+వసు, రిషి ప్రాజెక్ట్ టూర్ కి బయల్దేరతారు. మధ్యలో ఆగి కాఫీ తాగుతారు. ఇలా బయటకి వచ్చి కాఫీ తాగడం బాగుంది కదా అని వసు అంటుంది. నీతో ప్రతిక్షణం బాగుంటుంది. కానీ ఈ ఆనందం ఎప్పటికీ ఉండదు కదా ఇలా జరగకపోయి ఉంటే బాగుండేదని రిషి మనసులో అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు ఎండీ గారు అని వసు అడుగుతుంది మనసులో మాత్రం మై ఎండీ మై డార్లింగ్ అని అనుకుంటుంది. ఇక టూర్ లో భాగంగా వసు, రిషి పిల్లల్ని కలుస్తారు. రి/షి గురించి చాలా గొప్పగా చెప్తుంది. ప్రతీ సారి మై ఎండీ అని అంటూ ఉంటుంది. ఏంటి వసుధార ఇలా మాట్లాడుతుంది ఎలా అర్థం చేసుకోవాలని రిషి ఆలోచనలో పడతాడు. పిల్లల చదువు కోసం డీబీఎస్టీ కాలేజ్ కిట్స్ ఇస్తుందని, వాళ్ళని దత్తత తీసుకుని చదివిస్తామని వసు చెప్తుంది.


Also Read: తులసిని ఆకాశానికెత్తేసిన మాజీ మొగుడు- కుటుంబం ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న నందు


రిషి మాట్లాడుతూ వసు గురించి వంకరగా పొగుడుతాడు. ఎండీ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని నొక్కి మరీ చెప్తాడు. పిల్లలు కిట్స్ తీసుకుంటూ వసుధార మేడమ్ లాగా చదువుకోవాలి ఆమెలాగా ఎవరికి అందనంత ఎత్తుకి ఎదగాలని కౌంటర్ వేస్తాడు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళమని అడుగుతారు. వసు బ్యాగ్ లో చాక్లెట్ తీసి ఒక్కటే ఉందని అనేసరికి రిషి దాన్ని తీసుకుని లటక్కన నోట్లో వేసుకుంటాడు. వసు తర్వాత ప్రేమగా రిషికి వడ్డిస్తుంది. రాగి సంకటి తింటూ పచ్చిమిర్చి ఇచ్చి కొరకండి చాలా బాగుంటుందని వసు అంటుంది. రిషి వాళ్ళకి భోజనం పెట్టిన ధర్మయ్య వాళ్ళు రిషి, వసుని భార్యాభర్తలు అనుకుంటారు. చిలకా గోరింకల్లాగా చక్కగా ఉన్నారని అంటారు. రిషిని వసు సర్ అని పిలవడం విని మొగుడిని సర్ అంటున్నారని అడుగుతుంది.


మా ఊర్లో అయితే ఏవండోయ్, ఏవండీ అని పిలుస్తారని ఆమె చెప్తుంది. వసు రిషిని పెనీమిటీ అని పిలిచి ఇలా కూడా అంటారు కదా అని నవ్వుతుంది. మీరు మా ఊరికి వచ్చి సాయం చేశారు వెళ్లేటప్పుడు మీ దంపతులకి బట్టలు పెడతాం కదనకండని ధర్మయ్య అనేసరికి రిషి బిత్తరపోతాడు. వసు కావాలని ఏమైంది రిషి సర్ అని అడుగుతుంది. రిషి చెప్పొచ్చు కదా మనం భార్యాభర్తలం కాదని వసుతో గుసగుసలాడతాడు. మీరే చెప్పండి నాకేం పని అని వసు అనేసరికి పొగరు అని తిట్టుకుంటాడు. వెళ్లొస్తామన రిషి అనేసరికి వచ్చే సంవత్సరం నాటికి పాపతోనే బాబుతోనే మా ఇంటికి రావాలని అనేసరికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.


Also Read: అభిమన్యుని గుడ్డిగా నమ్ముతున్న మాళవిక- నిజం తెలుసుకుని బాధపడ్డ వేద


రిషి కావాలని కారుని అడ్డదిడ్డంగా నడుపుతాడు. రోడ్డు మీద గతుకులు నన్నేం చేయమంటావ్ అని అంటాడు. తను ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నా ఎవరు అతను అని అడుగుతాడు. కానీ వసు మాత్రం వినపడలేదని నటిస్తుంది. నా జీవితంలో లేవని బాధపడాలో ఈ రకంగా అయినా నా పక్కన ఉన్నందుకు సంతోషించాలో అర్థం కావడం లేదని రిషి మనసులో అనుకుంటాడు. నాకు కాదు నిజంగా రిషి సర్ కి పొగరని అంటుంది. అప్పుడే మినిస్టర్ ఫోన్ చేసి ప్రోగ్రామ్ గురించి అడుగుతాడు. ఇద్దరూ వెళ్ళి మినిస్టర్ ని కలుస్తారు. వసు చెప్పింది విని తనని మెచ్చుకుంటాడు. పెళ్లి చేసుకున్నందుకు మినిస్టర్ వసుకి చీర బహుమతిగా ఇస్తాడు. రిషిని కూడా రమ్మని పిలిచి ఇద్దరూ కలిసి చీర పెడతారు. మీవారు ఏం చేస్తారని మినిస్టర్ అడిగేసరికి వసు ఏం అల్ రౌండర్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్తుంది. ఇద్దరూ కలిసి భోజనానికి రావాలని పిలుస్తాడు.