Satyabhama Today Episode మహదేవయ్య ఎంత మందిని సాయం అడిగినా ఎవరూ సాయం చేయలేమని అనేస్తారు. సత్య వచ్చి ఎవరూ సాయం చేయడం లేదా మామయ్య నేనే సాయం చేస్తాను అంటుంది. క్రిష్‌ని సీక్రెట్‌గా మీ గదిలోకి తీసుకొస్తా మీరు తనతో బిడ్డల మార్పిడి గురించి చెప్పేయండి అని అంటుంది. క్రిష్ మీ పీక పట్టకుండా నేను మిమల్ని కాపాడుతానని అంటుంది. 


నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా అని మహదేవయ్య వెళ్లిపోతాడు. మరోవైపు క్రిష్ తండ్రి గురించే ఆలోచిస్తే ఏం చేయాలా అనే టెన్షన్ ఉంటాడు. గంగ ఎవరు ఎందుకు వచ్చింది బాపుని ఎందుకు బెదిరిస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. గంగ బ్యాగ్ వెతికితే ఏమైనా క్లూ దొరుకుతుందని గంగ గదికి వెళ్తాడు. మెల్లగా ఎవరూ చూడకుండా గంగ తల కింద ఉన్న బ్యాగ్ తీసి చూస్తే అందులో క్రిష్ చిన్నప్పటి ఫొటో ఉంటుంది. నా ఫొటో ఈమె బ్యాగ్‌లో ఎందుకు ఉందని అనుకుంటాడు. ఫొటో తీసుకొని గదిలోకి వెళ్లిపోతాడు. సత్య దూరం నుంచి చూసి నువ్వు ఇలాంటి పని చేస్తావని ముందే గ్రహించి ఆవిడతో ఆ ఫొటో బ్యాగ్‌లో నేనే పెట్టించా అనుకుంటుంది.


సత్య క్రిష్ దగ్గరకు వెళ్లి చిన్నప్పుడు భలే ముద్దుగా ఉన్నావని ఫొటోకి ముద్దు పెడుతుంది. క్రిష్ ఏం మాట్లాడకుండా అలా ఉంటే క్రిష్‌కి కూడా ముద్దు పెడుతుంది. అయినా క్రిష్ డల్‌గానే ఉంటాడు. ఏమైందని అడిగితే ఈ ఫొటో బయటకు ఎలా వచ్చిందని అడుగుతాడు. గంగ బ్యాగ్లో ఫొటో దొరికిందని చెప్తాడు. నా చిన్నప్పటి పొటో తన బ్యాగ్లో ఎలా ఉంటుందని అంటాడు.


క్రిష్: ఎవరో ఇచ్చారు అది మాత్రం పక్కా.
సత్య: మామయ్య ఇచ్చారా.
క్రిష్: బాపు ఎందుకు ఇస్తాడు. 
సత్య: అలా కూడా ఆలోచిస్తే కదా తెలిసేది. రెండు వైపులా ఆలోచిస్తే దొంగ దొరుకుతారు. అసలు ఆమెకు నీ ఫొటో దొంగతనంగా చూసుకునే అవసరం ఏంటి. 


ఇద్దరూ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకొని నీకు ఇచ్చిన ముద్దు నువ్వే తీసుకో అని అనుకుంటారు. తర్వాత సత్య క్రిష్‌ని నవ్వించేస్తుంది. మరోవైపు హర్ష లవ్ సాంగ్స్ వేసుకొని హ్యాపీగా వింటుంటే మైత్రి ఫ్రెండ్ కాల్ చేస్తుంది. ఎందుకు మైత్రికి దూరంగా ఉంటున్నావ్ ఎందుకు దానితో ఫోన్లో కూడా మాట్లాడటం లేదని అంటుంది. ఆఫీస్ వర్క్ అని హర్ష అంటాడు. ఇక రేపు దాని బర్త్‌డే కదా గుర్తుందా అంటే హర్ష మర్చిపోయా అంటాడు. నువ్వు భర్త్‌డేకి రాకపోతే అది మీ ఇంటికి వచ్చేస్తుందని అంటుంది.



ఇక నందిని హల్వా తీసుకొని వచ్చి హర్షకి ఇస్తుంది. ఎవరు కాల్ చేశారని అడుగుతుంది. ఆఫీస్ కాల్ అని హర్ష కవర్ చేస్తాడు.  మైత్రి దగ్గరకు వెళ్లాలా వద్దా అని ఆలోస్తాడు. ఇక క్రిష్ గంగ వెనక ఎవరు ఉన్నారని బాపుని ఇబ్బంది పెడితే ఎవరికి లాభం అనుకుంటాడు. ఇదంతా నర్శింహ పనే అయింటుందని ఆయనకు కాల్ చేస్తాడు. నువ్వు ఆయన కొడుకు కాదు కదా అంటాడు. గంగని నేనే పంపిస్తే మీరు గంగని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారని అడుగుతాడు. గట్టిగా మాట్లాడుతున్నాడంటే గంగ నర్శింహ మనిషి కాదని క్రిష్ అనుకుంటాడు. 


ఉదయం నిద్రలో ఉంటే సంధ్యకి సంజయ్ కాల్ చేస్తాడు. సంధ్యని బయటకు రమ్మని చెప్తాడు. ఇక అమ్మ గొంతు వినగానే సంధ్య పడుకున్నట్లు నటిస్తుంది. విశాలాక్షి నిద్ర లేపి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: అమ్మాయి గారు సీరియల్: జీవనే హారతి బిడ్డ తండ్రి.. మళ్లీ డీఎన్‌ఏ టెస్ట్.. జీవితం నాశనమైందంటూ పింకీ ఏడుపు!