమ్మను.
వరుణ్: ఆ విషయమే మీతో మాట్లాడాలి నాన్న ఒక్కోసారి జ్వాలా ఏం చేస్తుందో తనకే తెలీడం లేదు. తనని ఏదో ఒక శక్తి ఆవహించినట్లు అవుతుంది.
భార్గవ్: పెద్దనాన్న ఇంట్లో జరుగుతున్న సంఘటనలు మాత్రం భయం పుట్టిస్తున్నాయి.
రఘురాం: వాటిన్నంటికి కారణం పంచమి అని మీరంతా నమ్ముతున్నారా..
వైదేహి: అందులో ఏ మాత్రం అనుమానం లేదండి..
మేఘన: పంచమి చాలా మంచి అమ్మాయి. పంచమిని ఆవహించిన ఏదో దుష్ట శక్తి ఇవన్నీ చేయిస్తుంది అని నాకు అనిపిస్తుంది.
శబరి: ఒకవేళ అలాంటి శక్తులు ఏమైనా పట్టి పీడిస్తున్నా ఓ పెద్ద మంత్రగాడిని పిలిపించి పూజలు చేయిద్దాం రఘురాం. అంతే కాని అందుకోసం ఓ అమాయకురాలి జీవితాన్ని బలి పెట్టొద్దు.
మోక్ష: నేను మేఘనను పెళ్లి చేసుకుంటా నాన్న.. కానీ మా పెళ్లి వరకు పంచమి ఇక్కడే ఉంటుంది. అందుకు మీరు ఒప్పుకోవాలి.
వైదేహి: సరే మళ్లీ నువ్వు మాట మార్చవు కదా మోక్ష. రేపే నిశ్చితార్థం. ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేస్తా.
ఇక మోక్ష పంచమిని వెతుక్కుంటూ వస్తే బాల్యానిలో నెమలి పింఛం కనిపిస్తుంది. దాన్ని తీసుకొని మోక్ష ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటాడు. ఇక అక్కడికి సుబ్బు వస్తాడు.
మోక్ష: హాయ్ సుబ్బు కూర్చొ.. మా ఇంటికి రావడానికి నీకు ఇంత టైం పట్టిందా.
సుబ్బు: ఈరోజు కొంచెం టైం దొరికింది మోక్ష అందుకే వచ్చా.. పంచమి నువ్వు సంతోషంగా ఉంటున్నారా మోక్ష.
మోక్ష: అంత అదృష్టం నాకు లేదు సుబ్బు. పంచమి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు.
సుబ్బు: నువ్వు పంచమని సరిగా అర్థం చేసుకోవడం లేదు. అదే నిజం మోక్ష. పంచమిని అంచనా వేయడానికి ఒక జీవిత కాలం సరిపోదు.
మోక్ష: నువ్వు చెప్పేది నిజం సుబ్బు. ఎన్ని చెప్పినా చివరకు తన మాటే నెగ్గించుకుంటుంది. నేను కూడా తనకు అడ్డు చెప్పలేను.
సుబ్బు: పంచమిది నిజమైన ప్రేమ.. పంచమి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే నువ్వు ప్రేమిస్తున్నావు. కానీ నువ్వు ద్వేషించినా పంచమి నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అది ప్రేమంటే.. కళ్లు కోరుకునేది ప్రేమ కాదు.. ప్రేమంటే గుండెల్లోంచి పుట్టాలి. నువ్వు ఏం చేసినా ప్రేమతో చేయు మోక్ష. పంచమి మీద ఇష్టంతో కాదు. అప్పుడే పంచమి నీకు దూరం కాదు.
మోక్ష: నువ్వు చెప్పిన తర్వాత నా పంచమిని నేను కాపాడుకోగలను అనే ధైర్యం వచ్చింది సుబ్బు.. థ్యాంక్స్..
వైదేహి: పంతులు గారు నిశ్చితార్థానికి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. మేఘన నువ్వు నాతో రా షాపింగ్ వెళ్లి బట్టలు కూడా కొంటా..
మోక్ష: మేఘన వెళ్లి పంచమిని తీసుకురా..
వైదేహి: శుభకార్యానికి తను ఎందుకురా..
మోక్ష: ఎవరున్నా లేకున్నా పంచమి ఉండాల్సిందే..
పంచమి: మోక్షా బాబు పిలిచారా..
మోక్ష: అవును పంచమి మేఘనకు నాకు నిశ్చితార్థం కదా బట్టలు కొనాలి. నువ్వు పక్కనుంటే మంచిది అని.
పంచమి: అందుకు నేను ఎందుకు మోక్షాబాబు. మీరు వెళ్లండి.
మోక్ష: ఏం పంచమి మేఘన నీ ఫ్రెండ్ నీ చేతుల మీదే నీ భర్తని మేఘనకు అప్పగించనున్నావు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.