Prema entha maduram Serial Today Episode: బర్తుడే పార్టీ కోసం అను రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో పిల్లల ఇద్దరూ రెడీ అయ్యి అను దగ్గరకు వస్తారు. అమ్మా నువ్వు చాలా సూపర్‌గా రెడీ అయ్యావు అంటూ అభయ్ అనగానే అను నవ్వుతుంది. ఇంతలో అఖి మా డాడీ కూడా ఇంకా బాగా రెడీ అయ్యుంటాడు అనగానే మిమ్మల్ని నేను కష్టపడి రెడీ చేస్తే నువ్వు మీ డాడీకి సపోర్టు చేస్తావా? అంటుంది. ఇంతలో ఆర్య రెడీ అయ్యి రూంలోకి రాగానే ముగ్గురూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అను ఆర్య దగ్గరకు వచ్చి మా దిష్టే తగిలేలా ఉందని ఆర్యకు దిష్టి చుక్క పెడుతుంది. నీకు కూడా దిష్టి తగులుతుందని ఆర్య అనుకు కూడా దిష్టి చుక్క పెడతాడు.
అఖి: చూశావా అన్నయ్యా వాళ్ల కోసం మనం గొడవ పడుతుంటే వాళ్లేమో ఒకర్ని ఒకరు పొగుడుకుంటున్నారు.
అభయ్: ప్రేమ ఎంత మధురం అంటే అదే మరి. అర్థం అయ్యిందా అఖి.
అను: సరే సరే ముందు మీకు ఏం గిఫ్ట్ కావాలో నాన్నను అడగండి.
అఖి: నాన్నా ఏం అడిగినా ఇస్తారా?
అని పిల్లలిద్దరూ అడగ్గానే సరే అడగండి అని అర్య చెప్తాడు. అయితే మా బర్తుడే పార్టీలో మనం మన ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ తప్పా ఇంకెవ్వరూ ఉండకూడదు. ముఖ్యంగా ఆనంది ఉండకూడదు అని అడుగుతారు. ఆర్య సరే అంటాడు. పిల్లలు బయటకు వెళ్తారు. ఆనందిని పంక్షన్‌లో లేకుండా ఎలా చేయాలి అని ఆర్య ఆలోచిస్తుంటాడు. మరోవైపు మాన్షి ఆనందిని అందంగా రెడీ చేస్తుంది. తర్వాత కేక్ కటింగ్‌కు ఆర్య, అను పిల్లలతో కలిసి కిందకు వస్తారు. పిల్లలందరూ అఖి, అభయ్‌లకు బర్తుడే విషెష్ చెప్తుంటారు. ఇంతలో ఆర్య కేశవను ఆనంది కిందకు రాకూడదుని ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. కేశవ, ఆర్య పైకి వెళ్తారు. ఆనంది గదిలో ఉండదు. పార్టీకి వచ్చిన పిల్లలందరూ అఖి, అభయ్ మాస్కులు వేసుకుని తమను గుర్తుపట్టమని అడుగుతారు. ఒక్కొక్కరిని అఖి, అభయ్ గుర్తుపడుతుంటారు. ఇంతలో అఖికి అనుమానం వచ్చి నువ్వెవ్వరు అంటూ మాస్క్ తీయగానే ఆనంది అని చెప్తుంది. ఆనందిని చూసిన అఖి, అభయ్‌లతో పాటు మిగతావాళ్లు షాక్ అవుతారు. నువ్వెవ్వరూ అఖి వాళ్ల నైబర్‌వా? అందుకే గ్రాండ్‌గా రెడీ అయ్యాయా అని అడుగుతారు. దీంతో ఆనంది ఇవాళ తన బర్తుడే అని చెప్తుంది. దీంతో పిల్లలందరూ ఆనందికి విషెష్ చెప్తారు. అభయ్, అఖి బాధగా చూస్తుండిపోతారు.
నీరజ్: పిల్లలు లేట్ అయిపోతుంది. కదా.. రండి రండి..
పిల్లాడు: వెయిట్ అంకుల్ ఇంకో బర్తుడే గర్ల్ కూడా యాడ్ అవ్వాలి కదా?
అంటూ ఆనందిని అఖి, అభయ్‌ల పక్కన నిలబెట్టగానే పిల్లలిద్దరూ డల్‌గా ఉండిపోతారు. నీరజ్ క్యాండిల్స్ వెలిగించి అఖి, అభయ్‌లను క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేయండి అని చెప్పగానే పిల్లలు చూస్తుండిపోతారు. ఇంతలో ఆనంది క్యాండిల్స్ ఊదుతుంది. దీంతో అభయ్ కేక్‌ను తోసేస్తాడు.
ఆర్య: అభయ్ ఏం చేస్తున్నావు తప్పు కదూ..
అభయ్: నాకు ఈ బర్తుడే చేసుకోవడం అసలు ఇష్టం లేదు.
అంటూ పిల్లలిద్దరూ పైకి వెళ్లిపోతారు. వారి వెనకాలే అను, ఆర్య వెళ్తారు.
అను: అఖి, అభయ్ ఏం చేస్తున్నారు మీరు. అలా పార్టీ మధ్యలోంచి వచ్చేయొచ్చా? నాన్నకు ఎంత ఇన్‌సల్ట్ తెలుసా?
అభయ్: నాన్నకు ఇన్‌సల్ట్ అని అంటున్నావు కానీ మాకు ఎంత ఇబ్బంది ఉందో తెలుసా?
అంటూ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఆనంది ఉంటే మాకు ఇష్టం లేదు. పార్టీకి ముందు మిమ్మల్ని ఏం గిఫ్ట్ అడిగాము ఆనంది పార్టీలో ఉండకూడదని అడిగాము అంటూ ఏడుస్తుంటారు. మీరింతకముందు ఇలా ఉండేవారు కాదు ఇప్పుడెందుకు ఇంత జెలసీ.. అని అను అడగ్గానే ఎందుకంటే అప్పుడు నాన్న మా దగ్గర లేడు. ఇప్పుడు నాన్న ప్రేమ తెలిశాక నాన్న ప్రేమంతా మాకే కావాలనిపిస్తుంది. అంటూ ఏడుస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న 'గుంటూరు కారం' బ్యూటీ - ఈసారి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్!