Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీప, శౌర్య అందరూ హాస్పిటల్‌కి వస్తారు. కార్తీక్ డాక్టర్‌ని కలిసి నా భార్య కూడా వచ్చింది అనుమానం వచ్చినట్లుంది అందుకే వచ్చిందని అంటాడు కార్తీక్. దాంతో డాక్టర్ నీకు 25 నిమిషాలు ఉంది డాక్టర్ నిరంజన్ వెళ్లిపోతే మళ్లీ రెండు నెలలు రారు ఈలోపు నువ్వు పాపని ఆయనకు చూపించాలి అని అంటాడు. కార్తీక్ ఏం చేయాలా అని తల పట్టుకుంటాడు.


దీప డాక్టర్‌తో మాట్లాడి శౌర్య సమస్య తెలుసుకోవాలని అనుకుంటుంది. కార్తీక్ కూడా టెన్షన్ పడతాడు. వాళ్లని ఫాలో అయిన జ్యోత్స్న దీపకి కాల్ చేస్తుంది. దీపకి కొత్త నెంబరు నుంచి కాల్ చేస్తుంది. సిగ్నల్ లేదని చెప్పి కార్తీక్ దీపని బయటకు పంపేస్తాడు. ఈలోపు పాపని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. దాసు కూడా అక్కడే ఉంటాడు. జ్యోత్స్న మాట్లాడకుండా దీపని బయటకు రప్పిస్తుంది. జ్యోత్స్న కారుతో దీపని గుద్దేయబోతే దీపని దాసు పిలవడంతో జ్యోత్స్న కారు వెళ్లి చెట్టుకు గుద్దేస్తుంది. దాంతో జ్యోత్స్నకి గాయం అవుతుంది. దాసు, దీప జ్యోత్స్నని చూసి షాక్ అయిపోతారు. జ్యోత్స్నని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ జ్యోత్స్నకి గాయం అయి రక్తం కారుతుంది. దీప, దాసులు జ్యోత్స్నని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. 


మరోవైపు డాక్టర్ నిరంజన్ శౌర్యని చూసి శౌర్యకి ప్రాబ్లమ్ ఉందని చెప్తాడు. పాపకి మెడిసిన్ ఇస్తాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. కార్తీక్ డీలా పడిపోతాడు. మరోవైపు జ్యోత్స్న ఇంట్లో కనిపించడం లేదని శివనారాయణ పారిజాతం మీద సీరియస్ అవుతాడు. ఇంతలో జ్యోత్స్నకి వాళ్ల తాతయ్య ఫోన్ చేస్తే దీప మాట్లాడుతుంది. దీప జ్యోత్స్నికి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్ వాళ్లు బయటకు వస్తే దీప, దాసులు కనిపిస్తారు. జ్యోత్స్న ముబైల్ నీ దగ్గర ఎందుకు ఉందని కార్తీక్ అడిగితే జ్యోత్స్నకి యాక్సిడెంట్ అయిందని అంటారు. కార్తీక్ షాక్ అయిపోతాడు. జ్యోత్స్నకి అర్జెంటుగా బ్లడ్ కావాలంటే దీప ఇస్తానని అంటుంది. ఇక దాసు కూడా ఇస్తానని అంటాడు. నర్స్ దాసుని తీసుకొని వెళ్తుంది. ఇంతలో శివనారాయణ వచ్చి కార్తీక్, దీపల మీద సీరియస్ అవుతాడు. నా మనవరాలికి ఏమైందని అడుగుతాడు.


దాసుని కూడా చూసి మీ అందరూ కలిసి మీరు ఏం చేశారని అడుగుతాడు. దానికి కార్తీక్ ఈ మనుషులు మారరు దీప మనం వెళ్లిపోదాం అంటే శివనారాయణ పోలీస్ కేసు పెడతానని అంటాడు. దానికి కార్తీక్ యాక్సిడెంట్ అయిన తనని దీప కాపాడిందని దాసు రక్తం ఇచ్చాడని కేసు పెట్టమని సీరియస్ అవుతాడు. ఇక కార్తీక్ వెళ్లిపోదాం అంటే దీప ఉందామని అంటుంది. కార్తీక్ వద్దని అంటాడు. దాంతో దీప, దాసు వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు కాశీ, స్వప్నలు హ్యాపీగా గడుపుతారు. వంటలు బాగా చేశారని అంటే అవి మా అమ్మ చేసిందని స్వప్న చెప్తుంది. ఇక దాసుకి కాశీ ఫోన్ చేస్తే జ్యోత్స్నకి యాక్సిడెంట్ గురించి దాసు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: జీవనే హారతి బిడ్డ తండ్రి.. మళ్లీ డీఎన్‌ఏ టెస్ట్.. జీవితం నాశనమైందంటూ పింకీ ఏడుపు!