Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్ర వాళ్లు తమ ఇంటికి వచ్చేస్తారు. లక్కీ తల్లిని అంటూ పార్వతి మిత్ర ఇంటికి వస్తుంది. పాపని తీసుకెళ్లిపోతానని అంటుంది. లక్కీ మీ పాపే అనడానికి సాక్ష్యం ఏంటి అని లక్ష్మీ పార్వతిని ప్రశ్నిస్తుంది. పార్వతి నీళ్లు నమలడంతో మనీసా టెన్షన్ పడుతుంది.
పార్వతి: నేను పాపని కన్న హాస్పిటలే సాక్ష్యం అక్కడ అడగండి నేనే కన్న తల్లిని అని చెప్తారు.
లక్ష్మీ: పాపని వదిలేసి ఎందుకు వెళ్లారు.
మనీషా: ఏంటి ఆంటీ లక్ష్మీ ఇన్ని ప్రశ్నలు వేస్తుంది.
దేవయాని: అది అడగకపోతే ఆశ్చర్యం కదా.
మనీషా: ఏదో ఒకటి మ్యానేజ్ చేయండి.
దేవయాని: లక్ష్మీ ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నావ్.
మిత్ర: తను అడిగిన దాంట్లో తప్పేముంది పిన్ని. చెప్పండి పాపని ఎందుకు వదిలేశారు.
పార్వతి: నేను ఒకడిని ప్రేమించా అండీ వాడు నన్ను మోసం చేశాడు. పెళ్లి కాకుండా తల్లి అయ్యా అందుకే పాపని తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయా. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలా అని వచ్చాను. మీకు పుణ్యం నా పాపని నాకు ఇచ్చేయండి.
మనీషా: సడెన్‌గా వచ్చి పాపని ఇచ్చేయండి అంటే ఎలా ఇన్నాళ్లు లేనిది ఇలా ఇవ్వమంటే ఎలా.
పార్వతి: మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నా పాపని నాకు ఇచ్చేయండి మీకు దండం పెడతా.
మిత్ర: తను నిద్ర పోతుంది కాసేపు వెయిట్ చేయండి.
పార్వతి: సరే. పాప కోసం 8 ఏళ్లు ఎదురు చూశా కాసేపు ఎదురు చూడలేనా.
లక్కీ లేచేసరికి జున్ను అక్కడుండి మీ సొంత అమ్మ వచ్చిందని చెప్తాడు. జున్ను డల్ అయితే లక్కీ సంతోషంతో హాల్‌లోకి వస్తుంది. అమ్మా అని పిలిచి లక్కీ పార్వతిని హగ్ చేసుకుంటుంది. ఈ అమ్మని హగ్ చేసుకుంటే లక్ష్మీని చేసుకున్నట్లు లేదు అనుకొని నువ్వు నిజంగా మా అమ్మవేనా అని అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. నిన్ను హగ్ చేసుకుంటే మా అమ్మవనే ఫీలింగ్ రావడం లేదని లక్ష్మీ అమ్మని హగ్ చేసుకుంటే తను మా అమ్మ అని ఫీలింగ్ వస్తుందని చెప్తుంది.
తమ ప్లాన్‌ని లక్కీ పొగిట్టేలా ఉందని అనుకొని దేవయాని, మనీషా కవర్ చేయడానికి మీ అమ్మని కలిసి చాలా ఏళ్లు అయింది కదా అని అంటుంది. దానికి లక్ష్మీ నీకు రక్తం ఇవ్వడం వల్లే అలా అనిపిస్తుందని అంటారు. ఇక పార్వతి లక్కీని తీసుకెళ్లిపోతా అంటే లక్కీ మిత్ర దగ్గరకు వెళ్తుంది. మిత్ర లక్కీని తలచుకొని ఏడుస్తాడు. నాన్న తనే మీ అమ్మ అని ఎలా చెప్తావు నాన్న అని అంటుంది. ఆవిడ అమ్మ అనే ఫీలింగ్ నాకు రావడం లేదని ఆవిడ నన్ను తీసుకెళ్లిపోతా అంటుంది నేను వెళ్లను అని మిత్రని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మిత్ర కూడా లక్కీ మాటలకు ఏడుస్తాడు. నన్ను పంపించేస్తావా నాన్న నువ్వే నా నాన్న అని చెప్పావు కదా నేను వెళ్లను అని ఏడుస్తుంది. మీ అమ్మకి నువ్వు కావాలంటని మిత్ర అంటే మా అమ్మని కూడా ఇక్కడే ఉండమని చెప్పమని అంటుంది.
నాకు ఆ హక్కు లేదని మిత్ర అంటాడు. అందరూ ఆవిడని మనతో ఉండమని చెప్దామని అంటారు. అందరూ కలిసి ఒప్పిద్దామని అనుకుంటారు. ఇక దేవయాని పార్వతితో వాళ్లు పాపని ఉంచేయడానికి ప్లాన్ చేస్తున్నారని నువ్వు ఎలా అయినా పాపని తీసుకెళ్లిపో అని అంటుంది. జయదేవ్ పార్వతితో నువ్వు ఇంత సడెన్‌గా పాపని తీసుకెళ్లిపోతా అంటే ఎలా పాప నీతో అలవాటు పడే వరకు నువ్వు కూడా మాతో ఉండు అని అంటాడు. నా ఇళ్లు ఉద్యోగం అని పార్వతి అంటే నీకు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు అని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మిత్ర కూడా మీరు కూడా మా ఫ్యామిలీగా మాతో ఉండిపోండి అంటాడు. దానికి పార్వతి నా కూతుర్ని నేను పోషించుకోగలను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!