Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీకి బయటకు రమ్మని చెప్తాడు. లక్ష్మీ యమునకు చెప్పడానికి వెళ్తుంది. లక్ష్మీ యమునతో తిరుపతి వెళ్తానని చెప్తుంది. దానికి యమున ఇప్పుడు సడెన్‌గా ఎందుకు అని అంటుంది. దానికి లక్ష్మీ మనసు బాలేదు అని చెప్తుంది. ఎలా వెళ్తావ్ అని అడిగితే బస్ టికెట్ చేసుకున్నా అని చెప్తుంది.


యమున: ఏంటో లక్ష్మీ అందరూ ఈ సడెన్ ప్రయాణాలు. విహారి ఆఫీస్‌లో పని ఉందని చెప్పి వెళ్తాడు ఇప్పుడు నువ్వు మనస్శాంతి కోసం అని బయల్దేరుతున్నావ్. సరే ఇంతకీ మళ్లీ ఎప్పుడు వస్తావ్. 
లక్ష్మీ: రెండు రోజుల్లో వస్తానమ్మా.
యమున: సరే జాగ్రత్త.
లక్ష్మీ: దేవుడికి దండం పెట్టుకుంటూ అమ్మా నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలుదు కానీ మా నాన్నని కలుస్తున్నా అని సంతోషంగా ఉంది. వాళ్లకి అబద్దం చెప్తూ నా తల్లిదండ్రులకు మోసం చేస్తున్నాననే బాధగా ఉంది. ఇప్పటికి మాత్రం విహారి గారి మాటలు విని ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను. దేవుడికి దండం పెట్టుకొని తాంబూలంలో అక్షింతులు పట్టుకొని బ్యాగ్ సర్దుతుంది లక్ష్మీ. 


ఇంతలో యమున బ్యాగ్‌తో లక్ష్మీకి ఎదురుగా నిల్చొంటుంది. తాను కూడా తిరుపతి వస్తానని చెప్తుంది. దాంతో లక్ష్మీ షాక్‌ అయిపోతుంది. ఇక పండు అదంతా చూస్తాడు. బస్ టికెట్ అవ్వదు కదా అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్లే ఇస్తారంటుంది. ఇక యమున నువ్వు తిరుపతి అనగానే నాకు రావాలని ఉందని వస్తా పద అంటుంది. ఇక పండు ఎలా అయినా ఆపాలని వెళ్తాడు. తిరుపతిలో చలి ఇబ్బంది ఇలాంటి టైంలో మీరు వెళ్లడం సరికాదని మీ ఆరోగ్యం బాగోదు కదా అని అంటాడు. లక్ష్మీకి కూడా ఇబ్బంది అని చెప్పడంతో యమున ఆగిపోతుంది. పండు లక్ష్మీకి డ్రాప్ చేస్తాడు. సహస్ర, పద్మాక్షి, అంబిక లక్ష్మీ బయటకు వెళ్లడం చూస్తారు. సహస్ర అమ్మ పిన్నితో నా వార్నింగ్‌కే ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెప్తుంది. అంబిక సహస్రని పొగిడేస్తుంది.


విహారి వేరే చోట ఉంటే విహారి ఫ్రెండ్ సత్య లక్ష్మీని తీసుకొచ్చి విహారి దగ్గర డ్రాప్ చేస్తాడు. లక్ష్మీ దిగులుగా ఉంటే విహారి ఏం కాదని ధైర్యం చెప్పి తీసుకొని అత్తారింటికి బయల్దేరుతాడు. లక్ష్మీ కారులో కూర్చొని తన వెంట తెచ్చుకున్న అమ్మవారి కుంకుమ బొట్టు విహారికి ఇస్తుంది. డ్రైవింగ్ చేస్తూ విహారి పెట్టుకోలేకపోతే లక్ష్మీనే విహారికి బొట్టుపెడుతుంది. ఉదయం ఆదికేశవ కనకం, విహారి బాగుండాలని వీలైతే వాళ్లు ఒక్కసారి తన కళ్ల ముందు కనిపించాలని దేవుడికి కోరుకుంటాడు. ఇంట్లో ఉన్న విహారి, కనకం పెళ్లి ఫొటో చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజీ వచ్చి ఆదికేశవ్ కళ్లు మూసి పెద్ద నాన్న నీకో అద్భుతం చూసిస్తానని తీసుకెళ్తుంది.



గుమ్మం ఎదురుగా ఉన్న కనకం, విహారిని చూపిస్తుంది. కూతురు  అల్లుడిని చూసి ఆదికేశవ్ చాలా చాలా సంతోషిస్తాడు. కనకం నా కోసం మీరు అమెరికా నుంచి వచ్చారా అని చాలా సంతోషిస్తాడు. భార్య గౌరీని పిలిచి చూపిస్తాడు. గౌరీ కూతుర్ని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతుంది. కనకం, గౌరీ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ నాన్న రోజూ నీ కోసం పెట్టిన కన్నీళ్లు నీకు కనిపించాయా వస్తారు అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ఇక ఆదికేశవ్ ఇంటి చుట్టు పక్కల ఉన్నవారిని పిలిచి తన సంతోషం పంచుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!