Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారిని లక్ష్మీ మెడలో తాళి తెంచొద్దని స్వామీజీ చెప్తారు. విహారి ఎంత చెప్పినా స్వామీజీ వినరు. ఒక సారి ఆడదాని మెడలో తాళిపైనే భర్త ఆయుష్షు ఆధారపడి ఉంటుందని చెప్తారు. నువ్వు ఆమె మెడలో తాళి తీస్తే నీ ఆయుష్షు ఓ ప్రశ్నార్థంలా మారిపోతుందని చెప్తారు. దాంతో లక్ష్మీ ఏం చెప్తున్నారు స్వామి అలా జరగడానికి వీళ్లేదు అని లక్ష్మీ అంటుంది. విహారి షాక్ అయిపోతాడు. సత్య విహారితో ఏం ఆలోచిస్తున్నావ్‌రా అని అంటే నాకు ఏం అర్థం కావడం లేదని విహారి అంటాడు.
లక్ష్మీ జీవితం మంచిగా మార్చాలని అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటాడు. ఇక అక్కడున్న మరో పంతులు ఇంకెప్పుడు ఇలా చేయొద్దని దైవ నిర్ణయాన్ని గౌరవించమని చెప్పి విహారి చేతిలో అక్షింతలు పెట్టి లక్ష్మీకి ఆశీర్వదించమని అంటారు. సత్య విహారితో ఈ సమస్యకు మరేమైనా పరిష్కారం చూద్దామని అంటాడు. ఇక లక్ష్మీ విహారి కాళ్లకు దండం పెడితే విహారి షాక్ లోనే అక్షింతలు వేస్తాడు. లక్ష్మీ తాళికి దండం పెట్టుకుంటాడు. ఇక అంబిక గుడి మొత్తం తిరిగి విహరి లేడనుకుంటుంది. విహారి వాళ్లు ఉన్న వైపే వస్తుంది. విహారి అంబికను చూసి షాక్ అయిపోతాడు. తనని లక్ష్మీని చూసిందంటే ఇక అంతే సంగతి అని అనుకొని చాలా కంగారు పడతాడు. లక్ష్మీ కూడా అంబికని చూసి షాక్ అయిపోతుంది. కనకాన్నీ తీసుకొని వెళ్లిపోమని విహారి సత్యకు చెప్తాడు. తర్వాత పంతులుకి డబ్బులు ఇచ్చి విహారి వెళ్తుండగా అంబిక చూసేస్తుంది. విహారి వెంట పడేసరికి విహారి పారిపోతాడు.
ఇక లక్ష్మీ బయట ఉంటే కొంత మంది ఆడవాళ్లు లక్ష్మీతో నీ మాంగల్యానికి చాలా బంలం ఉందని ఎన్ని జన్మలు ఎత్తినా విడిపోరు అని అంటారు. ఇక సత్య, లక్ష్మీ బయల్దేరిపోతారు. విహారిని అంబిక చూసేసి పిలుస్తుంది. నీకు ఈ మధ్య భక్తి ఎక్కువైందని ఇంత దూరం ఎందుకు వచ్చావ్ అంటే లక్ష్మీని క్యాబ్ ఎక్కించి వచ్చిన సత్యని చూపించి వెంచర్ చూడటానికి వచ్చాం అని అంటాడు. విహారి కవర్ చేసి వెళ్లబోతే పంతులు విహారిని పిలుస్తాడు. విహారి చాలా టెన్షన్ పడి పంతులు దగ్గరకు పరుగులు తీస్తాడు. అంబిక అనుమానంగా చూస్తుంది. ఆమె మెడలోని తాళే నీకు శ్రీరామ రక్ష అని ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు అని అంటారు. లక్ష్మీ వాళ్లు వెళ్తున్న క్యాబ్ దారిలో ఆగిపోతుంది. డ్రైవర్ చూడటానికి దిగుతాడు. ఇంతలో లక్ష్మీ అక్కడ తనకు విహారికి పెళ్లి చేసిన విహారి ఫ్రెండ్ ప్రకాశ్‌ని చూస్తుంది. షాక్ అయిపోయిన లక్ష్మీ కోపంతో ప్రకాశ్ దగ్గరకు వెళ్తుంది. ప్రకాశ్ లక్ష్మీని చూసి షాక్ అయిపోతాడు. ప్రకాశ్ కాలర్ పట్టుకొని కొడుతుంది. ఫ్రెండ్ అయిన విహారిని మోసం చేసి నా జీవితం ఎందుకు నాశనం చేశావని నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.