Ammayi garu Serial Promo Today Episode సూర్యప్రతాప్, విరూపాక్షిలను కలపడానికి రాజు, రూపలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే రాఘవ దొరికినట్లే దొరికి మాయం అయిపోతాడు. మరోవైపు జీవన్ పింకీని దొంగ పెళ్లి చేసుకొని సూర్యప్రతాప్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక హారతి తనకు దీపక్‌కి సంబంధం ఉందని వాళ్లిద్దరికే బిడ్డ పుట్టాడని న్యాయం చేయమని సూర్య ప్రతాప్ ఇంటికి వస్తుంది. ఆ బిడ్డకు దీపక్‌కి సంబంధం ఉందేమో అని డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తారు. ఇందుకు సంబంధించిన లేటస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..


" హారతి బిడ్డను తీసుకొని సూర్యప్రతాప్ ఇంటికి వస్తుంది. డీఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వస్తాయో అనే దాని గురించి సూర్య ప్రతాప్ రాజు వాళ్లని అడుగుతాడు. ఇక సీన్ కట్ చేస్తే జీవన్ హారతి, దీపక్‌ల బిడ్డ కాదని వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్‌ని మార్చేసి బాబు దీపక్ బిడ్డే అన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ మార్చేస్తాడు. డాక్టర్ రిపోర్ట్ తీసుకొని సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు. వాటిని సూర్య ప్రతాప్‌కి ఇస్తాడు. వాటిని సూర్య చూసి ఈ డీఎన్‌ఏ రిపోర్ట్ ప్రకారం హారతి బిడ్డ డీఎన్‌ఏకి దీపక్ డీఎన్ఏ అనే సరికి అందరూ ముఖ్యంగా జీవన్, హారతి షాక్ అయినట్లు చూపిస్తారు. ఎక్కడ ఏదో జరిగింది అని జీవన్ అనుకొని రాజు, రూపల వైపు చూస్తాడు. దీంతో ప్రోమో పూర్తవుతుంది.”



 


జీవన్ పింకీని అడ్డుపెట్టుకొని సూర్య ప్రతాప్ ఇంట్లో ఇబ్బందులు పెడుతుంటాడు. తాజాగా బిజినెస్ చేస్తా ఆస్తిలో వాటా కావాలని అడుగుతాడు. సూర్య ఇచ్చే టైంకి జీవన్ చెల్లి శ్వేత వచ్చి ఆస్తి పేపర్లు చింపేస్తుంది. ఎప్పుడూ అన్నకే సపోర్ట్ చేసే శ్వేతని రాజు, రూపలు బెదిరించి ఉంటారు. జీవన్ పింకీని ఎలా నాటకమాడి దొంగ పెళ్లి చేసుకున్నాడో అలాగే పింకీ లవర్‌తో శ్వేతకి పెళ్లి అయినట్లు రూప, రాజులు శ్వేతని నమ్మిస్తారు. దాంతో శ్వేత రూప, రాజులు చెప్పినట్లు చేస్తుంది. మరోవైపు జీవన్ లవరే హారతి. హారతి, జీవన్‌ల బిడ్డని సూర్య ప్రతాప్ ఇంట్లో అలజడి సృష్టించడానికి జీవన్ లవర్‌తో నాటకం ఆడించి ఆ బిడ్డ దీపక్ బిడ్డ అన్నట్లు చెప్పిస్తాడు. దాంతో సూర్య ప్రతాప్ దీపక్, హారతి బిడ్డలకు డీఎన్ఏ టెస్ట్ చేయమని చెప్తాడు. ఆ రిపోర్ట్స్‌లో దీపక్ తండ్రి అని తేలితే తల్లీకొడుకులని క్షమించనని సూర్య దీపక్, విజయాంబికలను ఉద్దేశించి చెప్తాడు. తాజా ప్రోమో చూస్తే దీపక్‌కి ఆ బిడ్డకి ఏం సంబంధం లేదని తేలినట్లు అనిపిస్తుంది. ఆ బిడ్డ జీవన్ బిడ్డ అని రాజు, రూపలకు అనుమానం ఉంది దాన్ని వారు నిరూపించారేమో అన్నట్లు ప్రోమోలో అనిపిస్తుంది. అసలేం జరిగిందో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 


 Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!