Krishna Mukunda Murari Today Episcope:  కృష్ణ డల్‌గా ఉండడంతో ఏమైందని రేవతి అడిగితే మురారి తనను కొట్టాడని కృష్ణ చెప్తుంది. నేను ఎందుకు నిన్ను కొడతాను మందు తాగినట్లు మాట్లాడకు అని మురారి అంటే నేను కాదు మీరే మందు తాగి నన్ను కొట్టారు అని కృష్ణ అంటుంది. దీంతో మురారితో పాటు రేవతి, మధు షాక్ అవుతారు.


మధు: అయినా పట్టపగలు మందు కొట్టే ధైర్యం నీకు ఎక్కడు ఉంది మురారి.
కృష్ణ: అంటే మందు కొట్టలేదు. మందు కొట్టినోడు పెళ్లాన్ని ఎలా కొడతాడో ఆ రేంజ్‌లో కొట్టాడు అని చెప్పాను.
మురారి: ఏయ్ తింగరి అయిపోయావే.. అమ్మా దాని మాటలు నమ్మొద్దు.. నేను ఎందుకు కొడతాను. ఏయ్ ఆగు.. 
రేవతి: రేయ్ మధు ఏమైందిరా వీళ్లకి నీకు ఏమైనా అర్థమైందా..
మధు: నాకు ఏం అర్థం కాలేదు పెద్దమ్మ కానీ మురారి మాత్రం కృష్ణని కొట్టే ఛాన్సే లేదు. ఎందుకు అంటే శోభనం రోజు పెళ్లంతో గొడవ పడే పిచ్చోడు అయితే కాదు. నాకు ఎందుకో ఈ శోభనం కూడా..
రేవతి: రేయ్.. తేడాగా మాట్లాడావు అంటే నీ పని అవుతుంది. వాళ్లకేమైందిరా అన్యోన్యంగానే ఉంటారు కదా..
మధు: నువ్వు ఎన్నయినా చెప్పు పెద్దమ్మ నాకు మాత్రం ఏదో డౌట్ కొడుతుంది.
మురారి: ఏంటే తింగరి నువ్వు అందరి ముందు నేను కొట్టాను అని చెప్పావు.
కృష్ణ: అదా అత్తయ్య వాళ్లని డైవర్ట్ చేద్దామని చెప్పాను అయినా అదా మ్యాటర్ ఇప్పుడు.
మురారి: దానివల్లే కదా కింద డిస్కషన్ అయింది. ఎందుకు అలా చెప్పావ్..
కృష్ణ: ఇంటికి రాగానే అత్తయ్య అలా అడిగారు ముకుంద ఇలా చేసింది అని చెప్పాను. 
మురారి: సరే అసలు విషయంలోకి వద్దాం.. ఏం చేద్దాం ఏమైనా ఐడియా వచ్చిందా.. 
కృష్ణ: నాకు ఇంకా ఆ వెయిటరే గుర్తొస్తున్నాడు. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు పెళ్లి వద్దు అని వెళ్లిపోయినా తట్టుకోగలరేమో కానీ. శోభనం గదిలో నుంచి వెళ్లిపోతే తట్టుకోలేరు అండీ..
మురారి: అదే నా భయం కూడా.. ముందు మన శోభనం ఆపడానికి ట్రై చేస్తుంది అని మనం కదురనివ్వం. అలా అని ఆదర్శ్‌తో కలిసి పాలు పంచుకోదు కదా.. శోభనం గదిలో ఆదర్శ్‌ ముఖం మీద నువ్వు ఇష్టం లేదు ఇంకా మురారినే ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. 
కృష్ణ: ఒకసారి ముకుందతో నేను మాట్లాడుతా.. నిలదీస్తా.. 
మురారి: నీకు తెలుసు అని తనుకి తెలీకూడదు అన్నావు కదా.. ఇప్పటి వరకు తన మీద నింద పడకూడదు అని నాతో చేయించాలి అని అనుకుంటుంది. ఇప్పుడు నీకు తెలుసు అని తెలిస్తే తెగించేస్తుంది. తను మారదు ఆదర్శ్‌కి చెప్పేస్తుంది. 
కృష్ణ: అసలు ఆదర్శ్‌కి ఏం తెలీకూడదు.
మురారి: అయితే ఈ శోభనం జరగకూడదు. ఆదర్శ్‌తో మాట్లాడుతా.. ముందు శోభనం వాయిదా వేసి తర్వాత నిదానంగా తనకోసమే చేశాం అని నచ్చచెప్దాం. తర్వాత ఎలాఒకలా ముకుందకు చెప్దాం.


ముకుంద: అద్దంలో తనని తాను చూసుకుంటూ.. ఏంటి అలా చూస్తున్నావ్ ఈరోజు నీ శోభనం అంట. ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వేమో డల్‌గా ఉన్నావు. కానీ ఇదే శోభనం మురారితో అయింటే ఇలా ఉండే దానివా.. అప్సరసలా అందంగా తయారై మెరిసిపోయేదానివి. ఏం పాపం చేసుకున్నావో. చూడు ఈ ఖర్మ పట్టింది నీకు.. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ముందు శోభనం ఎలా ఆపాలో చూడు. మురారి, కృష్ణల శోభనం జరగకూడదు. ఏదో ఒకటి చేసి శోభనం ఆపేయాలి. ఎంత పని చేశావ్ మురారి అంతా నీ వల్లే.. 
మురారి: ఆదర్శ్‌ ఫోన్‌లో సంతోషంగా మాట్లాకుంటూ ఉంటే.. సారీ ఆదర్శ్‌ నీ ఉత్సాహం మీద నీళ్లు పోయడానికి వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది వింటే బాధ పడతావ్. కానీ తప్పుదు ముకుంద నీకు చెప్పి నీ మనసు విరిగిపోయే కంటే ఇప్పుడు బాధపడటమే బెటర్.
ఆదర్శ్‌: ఫ్రెండ్స్‌రా నేను ఏదో నా శోభనం అని చెప్తే ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి నాతో ఆడుకుంటున్నారు. ఇంతకీ నీ విషయం ఏంటి హ్యాపీయే కదా..
మురారి: నీతో ఒక విషయం మాట్లాడాలిరా.. అది.. అది.. 
ఆదర్శ్: ఎందుకురా అంత కంగారు పడుతున్నావ్.. కొంపతీసి నా కాలు నొప్పిగా ఉంది అని శోభనం ఆపేద్దాం అంటావా ఏంటి. జోక్ చేశానురా.. అయినా నా శోభనాన్ని నువ్వు ఆపలేవు. ఎందుకు అంటే నాది ఆపితే నీది ఆపాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఆ టెన్షన్‌ లేదు. కానీ ముకుంద బాధ పడుతుందిరా.. మొన్న శోభనం ఆగిపోయినందుకు ఎంత బాధపడిందో తెలుసుకదా..
మురారి: మనసులో.. అదంతా నాటకంరా.. అసలు ఈ శోభనం వద్దు అని నీకు ఎలా చెప్పాలిరా.. అది ముకుంద గురించి నీతో మాట్లాడాలిరా.. మన జీవితంలో ఎన్నో జరగాలి అని అనుకుంటాం. కొన్ని జరగవు. ఎదురు చూడాలి. 
ఆదర్శ్‌: అవును రా ఎదురు చూపులు ఫలిస్తాయి. ముకుంద నాకు దక్కినట్లుగా..నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు నా తమ్ముడు, ఫ్రెండ్‌నే కాదురా నా తండ్రిలా కూడా ఆలోచిస్తావ్ థ్యాంక్స్‌రా అని హగ్ చేసుకుంటాడు. ముకుంద గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నావో ఇప్పుడు నేను చెప్పనా.. గతంలో జరిగింది మనసులో పెట్టుకొని ముకుందని నేను ఎక్కడ దూరం పెడతానో అని బాగా చూసుకోమని చెప్పడానికి వచ్చావ్ అంతే కదా.. ఒక మనిషికి పునర్జన్మ ఉంటుందో లేదో తెలీదు కానీ నీ వల్లే ఈ జన్మలో నాకు పునర్జన్మ దక్కిందిరా.. ముకుందకి నేను అంటే ఇష్టం లేదు అని తెలిసి ఈ బతుకే వేస్ట్ అని ఎక్కడో జీవచ్ఛవంలా బతుకుతుంటే నా కోసం ముకుంద వెయిట్ చేస్తుంది అని చెప్పి నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు ముకుందని బాగా చూసుకో అని నాకు చెప్పాలా. రేయ్ తను నా ప్రాణంరా ప్రాణం కంటే ఎక్కువగా నేను చూసుకుంటాను.. 
ముకుంద: అంతా చాటుగా విని.. మురారికి శోభనం ఆపమని చెప్తే ఆదర్శ్‌ని రెచ్చగొడతాడా.. ఇదే ఉత్సాహంతో వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటే నేను చెప్పాలి అనుకున్నది చెప్పలేను తప్పించుకోలేను. కాబట్టి ప్రాబ్లమ్ గది వరకు రాకూడదు. ఇక్కడే ఆగిపోవాలి. 
మురారి: ఇప్పుడేం మాట్లాడకూడదు. తర్వాత చెప్తా.. ఏం లేదు అని మురారి వెళ్లిపోతాడు.


కృష్ణ దగ్గరకు సుమలత వస్తుంది ఇంకా రెడీ అవ్వలేదు ఏమని అడుగుతుంది. దీంతో కృష్ణ భయంగా ఉంది అని తప్పించుకుంటుంది. సుమలత కృష్ణకి నచ్చచెప్తుంది. ఇక రెడీ అవుతాను అని కృష్ణ వెళ్తుంది. మరోవైపు శోభనం ఎలా ఆపాలో తెలీడం లేదు అని మురారి టెన్షన్ పడుతుంటాడు. మురారి దగ్గరకు కృష్ణ వచ్చి ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది. జరిగిందంతా మురారి కృష్ణకు చెప్తాడు. దీంతో కృష్ణ షాక్ అయి బెడ్ మీద పడుకుండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  వరలక్ష్మి : కాబోయే భర్తను ముద్దులతో ముంచెత్తిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. వీడియో చూశారా?