Satyabhama Serial Today Episode సత్యతో రేణుక తన భర్త, మామయ్యలు కలిసి ఓల్డేజ్ హోం వృద్ధులను చంపాలని అనుకుంటున్నారని కాపాడు అని చెప్తుంది. సత్య షాక్ అయిపోతుంది. క్రిష్‌తో విషయం చెప్పకుండా బయటకు తీసుకెళ్తుంది. వృద్ధాశ్రమానికి తీసుకెళ్లమని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటుంది. రేణుక దగ్గరకు రుద్ర వచ్చి కూర్చొని అక్కడి నుంచి సత్యకి కాల్ చేస్తాడు.


రుద్ర: హలో సత్య రుద్ర ప్రతాప్‌ని మాట్లాడుతున్నా. రేణుక చెప్పిందా వృద్ధులను కాపాడుకోమని రేణుక చెప్పిందా. తను అంటే అక్కడా ఇక్కడా విని విషయాలు చెప్పి కాపాడాలి అనుకొని తాను ప్రమాదంలో పడుతుంది. సంబంధం లేని వృద్ధులను కాపాడుకోవాలి అనుకున్నావ్ సరే మరి మీ నాన్నని ఎవరు కాపాడుతారు. పాపం ఆయన్ను కూడా ప్రమాదం క్రియేట్ చేశా. ఏ సంబంధం లేని వాళ్లని కాపాడుకుంటావా. జన్మనిచ్చిన తండ్రిని కాపాడుకుంటావా నువ్వే నిర్ణయించుకో.
సత్య: కారాపు కారు ఆపు.
క్రిష్: ఏమైంది సత్య ఎందుకు అంత కంగారు పడుతున్నావ్.
సత్య: అవతల మా నాన్న ప్రమాదంలో ఉన్నారు. వెళ్లాలి క్రిష్‌.
క్రిష్‌: మరి వృద్ధులు సంగతి ఏంటి వాళ్లకి ప్రమాదం అన్నావు.
సత్య: అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నావ్ నాన్న ఎక్కడ ఉన్నారు. అని విషయం చెప్తుంది. హర్ష షాక్ అయిపోతాడు. 


హర్ష తండ్రి సంగతి చూసుకుంటా అంటాడు. సత్య వాళ్లు వృద్ధాశ్రమానికి తీసుకెళ్తుంది. ఇంతలో అక్కడ రౌడీలు సత్యకి సపోర్ట్ చేస్తారా అని వృద్ధులను బయటకు నెట్టేస్తారు. సామాను చల్లేస్తారు. ఇక విశ్వనాథం బైక్‌పై బయట నుంచి వస్తుంటే రుద్ర విశ్వాన్ని చావు దెబ్బలు కొట్టమని అంటాడు. భయంతో చావాలని చెప్తాడు. దాంతో రౌడీలు విశ్వనాథాన్ని ఫాలో అవుతారు. ఇక ఆటోలో పాలో అవుతున్న హర్ష విశ్వనాథాన్ని చూసి బైక్ ఆపి బైక్ ఎక్కించుకుంటాడు. ఏమైందని విశ్వనాథం అడిగితే సత్యకి సపోర్ట్ చేస్తామని చెప్పాం కదా యుద్ధం మొదలైంది అని చెప్తాడు. రౌడీల నుంచి తండ్రిని కాపాడి సత్యకి కాల్ చేసి నాన్న నా దగ్గరే ఉన్నారని కంగారు లేదని చెప్తాడు. సత్య వాళ్లు వృద్ధాశ్రామానికి వచ్చే సరికి పెద్దావిడను రౌడీలు తోసేస్తారు. ఆమె కింద పడిపోతుంది. సత్య నీరు తాగిస్తుంది.


క్రిష్, సత్య ఇద్దరూ రౌడీలను ఆపినా వాళ్లు ఆగరు. క్రిష్‌వాళ్లతో గొడవ పడతాడు. వాళ్లంతా సత్యకే సపోర్ట్ చేస్తాఅని అరుస్తారు. దాంతో రౌడీ ఆమెను పొడిచేస్తాడు. సత్య చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక ఆవిడ మిగతా వృద్ధులను చూపించి దిక్కులేని వాళ్లమ్మా నీ వైపు నిలబడ్డారు. వాళ్లకి నువ్వే సాయం  చేయాలి.. సొంతం వాళ్లని ఎదురించి మాకు సపోర్ట్ చేస్తున్నాడు నువ్వే ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి ఆవిడ చనిపోతుంది. సత్య క్రిష్ అందరూ ఏడుస్తారు. ఇక మిగతా వాళ్లు మేం చనిపోయినా పర్లేదు మీ వైపే నిలబడతాం అని అంటే సత్య వద్దు అని నా వైపు ఎవరూ నిలబడొద్దు అని ఏడుస్తుంది. నా వల్లే ఆవిడ చనిపోయిందని నేను మోసం చేశానని సత్య చాలా ఏడుస్తుంది. సత్య క్రిష్‌తో స్వార్థం కోసం మీ వాళ్లు ఎంతకు తెగిస్తున్నారో నీకు తెలుస్తుందా అని అంటుంది. ఇంత మంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేశారని అంటుంది.  


అందరినీ నేను తీసుకెళ్లిపోతాను ఎక్కడైనా తీసుకెళ్లిపోతా ఈ పెద్దావిడను బతికించమని అరుస్తుంది. రేపో మాపో నా పరిస్థితి ఇంతే అని ఆ పెద్దావిడ ప్లేస్‌లో నేనే శవంలా ఉంటానని నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం కంటే ఏం చేయలేవు అని అంటుంది. క్రిష్ షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్లిపో క్రిష్ మీ అన్నయ్య మీ బాపు నిన్ను ఇక్కడ చూస్తే మరో ప్రళయం చేస్తారని అంటుంది. అక్కడున్న అందరికీ సత్య తన వాళ్ల వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్తుంది. రాత్ర క్రిష్ మందు తాగుతూ సత్య మాటలు తలచుకొని ఉంటాడు. గదిలో సత్య ఏడుస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!