Ammayi garu Serial Today Episode జీవనే హారతి తండ్రి అని అనుమానంగా ఉందని రాజు, రూపలు చెప్పండంతో సూర్యప్రతాప్ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తారు. జీవన్‌ని పెళ్లి చేసుకున్న పింకీ జీవితం నాశనం అయిపోయిందని పింకీ తల్లిదండ్రులు, సూర్యప్రతాప్ అక్కడికి వెళ్లి పింకీకి నిజం చెప్పమని అడుగుతారు. దాంతో పింకీ పెద్దనాన్న కాళ్ల మీద పడిపోయి ఏడుస్తుంది. సూర్యప్రతాప్‌తో సహా అందరూ ఏమైందని పింకిని అడుగుతారు. ఇప్పటికైనా నిజం చెప్పమని అంటారు.
పింకీ: ఏడుస్తూ ప్రమాణ స్వీకారం రోజు నాన్న పిలిస్తే బయల్దేరాను. పోలీసులు బ్యాగ్ చెక్ చేసి బ్యాగ్‌లో డ్రగ్స్ ప్యాకెట్లు తీసి అరెస్ట్ చేస్తామని పోలీస్ స్టేషక్‌కి అని ఎక్కడికో తీసుకెళ్లారు పెద్దనాన్న. తర్వాత నాతో డ్రగ్స్ టేస్ట్ చేయించి నేను కళ్లు తిరిగి పడిపోయిన తర్వాత నా మెడలో తాళి ఉంది జీవన్ భర్తగా ఉన్నాడు పెద్దనాన్న. నా బ్యాగ్‌లో డ్రగ్స్ దొరికినప్పటి నుంచి భర్తగా పక్కన ఉన్న వరకు వీడియో తీసి ఇంటి పరువు మీ పదవి తీస్తానని బెదిరించాడు పెద్దనాన్న. మీ పరువు పోకూడదని వాడు చెప్పినట్లు చేస్తున్నా.
సూర్యప్రతాప్: ఏడ్వకమ్మా ఇంత చిన్న వయసులోనే నా పదవి గురించి మన పరువు గురించి ఆలోచిస్తున్నావా ఇంత నరకం అనుభవిస్తున్నావా ఏడ్వకమ్మా నీకేం కాదు.
చంద్ర: నా కూతురి కన్నీళ్లకు కారణం అయిన వాడిని వదలను.
సూర్యప్రతాప్: చంద్ర ఆవేశపడకు. వాడి దగ్గర పింకీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పైగా డ్రగ్స్‌వి. పింకీ మన పరువు కాపాడుతూ వచ్చింది ఇప్పుడు మనం తొందరపడితే ఎలా. పైగా వాడు పింకీ మెడలో తాళి కట్టాడు. మనం ఏమైనా చేసి తొందర పడితే పింకీ పసుపు కుంకుమలు మనమే తీసేసినట్లువుతుంది.
రూప: అవును బాబాయ్ ఎలాగూ జీవన్ ప్రవర్తన అనుమానంగా ఉంది కాబట్టి డీఎన్‌ఏ రిపోర్ట్స్ వస్తే తేలుతుంది. మా అనుమానం ప్రకారం జీవన్, హారతి బిడ్డకు తండ్రి కాబట్టి పింకీని మనం కాపాడుకోవచ్చు. తాళి కట్టడానికి ముందు తర్వాత ఏం జరిగిందో తెలుసు కానీ ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
పింకీ: పెద్దనాన్న మీ ముందు నాతో మొగుడిలా అధికారం చెలాయిస్తాడు. ఆ తర్వాత కనీసం నాతో మాట్లాడడు. మన ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేకుండా చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నానని అంటుంటాడు.
సూర్యప్రతాప్: సరే అందరూ ఒక విషయం గుర్తుంచుకోండి. పింకీ మనకి ఏం చెప్పలేదు మనం ఏం వినలేదు. వాడి చెల్లితో రాజు పెళ్లి ఆగిపోయింది. నా వల్ల వాడు ఎలక్షన్‌లో ఓడిపోయాడు. సో వాడి టార్గెట్ మేం ముగ్గురు మాత్రమే కాబట్టి మీ ఎవరి జోలికి రాడు కాబట్టి మీరు నార్మల్‌గా ఉండండి. అమ్మా పింకీ నువ్వు జాగ్రత్తాగా ఉండాలి వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఊరుకోడు.
జీవన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి ఫేక్ రిపోర్ట్స్ కావాలని అంటాడు. డాక్టర్ నా వల్ల కాదు అని అంటాడు. దాంతో జీవన్ డాక్టర్‌కి డబ్బు ఆశ చూపుతాడు. అయినా డాక్టర్ ఒప్పుకోకపోవడంతో చంపేస్తా అన్నట్లు బెదిరించి డబ్బు ఇచ్చి ఫేక్ రిపోర్ట్స్ సిద్ధం చేయమని అంటాడు. మరోవైపు విరూపాక్షి, ముత్యాలు, అప్పలనాయుడు గుడికి వెళ్లాలని బయల్దేరుతారు. ముత్యాలు చేతిలో ఉన్న దేవుడి కోసం సిద్ధం చేసిన పసుపు, కుంకుమ అన్నీ కింద పడిపోతాయి. విరూపాక్షి ఆందోళన చెందుతుంది. కీడు శంకిస్తుందని గుడికి రావాలంటే భయంగా ఉందని అంటుంది. ఇక ముత్యాలు రాజు, రూపలు వస్తారనే కదా మనం వెళ్తున్నాం అంటే అందుకే భయంగా ఉందని విరూపాక్షి అంటుంది. మొత్తానికి అప్పలనాయుడు విరూపాక్షిని ఒప్పిస్తాడు. ఇక రాజు, రూపలతో పాటు ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తారు. శివుడికి అభిషేకం చేస్తారు. అందరూ తమ కోరికలు కోరుకుంటారు. జీవన్ బండారం బయట పడాలని కోరుకుంటారు. ఇక చంద్ర కూతురు కోసం కోరుకుంటారు. మరోవైపు విరూపాక్షి వాళ్లు గుడికి వచ్చి సూర్యప్రతాప్ వాళ్లకి ఎదురవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: జీవనే హారతి బిడ్డ తండ్రి.. మళ్లీ డీఎన్‌ఏ టెస్ట్.. జీవితం నాశనమైందంటూ పింకీ ఏడుపు!