Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తల్లిదండ్రులు ఇద్దరూ విహారి ఆఫీస్‌కి బయల్దేరుతారు. ఇక అంబిక, సుభాష్‌లు మాట్లాడుకుంటారు. ప్రజెంటేషన్ కోసం వచ్చిన వాళ్లని కాన్ఫెరెస్స్ రూపం కూర్చొమని చెప్తుంది. ఇక సుభాష్‌ తన మెడ మీద ఏదో ఉందని చెప్పి అంబికని పిలిచి తాను చూసే టైంకి ముద్దు పెట్టుకుంటాడు. అంబిక ఆఫీస్‌లో అలాంటివి చేయొద్దని అంటుంది. మరోవైపు విహారి ఆఫీస్‌కి వచ్చేస్తాడు.  


సుభాష్: అంబిక ఈ ప్రాజెక్ట్ మనకు వస్తే భారీ ఎత్తున కమీషన్ వస్తుంది కదా. 
అంబిక: అందుకే కదా మనం వాళ్లకి ప్రాజెక్ట్ ఇస్తున్నాం.
సుభాష్: ఈ విషయం విహారికి తెలిస్తే.
అంబిక: తెలీకుండా మనం మ్యానేజ్ చేయాలి అదే కదా మన ట్యాలెంట్.  ఇంతలో విహారి వస్తే కంపెనీ డెలికేట్స్ వచ్చారని మాట్లాడమని అంటుంది. 


విహారి సరే అని ఫోన్ మాట్లాడుతూ వెళ్లాడు. మరోవైపు కనకం భోజనం తీసుకొని వస్తుంది. లంచ్ తీసుకొని అంబిక క్యాబిన్‌ని వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని అంబిక అడిగితే పండు వేరే పని మీద వెళ్లి నాకు ఇచ్చాడని చెప్తుంది. దాంతో అంబిక ఫుడ్ తీసుకొని క్యాంటీన్‌కి వెళ్లమని అంటుంది. భోజనాలు బాగోలేకపోతే అప్పుడు నీ సంగతి చెప్తా అని అంటుంది. కనకం క్యాంటీన్ ఎక్కడని అడిగి క్యాంటీన్‌కు వెళ్తుంది.


అంబిక ప్రాజెక్ట్ డెలికేట్స్‌తో మాట్లాడుతుంది. డెలికేట్స్ అంబికను పొగిడేస్తారు. విహారి ఉండటం వల్ల భయంగా ఉందని అంటారు. దానికి అంబిక మీరు అంబికను నమ్ముకుండి మీకు మంచే జరుగుతుందని అంటుంది. కనకం లంచ్ తీసుకొని క్యాంటీన్‌కు వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్లగానే రామ్ అనే ఆఫీస్ బాయ్ లక్ష్మీతో మాట్లాడుతాడు. పండు ముందే అన్నీ చెప్పేశాడని అంటాడు. బాక్స్ వాసనలకు కనకాన్ని పొగిడేస్తాడు. ఇక కనకం తెచ్చిన సూప్ విహారికి చాలా ఇష్టమని అంటాడు. సార్ అంటే ఎవరని లక్ష్మీ అడుగుతుంది. తనకు గుర్తు లేదని రామ్ అంటాడు. ఇక సూప్ తీసుకెళ్లి సార్కి ఇవ్వమని రామ్ లక్ష్మీతో చెప్తాడు. లక్ష్మీకి అడ్రస్ చెప్పి వెళ్లమని అంటాడు. లక్ష్మీ సూప్ తీసుకొని విహారి దగ్గరకు వెళ్తుంది. సార్ అంటే ఎవరో అనుకుంటుంది లక్ష్మీ. రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొడుతుంది. విహారి రమ్మని చెప్తాడు. ఇంతలో విహారి ఫోన్ రావడంతో మాట్లాడుతాడు. కనకం సార్ సూప్ ఇక్కడ పెడుతున్నానని చెప్పి వెళ్లిపోతుంది. 


విహారి కనకం గురించి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు. కనకాన్ని తన ఫ్యామిలీకి చేర్చడమే తన మొదటి లక్ష్యమని విహారి అంటాడు. ఇక విహారి సూప్ చాలా బాగుందని రామ్‌తో చెప్తాడు. రామ్ ఆ విషయం కనకానికి చెప్తాడు. తనకు సార్ ఓ పని చెప్పారని నేను బయటకు వెళ్తున్నానని సార్ వస్తే వడ్డించమని అంటాడు. ఇక విహారి అంబిక దగ్గర మీటింగ్‌కు వెళ్తాడు. ఫైల్స్ చెక్ చేయమని విహారికి అంబిక ఇస్తే అత్త నువ్వే మొత్తం చూసుకో నువ్వే నీ నిర్ణయం తీసుకో అని చెప్తాడు. ఇక అంబిక వాళ్లకి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్తుంది.


ప్రజెంటేషన్ విన్న విహారికి వాళ్లు ఇప్పటికి వరకు ఎన్ని ప్రాజెక్ట్‌లు చేశారు అని అనుభవం ఏంటి అని అడుగుతాడు. ఇక ఫైల్ తీసుకొని చెక్ చేస్తాడు. వాళ్లకి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు చూద్దామని అంబిక అంటే మనం వాళ్లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వొద్దని అంటాడు. మీరు వీళ్లని సెలక్ట్ చేశారని అంటే నాకు షాక్‌గా ఉందని అంటాడు. కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీరు ఇలాంటి బ్లండర్ మిస్టేక్ ఎలా చేస్తారని అడుగుతాడు. దాంతో అంబిక తాను దొరకకూడదని సుభాష్ మీద ఫైర్ అయి రివర్స్ అయిపోతుంది. నీ వల్ల నేను విహారి ముందు తలదించుకునేలా చేశావ్ అని అంటుంది. ఇక విహారి ఆ ప్రాజెక్ట్ వీళ్లకి ఇవ్వొద్దని వాళ్లని పంపమని అంటాడు. అంబిక లెక్క మొదటి సారి తప్పిపోయిందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గజగండ గొంతు పట్టి నలిపేసిన నయని, గాయత్రీదేవి.. ఢీల్‌కొచ్చి డీలా పడిన మాంత్రికుడు!