Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం విహారి ఒకరి మీద ఒకరు పడిపోతారు. కనకం తాళికి, విహారి చైన్ చుట్టుకుంటుంది. విహారి చైనులు తీసి పైకి లేస్తాడు. కనకం మహాలక్ష్మీ అలా చూస్తూ ఉండిపోయి చెమటలు పట్టేసి పరుగున బయటకు వెళ్లిపోతుంది. విహారి తాను కలిసి బెడ్ మీద పడిపోవడం గుర్తు చేసుకొని తనని క్షమించమని దేవుడికి దండం పెట్టుకుంటుంది. తనకు విహారి మీద భర్త అనే భావన రాకూడదని భర్త మీద కలిగే ఆశ తనకు కలగకూడదని మొక్కుకుంటుంది. 


కనకం: ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలీదు కానీ భర్త అనే ఆశ నా మనసులో పుడుతుంది. విహారి గారు సహస్రమ్మని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒకరి మనసులో ఒకరు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆయనపై ఆశ పడటం తప్పు. ఒక భార్యగా ఆయన మీద నాకు ఆశ కలగడం క్షమించరాని నేరంతో సమానం. ఇంకొక్క సారి విహారి గారి గురించి నా మనసులో ఎలాంటి అభిప్రాయం రాకూడదు. ఎలాంటి చెడు ఆలోచన రాకూడదు నాకు అలాంటి భావన రాకుండా నువ్వే చూడు తండ్రి అని బిందెతో నీళ్లను తన మీద పోసుకుంటుంది. కనకం తల్లి అది చూస్తుంది. 
గౌరీ: కనకం.. కనకం ఏంటే ఇది ఏమైంది. 
కనకం: ఏం లేదమ్మా. 
గౌరీ: కనకం నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా. ఈ టైంలో కట్టుకున్న బట్టలతో తల స్నానం చేశావేంటే. కనకం నాకు అర్థమైందే సమయం కాని సమయంలో నీ భర్త మీద ఒక భార్యగా ఆశ కలిగింది కదా. ఆయన నీ భర్త కనకం భర్త మీద ఆశ కలగడం తప్పే కాదు. భర్త మీద ఆశ కలగడానికి మనసుకి సమయంతో సంబంధం ఉండదు. భార్యాభర్తల సంబంధం పవిత్రమైంది. భర్త చేయి తాకినా గాలి తగిలినా అలాగే భర్తకు భార్య కొంగు తాకినా హత్తుకున్నా అందులో ఒక అపూర్వమైన బంధం ఉంటుంది. అది మనసుతోనే అనుభవించాలి. అంత పవిత్రమైన భావనను నువ్వు ఎందుకే తడబడిపోతున్నావ్. తప్పు చేశాననే భావనతో ఇలా బిందెతో నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్లు.
ఆదికేశవ్: ఏమైంది అలా ఉన్నావ్ గౌరీ.
గౌరీ: అది కాదయ్యా మన అమ్మాయికి మొహమాటం వాళ్లిద్దరి మధ్య ఆ విషయం జరిగిందో లేదో పద్ధతి ప్రకారం అయితే అమ్మాయి ఇంట్లో కూడా 3 రాత్రులు జరగాలి అదేదో ఇక్కడ ఇప్పుడు జరిపిస్తే సరిపోతుంది.
ఆదికేశవ్: నువ్వు చెప్పింది నిజమే పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టిస్తా.


మరోవైపు సహస్ర, పద్మాక్షి వాళ్లు ధర్మపురం వచ్చి చీరలు సెలక్ట్ చేస్తుంటారు. ఎన్ని తీసినా సహస్రకు నచ్చవు.  అందరూ చీరలు చూపిస్తే సహస్ర రెస్పాండ్ అవుతుంది కానీ యమున చూపిస్తే మాత్రం అరిచేస్తుంది. దాంతో యమున ఆ విషయంలో కలుగజేసుకోను అనేస్తుంది. యమున బాధ పడటంతో వసుధ ఓదార్చుతుంది. ఎన్ని చూసినా సహస్రకి నచ్చకపోవడంతో ఆ షాప్ అతను ఆదికేశవ్ ఎన్ని చీరలు అయినా నేచి ఇచ్చేస్తారని అంటారు. వాళ్ల దగ్గరకు వెళ్లి కొనుక్కోమని చెప్తారు. ఓ వ్యక్తిని తోడు ఇచ్చి ఆదికేశవ్ ఇంటికి పంపిస్తారు. 


మరోవైపు ఆదికేశవ్ విహారికి పంచె కట్టుకోమని అంటాడు. విహారి తనకు పంచె కట్టుకోవడం రాదని అంటే ఆదికేశవ్ నేను చూసుకుంటా అంటాడు. ఇక కనకం తన భర్తకి పంచె కడుతుందని అంటుంది రాజీ. పంచె కనకం చేతికి ఇచ్చేసి అందరూ వెళ్లిపోతారు. బామ్మ బయట నుంచి తలుపు వేసేస్తుంది. కనకం, విహారిలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. విహారి సిగ్గు పడితే కనకం ఇబ్బందిగా ఫీలవుతుంది. నేనే ఎలా ఒకలా పంచె కట్టుకుంటా అని విహారి తీసుకుంటాడు. కనకం వెనక్కితిరిగి ముఖానికి చేయి అడ్డు పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి యాక్సిడెంట్.. కండీషన్ సీరియస్.. శౌర్య పరిస్థితి అంతే!