కేఫ్ లో తులసి పూజ చేసి హారతి ఇస్తుంటే లాస్య వచ్చి గొడవ చేసి మరీ తనే ఇస్తుంది. ఆ గొడవ చూసి వచ్చిన కస్టమర్ కూడా పారిపోతాడు. కేఫ్ స్టార్ట్ చేసి చాలా సేపు అయినా కూడా కస్టమర్స్ ఎవరూ రాలేదని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరు రారాని ముందే చెప్పాను నా మాట వినలేదని లాస్య దెప్పిపొడుస్తుంది. పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా అని తులసి అంటుంది. కానీ లాస్య మాత్రం నోరు మూయదు. ఎవరు రాకపోవడంతో అందరినీ తలా ఒక టేబుల్ దగ్గర కస్టమర్స్ లాగా కూర్చోమని చెప్తుంది. మనం కస్టమర్స్ లాగా కూర్చోవడం ఏంటని లాస్య అంటుంది. కేఫేలో జనాలు నిండి ఉంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారని నందు చెప్తాడు.


Also read: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది


తులసి డైరెక్షన్ లో అన్నీ రకాల వేషాలు వేశాం టైమ్ వెస్ట్ చేసుకోవడం అనవసరం ఇక ఇంటికి బయల్దేరదామా అని లాస్య అంటుంది. ఇంట్లో ఏమైనా లంకె బిందలు దాచావా ఎందుకు అంత ఆరాటం అని అనసూయ అంటుంది. ఒక్క కస్టమర్ వచ్చినా తన పేరు మార్చుకుంటానని లాస్య అనగానే ఇద్దరు కస్టమర్స్ వస్తారు. కాటర్ చీజ్, కీటో బర్గర్ కావాలని కస్టమర్స్ అడుగుతారు. మెనూలో లేదని నందు అనేసరికి వాళ్ళు వెళ్లిపోవాలని అనుకుంటారు. పర్లేదు రెడీ చేసి ఇస్తామని చెప్తారు. చెఫ్ కి కీటో బర్గర్ ఎలా చేయాలో తెలియదని అనేసరికి నందు, ప్రేమ్ టెన్షన్ పడతారు. కీటో బర్గర్ రాని చెఫ్ ని పెట్టుకుని కేఫ్ పెట్టుకున్నారా అని వచ్చిన కస్టమర్స్ అంటారు. చేయిస్తాను కూర్చోమని నందు సర్ది చెప్తాడు. లాస్యని అడుగుతాడు కానీ రాదని అబద్ధం చెప్తుంది.


Also Read: అభిమన్యుని గుడ్డిగా నమ్ముతున్న మాళవిక- నిజం తెలుసుకుని బాధపడ్డ వేద


రెండు నిమిషాల్లో రెడీ చేసి ఇస్తానని తులసి చెప్పడంతో వాళ్ళు వెనక్కి వస్తారు. కీటో బర్గర్ చేసి తులసి సర్వ్ చేస్తుంది. అది తిన్న అమ్మాయి ఇది కీటో  బర్గర్ నా అని అంటుంది. దీంతో లాస్య నోటికి పని చెప్తుంది. టెస్ట్ చేయగానే హెవెన్ కనిపించింది, అధ్భుతంగా ఉందని ఆ అమ్మాయి మెచ్చుకుని ఆర్డర్ ఇస్తుంది. నందు సంతోషంగా తులసిని మెచ్చుకుంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు. గాయత్రి ఇక నందుకి బ్రెయిన్లో విషం నింపడానికి వస్తుంది. కానీ నందు మాత్రం తనకి గట్టిగా సమాధానం చెప్తాడు. అనసూయ తులసిని మెచ్చుకుంటుంటే లాస్య అడ్డుపడుతుంది. కేఫ్  క్లోజ్ చేయాల్సిన టైమ్ అయ్యింది మూసేద్దాం పదండని లాస్య అంటుంది.


తులసి నందుకి అన్ని జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు కూడా పక్కనే ఉంటావు కదా అని నందు అంటాడు. మీ కేఫే బాధ్యతలు చూసుకోవడానికి మీ ఆవిడ ఉందని తులసి అంటుంది. నువ్వు ఆరాటపడటం లేదా అని నందు అడుగుతాడు. మొదటి సంపాదన తులసికి చూపించి చాలా సంతోషంగా ఉందని అంటాడు. దీనికి కారణం నువ్వే, నీకు ఎంతో హాని చేసిన నాకోసం ఎంతో చేశావ్ నీ రుణం తీర్చుకోలేనని నందు మెచ్చుకుంటాడు. ఆల్ ది బెస్ట్ చెప్పేసి తులసి వెళ్ళిపోతుంది. కేఫ్ లో లాస్య చేసిన గొడవ గురించి తులసి ఆలోచిస్తూ ఉంటుంది.