Prema Entha Madhuram Serial Today Episode: శంకర్ చూసిన రాకేష్ పరుగెత్తుకొచ్చి పాండుతో అతను ఆర్యవర్థన్ అని చెప్తాడు. దీంతో అతను శంకర్ నాలుగు సంవత్సరాలుగా నా ఇంట్లో రెంట్‌కు ఉంటున్నాడు. ఆయన్ని పట్టుకుని ఆర్యవర్ధన్ అంటావేంటి పార్టనర్ అంటాడు పాండు కాదు వాడు శంకర్ కాదు. ఆర్యవర్థన్. గౌరి కాదు అను. మిసెస్ అను ఆర్యవర్థన్ అంటూ ఆర్యవర్థన్ గురించి చెప్తాడు రాకేష్. దీంతో కోట్లకు అధిపతి అయిన ఆర్యవర్థన్ మళ్లీ పుట్టి నా ఇంట్లో రెంట్‌కు ఉన్నాడన్నమాట. అని పాండు అంటాడు. వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటారన్న మాట అంటాడు పాండు.
రాకేష్: అది మాత్రం జరగనివ్వను. వాళ్లిద్దర్ని ఎప్పటికీ ఒక్కటి కానివ్వను. నా తండ్రి వాళ్ల పతనం కోసం ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ పగ నాది. ఆ కుటుంబం నాశనం కావాలంటే వాళ్లెప్పటికీ కలవకూడదు.
పాండు: అలాగా.. అదేదో మీరు మీరు చూసుకోండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ కానివ్వకండి. గుడ్ బై.
అని పాండు వెళ్లిపోతుంటే రాకేష్ కోపంగా ఈ నిజాన్ని ఎవరికైనా చెప్పావంటే వాళ్ల కంటే ముందు నిన్ను చంపేస్తా.. అంటూ వార్నింగ్ ఇస్తాడు రాకేష్. మరోవైపు అకి గౌరి వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుడే గౌరిని తీసుకుని శంకర్, యాదగిరి వస్తారు. ఎక్కడికి వెళ్లారు అని అకి అడగ్గానే గౌరి గారు ఇప్పుడే ఒక సాహస యాత్ర ముగించుకుని వచ్చారు అని వెటకారంగా చెప్తాడు. యాదగిరి జరిగింది చెప్తాడు. ఇంతలో జెండే వస్తాడు.
జెండే: అమ్మా అకి నువ్వు ఓకేనా..?
అకి: ఫ్రెండ్ జరిగిన విషయం మీకు తెలుసా?
జెండే: యాదగిరి ఫోన్ చేసి చెప్తే నేను హడావిడిగా వచ్చాను అకి.
శంకర్: చూశారా? గౌరి గారు మీరు చేసిన తెలివి తక్కువ పనికి ఎంత మంది బాధపడుతున్నారో
అనగానే జెండే, శంకర్ ను మెచ్చుకుంటాడు. అలాగే గౌరిని జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత శంకర్, గౌరి లోపలికి వెళ్తారు. యాదగిరిని పక్కకు తీసుకెళ్లిన జెండే అక్కడ ఏం జరిగిందో పిన్ టూ పిన్ మొత్తం చెప్పు అని అని అడగ్గానే యాదగిరి జరిగింది మొత్తం చెప్తాడు. వాడు ఆవేశంలో తాను జలంధర్ కొడుకుని అని చెప్పాడు అని ఒక్కసారి వాడితో ఆర్య సార్ లా మాట్లాడాడు. తర్వాత శంకర్ లా మారిపోయాడు అంటాడు. ఇంతలో అకి వచ్చి ఆ జలంధర్ కొడుకు ఎవడో తెలుసుకోవాలి అంటుంది.
జెండే: నువ్వు వాణ్ని దగ్గరగా చూశావుగా యాదగిరి ఏమైనా ఆనవాలు చెప్పగలవా?
యాదగిరి: వాడి కళ్లు అతి దగ్గరగా చూశాను సార్ కాస్త దగ్గరదగ్గరగా మన అభయ్ ఫ్రెండ్ రాకేష్ లా ఉన్నాడు. సార్.
అకి: రాకేష్ లా ఉన్నాడా? అతనిలా ఉన్నాడా? లేక అతనే జలంధర్ కొడుకా..?
జెండే: నువ్వనేది రైట్ అకి. రాకేష్ జలంధర్ కొడుకు అయ్యే అవకాశం కూడా ఉంది.
అని చెప్పి రాకేష్ గురించి లోతుగా తెలుసుకోవాలి. వాడే జలంధర్ కొడుకు అని చిన్న క్లూ తెలిసినా అభయ్ చేతనే వాణ్ని బయటకు పంపించొచ్చు పోలీస్ కేసు పెట్టి జైల్లో వేయించోచ్చు అంటూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అని తన ప్లాన్ చెప్తాడు జెండే. వీలైనంత త్వరగా ఆ జలంధర్ కొడుకు ఎక్కడున్నా పట్టుకోవాలి అని జెండే చెప్తుంటే అప్పుడే టీ తీసుకుని వచ్చిన శంకర్ కు తన గత జన్మ గుర్తుకు వస్తుంది. జలంధరా ఈ పేరేదో నాకు బాగా తెలిసినట్టుందే.. ఈ పేరుతో ముడిపడిన ఏదో ముఖ్యమైన విషయం ఉన్నట్టుందో.. ఆ పేరు వింటుంటే నాకు ఏదో ఆవేశం పొంగుకొస్తుంది అంటుంటాడు. జెండే దగ్గరకు వచ్చి ఆర్య, అంటూ మళ్లీ శంకర్ అని పిలుస్తాడు. దీంతో ఎవడు సార్ వాడు ఇతకు ముందు కూడా వాడు ఆదే పేరు అన్నాడు అనగానే అది సరే కానీ ముందు వాణ్ని పట్టుకుందామంటాడు జెండే. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వను బ్లాక్ మెయిల్ చేసిన భూమి - ఇందును తిట్టిన చెర్రి