Seethe Ramudi Katnam Today Episode మధుమిత తన తండ్రి మాటలు తలచుకొని బాధ పడుతుంటుంది. ఇక జలజ మధుని మహాలక్ష్మి ఇంటికి చేర్చడానికి ఇదే మంచి సమయం అని అనుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి మధుని సిటీకి తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్లు మధుమిత ఇంటికి వస్తారు. 


మహాలక్ష్మి: మన అంతఃపురంలో ఉండాల్సిన మధుమిత ఇలాంటి దిక్కుమాలిన కొంపలో ఉంది జనా..
జనార్థన్: మధుమితను మనం తీసుకెళ్లడానికే కదా వచ్చాం ఎలా అయినా తీసుకెళ్దాం మహా..
జలజ: రండి మేడమ్.. రండి సార్.. మీరు మా ఇంటికి రావడం సాక్ష్యాత్యు ఆ మహాలక్ష్మి దేవి శ్రీ మహవిష్ణువు వచ్చినట్లు ఉందా.. 
మహాలక్ష్మి: మధుమిత ఇంట్లో ఉందా..
జలజ: ఉంది మేడమ్.. అంతా మీరు చెప్పినట్లు చేసి మధు మనసు మార్చుతున్నాను మేడం. మధు మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా.. చెప్తే నమ్మవు రా చూద్దువు గానీ.. రా.. పద మధు.
మహాలక్ష్మి: రా మధుమిత ఇలా వచ్చి నా పక్కన కూర్చొ.
మధు: పర్లేదు అండీ..
జలజ: మహాలక్ష్మి మేడం లాంటి వారు మన ఇంటికి రావాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి. అలాంటిది నీ కోసం వచ్చారు అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. 
మహాలక్ష్మి: మేం మధుతో కాస్త మాట్లాడాలి.. ఏంటి మధుమిత మరీ ఇంత డల్ అయిపోయావు. 
మధు: ఫోన్‌లో మీరు నాకు హెల్ప్ చేస్తాను అంటే పోలీసులకు ఫోన్ చేస్తారు అనుకున్నాను కానీ మీరే వస్తారు అని నేను ఊహించలేకపోయాను. చాలా థ్యాంక్స్ అండీ.
మహాలక్ష్మి: నువ్వు మా మనిషివి నీకు ఏం కష్టం వచ్చినా మేం ఉన్నాం. సూర్య గురించి నువ్వు వర్రీ అవ్వొద్దు. నాకు తెలిసిన పోలీసులు, లాయర్లతో మాట్లాడి ఎలా అయినా సూర్యను బయటకు తీసుకొస్తా..
జనార్థన్: అవును మధుమిత ఇప్పటికే కొందరితో మాట్లాడాం. డ్రగ్స్ కేసు కదా కొంచెం టైం పడుతుంది అన్నారు. 
మధు: పర్లేదు అండీ నేను వెయిట్ చేస్తా.. మీలా ఎవరు నాకు ధైర్యం చెప్పలేదు. అండగా ఉండలేదు. చివరకు మా నాన్న కూడా నాకు సాయం చేయలేదు. కానీ మీరు నేను ఫోన్ చేయగానే వచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలీదు. 
జనార్థన్: నువ్వు దేనికి ఎవరికీ భయపడాల్సిన పని లేదు మధు. మన దగ్గర డబ్బు, పలుకుబడికి ఏ లోటు లేదు. ఎంత దూరం అయినా వెళ్లగలం. 
మహాలక్ష్మి: నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నీ గురించి ఎవరూ ఆలోచించకపోతే నువ్వు ఇక్కడ ఉండొద్దు మాతో పాటు మా ఇంటికి వచ్చెయ్. మా ఇంట్లో ఉండొచ్చు. సూర్య బయటకు వచ్చేంత వరకు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా.
మధు: మీ ఇంటికా వద్దు అండీ..
మహాలక్ష్మి: ఇది పల్లెటూరు మధు. ఇక్కడి మనుషులు ఎలా ఉంటారో నాకంటే నీకే బాగా తెలుసు. సూర్య తప్పు చేశాడా లేదా తెలుసుకోరు. నిందలు వేస్తారు.
మధు: ఎవరో ఎందుకు మా ఇంట్లో వాళ్లే నన్ను అవమానించారు అండీ..
జనార్థన్: మరి ఇక్కడే ఉండటం ఎందుకు అమ్మ ఈ అవమానాలు నీకు అవసరమా.. నువ్వు ఒంటరి దానికి కాదు అమ్మా నీకు మేం ఉన్నాం మాతో వచ్చేయ్..
మహాలక్ష్మి: తొందరేం లేదు మధుమిత. ఆలోచించే నిర్ణయం తీసుకుంటావ్. 
జనార్థన్: సూర్య గురించి మేం చూసుకుంటాం.. నువ్వు మాతో వచ్చేయ్ తల్లి. మధుమిత మనతో వస్తుందా.. 
మహాలక్ష్మి: తప్పకుండా వస్తుంది.


మరోవైపు సీత వస్తుంటుంది. ఇక శివకృష్ణ తల్లి తన కూతురు ఫొటో దగ్గర నిల్చొని ఏడుస్తుంది. మధు జీవితం ఏమైపోతుందా అని బాధపడుతుంది. ఇక తన కూతురు, కోడలు వచ్చి ఓదార్చుతారు. అయితే శివకృష్ణ వచ్చి ఈ సమస్యలకు లేచిపోయి పెళ్లి చేసుకున్న సుమతే కారణం అని అంటాడు. సుమతి లేచిపోయి వెళ్లి పోవడం వల్లే తనకు మనస్శాంతి లేదని అంటాడు. ఇంతలో సీత ఇంటికి వస్తుంది. అందర్ని పిలుస్తుంది. అందరూ బయటకు వస్తారు. 


శివకృష్ణ: నువ్వేంటి సీత సడెన్‌గా వచ్చావు.
సీత: అక్క గురించి నాన్న.. అక్క కోసం మీరు ఏం ఆలోచించారు.
శివకృష్ణ: ఆ విషయం గురించి నేను ఏం చేయలేను అని నీకు ఫోన్‌లోనే చెప్పాను కదా..
సీత: తప్పించుకుంటే ఎలా నాన్న. అక్క పరిస్థితి ఏం కావాలి. అక్క అంత కష్టంలో ఉంటే అమ్మానాన్నలుగా మీరు అక్కకి సాయం చేయాలి కదా.. ఓదార్చాలి కదా.. అక్కకి మనం తప్ప ఇంకెవరున్నారు. మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టే అక్కని కలవడానికి ఆవిడ ఇక్కడికి వచ్చింది. 
సీతతల్లి: ఎవరు వచ్చారు సీత.
సీత: మా అత్తయ్య మహాలక్ష్మి.
శివకృష్ణ: ఆవిడ మధుని కలవడం ఏంటి. ఆవిడకు అవసరం ఏంటి. 
సీత: ఆ విషయాలు తర్వాత నేను ముందు అక్క ఇంటికి వెళ్తాను. అక్కకు మన మీద లేనిపోనివి ఆ మహాలక్ష్మి చెప్తుంది. అక్క మనసు ఆవిడ చెడగొట్టకముందే నేను అక్కని ఇక్కడికి తీసుకొని వస్తాను. సూర్య బావ బయటకు వచ్చేంత వరకు అక్క ఈ ఇంట్లోనే ఉండాలి. మీరు ఎవరూ కాదనకూడదు. 
శివకృష్ణ: ఈ అత్త మధుకి మా గురించి చెడుగా ఎందుకు చెప్తుంది.
సీత: అందుకు వేరే కారణాలు ఉన్నాయి నాన్న. తర్వాత చెప్తా అన్నాను కదా.. 
శివకృష్ణ: నువ్వు మీ అత్త విడివిడిగా ఎందుకు వచ్చారు సీత అసలేం జరుగుతుంది.
సీత: ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా కోసం కాదు. అక్క గురించి. అక్కని మీరు దగ్గరకు తీసుకోకపోతే నేను ఎప్పటికీ ఈ ఇంటికి రాను. 
శివకృష్ణ: పద నేను కూడా నీతోపాటు మధు దగ్గరకు వస్తాను. 
సీత: మీరు ఎవరూ రావొద్దు నేనే తీసుకొస్తా అక్క ఈ ఇంట్లోనే ఉండాలి. 
మహాలక్ష్మి: జలజతో.. మధుమిత ఏం ఆలోచించిందో కనుక్కో.. మధుమితని మాతో రావడానికి ఒప్పించు. 


జలజ మధు దగ్గరకు వెళ్లి మహాలక్ష్మితో సిటీకి వెళ్లమని అంటుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని మధు అంటే.. అనుకున్న వాళ్లు నీకు సాయం చేశారా నీ వాళ్లు చేశారా అని జలజ మధు మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ప్రేమలు: టాలీవుడ్‌ ఎంట్రీపై 'ప్రేమలు' హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ జవాబు