Ammayi garu Serial Today Episode దీపక్, హారతి బిడ్డల డీఎన్‌ఏ రిపోర్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇంతలో డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. అందులో దీపక్ ఆ బిడ్డకు తండ్రి కాదని తేలుతుంది. హారతితో పాటు జీవన్ కూడా షాక్ అయిపోతాడు. అయితే జీవన్ తనకు హారతికి పుట్టిన బిడ్డని దీపక్ బిడ్డగా నిరూపించడానికి నెగిటివ్ వచ్చిన దీపక్ రిపోర్ట్స్ స్థానంలో పాజిటివ్ రిపోర్ట్ పెడతాడు. సూర్య ప్రతాప్ నెగిటివ్ అని చెప్పడంతో జీవన్‌కి గట్టి దెబ్బే తగులుతుంది.
జీవన్ రిపోర్ట్స్ మార్చడానికి వెళ్లినప్పుడు రూప, రాజులు ఫాలో అయి వెళ్లి రిపోర్ట్ మళ్లీ మార్చేస్తారు. హారతి దీపకే అని ఏ తల్లి అయినా బిడ్డ తండ్రి విషయంలో ఇలా చెప్తుందా అని ఏడుస్తుంది. పెళ్లి కాకముందే తల్లి అయిన నీ క్యారెక్టర్ అర్థమవుతుంది అని విజయాంబిక అంటుంది.
హారతి: అత్తయ్య నా క్యారెక్టర్ మంచిది కాదు అని అంటున్నారా. దీపక్ క్యారెక్టర్ కూడా మంచిది కాదు. మందారాన్ని పెళ్లి ముందే తల్లిని చేసినట్లు నన్ను కూడా చేసుకుంటాడని ఎందుకు ఆలోచించడం లేదు.
విజయాంబిక: నా కొడుకు క్యారెక్టర్ గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా.
సూర్యప్రతాప్: అక్కా కొంచెం చూసి మాట్లాడు. హారతి డీఎన్ఏ రిపోర్ట్స్ దీపక్ తండ్రి కాదని చెప్తున్నాయి కదా.
హారతి: సార్ దీపక్ తండ్రి కాకపోతే నన్ను హాస్పిటల్‌కి ఎందుకు తీసుకెళ్తాడు. దగ్గరుండి చూసుకున్నాడు.
సూర్యప్రతాప్: అవునా దీపక్ నువ్వు ఇలా నిజం చెప్పవు పోలీసులకు ఫోన్ చేయాల్సందే.
రూప: ఆగండి నాన్న. రిపోర్ట్స్ ప్రకారం బావని తప్పులేదు. హారతి మాటల ప్రాకారం దీపక్ బావదే తప్పు ఈ రెండు రకాలుగా కాకుండా వేరే కోణంలో ఆలోంచాలి.
రాజు: హారతి ఇంటి కొచ్చినప్పటి నుంచి చూస్తే మాకు వేరే అనుమానాలు ఉన్నాయి పెద్దయ్య.
సూర్యప్రతాప్: ఏంట్రా అది.
రాజు: ఈ జీవనే హారతి బిడ్డకు తండ్రి అని అనుమానంగా ఉంది పెద్దయ్య. జీవన్, హారతితో పాటు అందరూ షాక్ అయిపోతారు.
జీవన్: ఏం మాట్లాడుతున్నావ్ రాజు నీకు బుద్ధి ఉందా.
హారతి: న్యాయం కోసం వస్తే ఇలా అంటున్నారు ఇది కరెక్ట్ కాదండి.
సూర్యప్రతాప్: అవునురా రాజు ఇలా అబాండాలు వేయకూడదు.
రూప: ఆధారాలు ఉన్నాయి పెద్దయ్యగారు. జీవన్, హారతి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏమైనా ఆధారాలు వదిలేశామా అని టెన్షన్ పడతారు.
రాజు: హారతి దీపక్ వల్ల నష్టపోయి ఉంటే హారతి ఇంటికి వచ్చి న్యాయం చేయమన్న రోజు దీపక్ హారతి కాళ్లా వేళ్లా పడి బతిమాలే వాడు కానీ ఆ రోజు దీపక్ వెళ్తాడేమో అని చూస్తే హారతిని కలవడానికి జీవన్ వెళ్లాడు. వెళ్లడమే కాకుండా తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి బాబు మెడలో వేశాడు.
జీవన్: వేశాను మామయ్య హారతి ఈ ఇంటి పరువు పోయిందని అలా కాకూడదని ఇలా సాయంగా ఇచ్చాను. హారతి చేతికి ఇస్తే తనని తక్కువ చేయడం ఇష్టం లేక బాబు మెడలో వేశా.
రాజు: మరి డీఎన్ఏ రిపోర్ట్ ఈ రోజే వస్తున్నాయని తెలిసి హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లావు. రిపోర్ట్స్ మార్చే ప్రయత్నం నువ్వు ఎందుకు చేసినట్లు.
దీపక్: మమ్మీ వీడు మన పక్కనే ఉంటూ మనకే గోతులు తవ్వాడా మమ్మీ.
జీవన్: రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో తెలిసుకోవాలని వెళ్లాను.
రూప: నాన్న ఈరోజు రిపోర్ట్స్ వస్తాయని తెలిసి మళ్లీ ఎప్పుడు వస్తాయని అడగటం ఎందుకు.
సూర్యప్రతాప్: మర్యాదగా ఇద్దరూ నిజం ఒప్పుకోండి.
హారతి మాత్రం తన బిడ్డకు తండ్రి దీపక్ అనే చెప్తాడు. దాంతో రాజు జీవన్, బాబు డీఎన్‌ఏ టెస్ట్ చేయించమని అడుగుతాడు. సూర్యప్రతాప్ సరే అని డాక్టర్‌తో సాంపిల్స్ కలెక్ట్ చేయమని అంటారు. జీవన్ అందరి ముందు తీసుకెళ్లండి అని లేని ధైర్యం నటిస్తాడు. రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడుదామని హారతితో సూర్యప్రతాప్ అంటాడు. ఇక దీపక్‌కి తొందర్లోనే మంచి దారి చూపిస్తానని అంటాడు. జీవన్ తండ్రి అని తేలితే పింకీని మనం కాపాడుకోవచ్చని పింకీ తల్లిదండ్రులు అనుకుంటారు. జీవన్‌ని విజయాంబిక, దీపక్‌లు నిలదీస్తారు. మీ కోసమే హాస్పిటల్‌కి వెళ్లానని జీవన్ చెప్పి తప్పించుకుంటాడు.
జీవన్ హారతి దగ్గరకు వెళ్తాడు. రూప, రాజులు కావాలనే ఇలా చేశారని అనుకుంటారు. నా వల్ల చాలా మాటలు పడ్డావు సారీ అని జీవన్ చెప్తాడు. హారతి జీవన్‌ని హగ్ చేసుకుంటుంది. తొందరగా పెళ్లి చేసుకుందామని హారతి అంటుంది. ఈ రెండు రోజుల్లో వాళ్లను నాశనం చేసేస్తాను అని తర్వాత పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇక హారతిని హగ్ చేసుకొని డబ్బుతో డాక్టర్‌ని మ్యానేజ్ చేస్తానని అనుకుంటాడు. ఇక పింకీ దగ్గరకు తల్లిదండ్రులు, సూర్యప్రతాప్ వచ్చి నువ్వు జీవన్‌ని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారు. దాంతో పింకీ పెద్దనాన్న క్షమించండి అని సూర్యప్రతాప్ కాళ్ల మీద పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: డీఎన్ఏ రిపోర్ట్ మార్చిన జీవన్‌కి దిమ్మ తిరిగే షాక్.. జీవనే హారతి భర్త అని తెలిసిపోయిందా!