Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆదికేశవ్ ఇంటికి కనకం, విహారి వస్తారు. వాళ్లని చూసి ఆదికేశవ్ చాలా సంతోషిస్తాడు. గౌరీ కూతురు, అల్లుడికి దిష్టి తీస్తుంది. ఆదికేశవ్ కూతురు అల్లుడిని గుమ్మం ముందు ఆపి వారి తొలి అడుగులు జ్ఞాపకంగా ఉండిపోవాలని తన తెల్లటి పంచి మీద ఎర్రటి కుంకుమ నీళ్లతో అడుగులు వేయమని చెప్తాడు.
విహారి: ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అండీ.
ఆదికేశవ్: దేవుడి లాంటి మీ అడుగు మా ఇంట్లో పడి మా కనకం జీవితానికి ఒక అర్థం దొరికింది. అలాంటి మీ పాదం గుర్తు మా ఇంట్లో మా కడ వరకు ఉండిపోవాలి. ఆ అడుగు జాడలు మాకు అంత విలువైనవి రండి బాబు కుడి కాలు పెట్టి లోపలికి రండి. ఇద్దరూ అడుగులు వేస్తారు.
ఆది కేశవ్ అల్లుడు, కూతుర్ని కూర్చొపెట్టి స్వీట్స్ తినిపించి సందడి చేస్తాడు. తన ఇంట్లో కనకం పని మనిషిగా పనులు చేయడం అవమానాలు పడటం విహారి గుర్తు చేసుకొని బాధ పడతాడు. అక్కడే ఉన్న తన పెళ్లి ఆల్బమ్‌ని విహారి చూస్తాడు.
గౌరీ: అల్లుడుగారు మీ మామయ్య కొన్ని వందల సార్లు ఈ ఫొటోలు చూసుంటారు లక్షలు సార్లు మిమల్ని తలచుకొని ఉంటారు. ఆయన కల ఇప్పుడు నెరవేరింది.
ఆదికేశవ్: అల్లుడు గారు మీరు మా కూతురికి గొప్ప జీవితం ఇచ్చారు. మా లాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు మేం చాలా అదృష్టవంతులం.
ఇక రాజీ కనకం, విహారిలకు గది చూపిస్తుంది. మీ భార్యభర్తల ఏకాంతానికి ఈ గదే బెటర్ అంటుంది. కనకం గదిలోకి వెళ్తుంది. విహారి వెనకాలే వెళ్తాడు. కనకం ఏడుస్తుంది. విహారి ఏమైందని అడుగుతాడు. ఇక్కడ కూడా నువ్వు ఏడిస్తే నేను చేసిన ప్రయత్నానికి కారణం ఉండదని అంటాడు. దాంతో కనకం విహారి గారు థ్యాంక్స్ అని విహారి కాళ్ల మీద పడిపోతుంది. ఎన్నోసార్లు తల్లిదండ్రులను చూడాలి అనుకున్నా భర్త లేకుండా వచ్చుంటే ఏమైపోతారో అని రాలేదని ఇప్పుడు మీ వల్ల నా కల నెరవేరిందని చెప్తుంది. విహారి కనకానికి ఏడ్వొద్దని చెప్తాడు. మీ ముందు కనీసం చేతులు కట్టుకొని నిలబడే జీవితాలు మావి కావని కానీ మీరు మాకోసం ఇంత చేశారని మీకోసం రుణం తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకుంటానని అంటుంది. ఇక విహారి మీ నాన్నకి ఆపరేషన్ చేయించేద్దామని అంతా మంచే జరుగుతుందని అంటాడు.
అంబిక విహారిని అనుమానిస్తుంది. నిజంగానే విహారి ముంబయి వెళ్లుంటాడా లేక ఇంకెక్కడికైనా వెళ్లుంటాడు అని అనుకుంటుంది. ఇంతలో సహస్ర వచ్చి ఏమైందని అడుగుతుంది. దాంతో అంబిక విహారి గురించి విహారి ముంబయి వెళ్తాడని చెప్పడం గురించి అని చెప్తుంది. నాకు తెలియని సమస్యలు ముంబయిలో ఏముంటాయని అంటుంది. విహారి, బయటకు వెళ్లిన కాసేపటికే లక్ష్మీ వెళ్లిది నాకు ఏదో అనుమానంగా ఉందని అంబిక అంటుంది. దానికి సహస్ర నాకు అనుమానాలు రేపకు పిన్ని అని అంటుంది. ఇక ముంబయి ఆఫీస్‌కి కాల్ చేసి విహారి గురించి అడిగితే వాళ్లు విహారి ఉన్నాడని చెప్తారు. మరోవైపు పద్మాక్షి వాళ్లు షాపింగ్‌కి బయల్దేరుతారు. యమున వదినను పిలుద్దామని వసుధ అంటే అంబిక, పద్మాక్షి అడ్డుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.