Brahmamudi Telugu Serial Today Episode: రాజ్ లగేజ్ తీసుకొస్తుంటే.. అదేంటి మా మేనల్లుడి బ్యాగ్ మీరు తీసుకొస్తున్నారు అని కనకం అడుగుతుంది. అదేంటీ నేను వస్తున్నట్లు వీళ్లకు ఇన్ఫర్మేషనే లేదా అని రాజ్ అనుకుంటాడు. అయ్యో అమ్మా ఆయన మన ఇంట్లోనే ఉండేందుకు వస్తున్నారు అని కావ్య చెబుతుంది. అల్లుడు గారు మా ఇంట్లో ఉంటాననడం మా అదృష్టం అని మూర్తి అంటాడు. తర్వాత అంతా కలిసి లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు ఆఫీస్ స్టాక్ గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, దానికి ఇన్సూరెన్స్ చేయించలేదని, 50 లక్షలు నష్టం వచ్చిందని సుభాష్‌కు మేనెజర్ కాల్ చేసి చెబుతాడు. ఎందుకు ఇన్సూరెన్స్ చేయించలేదని కోపంగా అరుస్తాడు. మీ తమ్ముడు చూసుకుంటానని చెప్పారు అని మేనేజర్ చెప్పగానే కాల్‌ కట్‌ చేసి అపర్ణతో ప్రకాశం ఎక్కడ అని సుభాష్ అరుస్తుంటే.. మెట్లు దిగుతూ వస్తాడు ప్రకాశం.


ప్రకాష్‌: ఏమైంది అన్నయ్య అరుస్తున్నావ్. వదినా ఏమైనా తప్పు చేసిందా?


సుభాష్‌: తప్పు చేసింది వదినా కాదు. నువ్వు. గోడౌన్‌లోకి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమన్నాను కదా. ఎందుకు చేయించలేదు. దాని వల్ల 50 లక్షలు నష్టం వచ్చింది.


ప్రకాష్‌: అయ్యో మర్చిపోయాను అన్నయ్య. ప్రతిసారి మర్చిపోకూడదు అనుకుంటాను. కానీ, మర్చిపోతున్నాను..


సుభాష్:  ఇలా ఎన్నిసార్లురా.. లాస్ట్ ఇయర్ ఇలాగే చేశావ్. మర్చిపోయాను అని తప్పించుకోకు. నీకు మేనెజర్స్‌ ని పెట్టింది ఇవి గుర్తు చేసేందుకే కదా. ఇలా చేస్తే మేము బయటకు వెళ్లినప్పుడు నీకు ఆఫీస్ ఎలా అప్పజెప్పగలను. నిన్ను నమ్మి నీకు ఆఫీస్‌ను ఒక్కరోజైనా ఎలా ఇవ్వగలను.


ధాన్యలక్ష్మీ:  ఆపండి బావగారు. ఆయన మీతోపాటే ఆఫీస్ చూసుకుంటారు. ఆయనేదే మీ బానిసలా తిడుతున్నారు. ఆయనేమైనా చిన్నపిల్లాడా అలా తిడుతున్నారు. ఆయనకు పెళ్లి అయి పిల్లలకు కూడా పెళ్లి అయింది.


సుభాష్‌: అది కాదు ధాన్యలక్ష్మీ


ధాన్యలక్ష్మీ: ఏం చెబుతారు బావగారు. నోటికి వచ్చినట్లు అంటూనే ఉన్నారు.


అపర్ణ: ధాన్యం వారి మధ్యలోకి నేనే వెళ్లను నువ్ ఎందుకు వెళ్తున్నావ్.


ధాన్యం: ఆయన మహారాజులా తిడుతుంటే నువ్ మహారాణిలా చూస్తున్నావ్. నువ్ ఎందుకు వెళ్తావ్


అని ధాన్యలక్ష్మీ  అపర్ణను అనగానే సారీ అమ్మా నన్ను క్షమించు. అన్నయ్యగా నా తమ్ముడిని అంటున్నాను కానీ, మా మధ్య ఇన్ని ఉంటాయని అనుకోలేదు. రెండు చేతులతో దండం పెట్టి వెళ్లిపోతాడు సుభాష్. ప్రకాశం కోపంగా ధాన్యలక్ష్మీని లోపలికి తీసుకెళ్తాడు. నీకు పిచ్చి పట్టిందా. అన్నయ్యతో ఎందుకు అలా ప్రవర్తించావ్ అని అరుస్తాడు. ఇంకోసారి నాకు మా అన్నయ్యకు మధ్యలో నువ్ రాకు అని కోపంగా చెప్పి ప్రకాశం వెళ్లిపోతాడు. మరోవైపు మూర్తి ఇంట్లో అరిటాకుపై అన్ని రకాల వంటకాలు చేసి పెడతారు. ఇవాళ సూపర్‌గా లాగించేయాలని అని రాజ్ అనుకుంటాడు. అయితే, ఆ అరిటాకుపై భాస్కర్‍కు వడ్డిస్తారు.


అప్పు: పోయినసారి ఇలా అరిటాకుపై వడ్డిస్తే మీరు కోప్పడ్డారు కదా! అందుకే మీకు వడ్డించలేదు.


రాజ్‌: మీ మేనల్లుడికి పెళ్లి చేసి అమెరికా పంపించేయొచ్చు కదా?  నన్ను చూడమంటే ఓ మంచి అమ్మాయిని చూసి పెడతాను. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు.


భాస్కర్‌: కావ్య లాంటి అమ్మాయి కావాలి నాకు 


అప్పు: అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు. కావ్యను చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నాడు. మా బావ మా అక్కను వద్దనుకుని రెండో పెళ్లి చేసుకుంటే తప్పా నీకు ఆ ఛాన్స్ లేదు. అయినా దేవతలాంటి మా అక్కను మా బావ ఎందుకు వదులుకుంటాడు. ఏం బావ


దీంతో రాజ్‌ అప్పును మనసులో తిట్టుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ మాటలు గుర్తు చేసుకుని సుభాష్‌ బాధపడతుంటాడు. ఇంతలో ప్రకాశం వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. నాకు మతిమరుపు ఉందన్నయ్యా. సైట్ లేదు. నువ్ బాధపడుతుంటే ఆ మాత్రం చూడలేనా అని ప్రకాశం అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ఫ్రెండ్ ఇంటికే కన్నం, చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నటి సౌమ్య శెట్టి అరెస్ట్