జానకి వాళ్ళు సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేక మల్లిక తనని తిట్టించడం కోసం దొంగతనం స్కెచ్ వేస్తుంది. తన ఉంగరం పోయిందని ఇంట్లో గొడవ చేస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఎవరికి ఉన్నాయ్ జానకికి తప్ప అందుకే తన మీదే అనుమానంగా ఉందని మల్లిక అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. నీ ఉంగరం దొంగిలించాల్సిన అవసరం జానకికి ఏంటని రామా నిలదీస్తాడు. జెస్సీ కూడా జానకిని అనడం నచ్చలేదని అంటుంది. కాలేజ్ ఫీజు కట్టాలని ఎవరి దగ్గరో అప్పు చేసింది అందుకే దాన్ని తీర్చడం కోసం చేసి ఉంటుందని నిందలు వేస్తుంది. రామా కష్టపడి జానకిని చదివిస్తున్నాడని గోవిందరాజులు అంటాడు. కానీ మల్లిక మాత్రం తనకి జానకి మీద అనుమానంగా ఉందని అంటుంది.


వంటగదిలోనే కదా ఉండేది ఏ పప్పుల డబ్బాలో దాచిందో ఏంటో అని అంతా వెతుకుటుంది. తర్వాత జానకి బ్యాగ్ కూడా చూడాలని అనేసరికి రామా ఇస్తాడు. అందులో నుంచి మల్లిక ఉంగరం బయటకి తీసి చూపించడంతో జానకితో సహా అందరూ ఆశ్చర్యపోతారు. నేను అనుమానించినట్టు జానకి దగ్గరే ఉందని అంటుంది. మీ ఆవిడ నిప్పు అన్నారుగా ఇప్పుడు ఏమైందని నిలదీస్తుంది. వదిన ఇలాంటి పని చేయదని జెస్సి, వెన్నెల వెనకేసుకొస్తారు. ఇంట్లో వాళ్ళందరూ నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నారు జానకిని వెనకేసుకొస్తున్నారు ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోదాం పదండి అని మల్లిక అంటుంది. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ఎవరన్నారని జ్ఞానంబ అడుగుతుంది.


Also Read: 'ఏవయ్యో పెనిమిటీ' అని రిషిని పిలిచిన వసు- మిస్టర్ ఇగో మాములోడు కాదు పొగరుని ఆట ఆడించేస్తున్నాడు


మల్లిక అలా మాట్లాడుతుంటే ఏమి మాట్లాడవేంటని జ్ఞానంబ, గోవిందరాజులు విష్ణుని అడుగుతారు. ఇంటి పెద్ద కోడలు మీద నింద వేయడం మంచిది కాదని జ్ఞానంబ అంటుంది. కానీ మల్లిక మాత్రం మాదారిన మేము పోతామని గోల చేస్తుంది. ఇంకా ఈ ఇంట్లో ఉండమని ఎలా అంటున్నావ్ వదిన్ని ఒక్క మాట కూడా అనకుండా విష్ణు ఎదురు చెప్తాడు. కానీ జ్ఞానంబ మాత్రం ఎవరు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదని అంటుంది. ఊరుకుంటున్నామని మీ పెత్తనం మామీద చూపించొద్దు, మేము బయటకి వెళ్ళకుండా అడ్డుపడితే మీరు అత్తయ్య అనే విషయం మర్చిపోవాల్సి వస్తుంది, మీ పెద్దరికం మీరు కాపాడుకోండి అని మల్లిక జ్ఞానంబని అవమానిస్తుంది.


జ్ఞానంబ మల్లిక మాటలు తలుచుకుని బాధపడుతుంటే గోవిందరాజులు వచ్చి నచ్చజెపుతాడు. నా బిడ్డలో ఇలా మార్పు వస్తుందని అనుకోలేదు కాస్త కష్టం వస్తే వేరుగా వెళ్లిపోవాలని అనుకుంటారా అని అంటుంది. అప్పుడే అఖిల్ వచ్చి ఆఫీసు నుంచి ఇల్లు చాలా దూరంగా ఉంది జెస్సి భోజనం కూడా చేయకుండా ఎదురుచూస్తుంది, ప్రెగ్నెంట్ కదా తినకుండా బాధపడుతుంది. మా మావయ్య ఇల్లు ఆఫీసుకి దగ్గర మేము అక్కడ ఉండాలని అనుకుంటున్నామని అఖిల్ ప్లాన్ వేస్తాడు. అది విని జ్ఞానంబ షాక్ అవుతుంది. అందుకని నీ భార్యని తీసుకుని వెళ్లిపోతావా, కావాలంటే ఇంటికి దగ్గరగా పని చూసుకోమని చెప్తుంది. అఖిల్ ఎన్ని చెప్పిన వినదు. ఏం జరుగుతుందో అర్థం కాక జెస్సి చూస్తూ ఉంటుంది. నెలరోజులే అంటున్నావ్ కదా నీకు నచ్చినట్టే మీ మావయ్య ఇంట్లోనే ఉండమని జ్ఞానంబ చెప్తుంది. జెస్సి విషయం చెప్పబోతుంటే ఆపి లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు.


Also Read: తులసిని ఆకాశానికెత్తేసిన మాజీ మొగుడు- కుటుంబం ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న నందు


ఈ ఇంటి నుంచి వెళ్లిపోదామని నీతో నేను చెప్పానా అని జెస్సి అంటుంది. మా నాన్న నిన్ను ఉండమని ఎప్పుడు అడిగారని నిలదీస్తుంది. మీ నాన్నని నేనే అడిగాను ఈ ఇంట్లో ఉండటం ఎందుకని స్వార్థంగా మాట్లాడతాడు. నీతో నేను రాలేనని అనేసరికి అయితే నువ్వు ఇక్కడే ఉండిపో అని జెస్సిని అఖిల్ బెదిరిస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టుగానే ఉంటానని అంటాడు.