Satyabhama Serial Today Episode గంగ సంగతి తేల్చేస్తా తనని ఉంచనని క్రిష్ అంటే మహదేవయ్య క్రిష్ మీద అరుస్తాడు. గంగ సంగతి నాకు వదిలేయ్ అని అంటాడు. నువ్వు పోరా ఇక్కడి నుంచి అని మహదేవయ్య పంపేస్తాడు. ఇంతలో సత్య వస్తుంది. కొడుకు వెళ్లిపోతే కోడలు వచ్చిందా అని అనుకుంటున్నారా అని సత్య అంటే దానికి మహదేవయ్య నా నోరు మంచిది కాదు ఇప్పుడు నేను చిరాకులో ఉన్న నువ్వు వెళ్లిపో అంటాడు. 


సత్య: క్రిష్ నా పక్కనుండగా నేను గొప్పదాన్ని. 
మహదేవయ్య: వాడు ఇప్పుడే నన్ను బతిమాలి పోయాడు చూడలేదా. 
సత్య: ఆ బతిమాలడం వెనక తత్వం మీకు బోధ పడదు. గంగ మోసం చేసింది పర్మిషన్ ఇస్తే చంపేస్తాను అన్నాడు. నిజానికి మీరు మోసం చేశారని తెలిస్తే మీ పరిస్థితి అర్థం చేసుకోండి. మీ పచ్చబొట్టు కొడుకు మిమల్ని చంపేస్తాడు. 
క్రిష్: ఏడుస్తుంటే సత్య బాధగా ఉంది నేను ఉండి కూడా బాపునకి అవమానం జరుగుతుంది. ఏం చేయలేకపోతున్నా. బాపు ఎందుకు పట్టించుకోవడం లేదు నన్ను ఎందుకు పరాయి వాడిలా చూస్తున్నాడు.
సత్య: పరాయివాడే  అనుకుంటున్నారు.
క్రిష్: వెటకారం చేయకు సత్య. అలా ఎవరైనా అంటే ఊరుకోను. గంగ మేటర్‌లో బాపు ఎందుకు కూల్గా ఉన్నాడు.
సత్య: కూల్‌గా లేరు లోలోపల మధన పడుతున్నారు. నీ పేరు గుండెల మీద పచ్చబొట్టు వేసుకున్నంత మాత్రాన అన్నీ నీకు చెప్పాలి అని లేదు కదా. అది నీకు తెలుస్తుంది కదా. ఆయన పరిస్థితి నీకు అర్థమవుతుంది.
క్రిష్: లేదు అందరిలా నేను బాపు గురించి అలా ఆలోచించను. ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన్ను నేను ఆకాశంలో చూస్తా బాపు ఫీలవుతున్నాడు సత్య. నాకు చెప్పలేక దాచుకుంటున్నాడు. నా కారణంగా బాపు ఇలా అయ్యాడు. అసలు ఆ గంగకి అంత ధైర్యం ఎక్కడిది ఎవరు తన వెనకున్నారు. అది తెలుసుకుంటా.
సత్య: నీ బాధ తగ్గించే ఆయుధం నా దగ్గర ఉంది అది తెలియజేసే టైం రావడం లేదు అంతే.



మరోవైపు మైత్రి హర్షని కాల్ చేస్తుంది. హర్ష కాల్ కట్ చేస్తే మైత్రి ఫ్రెండ్ వచ్చి పెళ్లి అయిన మగాడు చేయని సాయాలన్నీ నీకు చేశాడు ఇక నీతో మాట్లాడడు వదిలేయ్ అని మైత్రి ఫ్రెండ్ చెప్తుంది. ఇప్పుడు హర్ష నిన్ను ప్రేమించడంలేదని అంటుంది. దానికి మైత్రి జాలితో హర్షని మళ్లీ నా ప్రేమలోకి తెచ్చుకుంటా అని అంటుంది. హర్ష నందిని వదిలేలా చేస్తా నని రేపు తన పుట్టిన రోజుని వాడుకుంటానని మైత్రి అంటుంది. ఇక భైరవి నగలన్నీ గంగ పెట్టుకుంటుంది. ఇన్ని నగలు ఉన్నాయని తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని అని అంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చి నగలు తీసుకుంటావా అని అడుగుతుంది భైరవి.


దానికి గంగ మన ఇద్దరికీ ఒకడే మొగుడు నగలు అన్నీ మన ఇద్దరికీ సమానం అని అంటుంది. ఈ జాయింట్ బిజినెస్ ఏంటి అని భైరవి తల పట్టుకుంటుంది. సత్య రావడంతో భైరవి నా నగలు తీసుకుంది చూడవే అని గోల చేస్తుంది. సత్య బతిమాలినట్లు నటిస్తుంది. దాంతో గంగ ఐదు నిమిషాల్లో తీస్తాలే అంటుంది. మరోవైపు మహాదేవయ్య పోలీసులకు మినిస్టర్‌కి ఫోన్ చేసి డీఎన్‌ఏ రిపోర్ట్ విషయంలో సాయం చేయమని లంచం ఇస్తానని అంటాడు. దానికి ఎవరూ ఏం చేయలేమని అంటారు. ఇంతలో సత్య వచ్చి కలికాలం వస్తే ఇలాగే ఉంటుంది ఎవరూ ఏం చేయలేరు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  



Also Read: అమ్మాయి గారు సీరియల్: డీఎన్ఏ రిపోర్ట్ మార్చిన జీవన్‌కి దిమ్మ తిరిగే షాక్.. జీవనే హారతి భర్త అని తెలిసిపోయిందా!